Total Pageviews

Thursday, March 19, 2015

మన చిట్కాలు .

ఆరోగ్యం గా , అందం గా  వుండాలని  ,ఎవరికీ వుండదు  చెప్పండి ? కొంతమందికి  ఎంతవయసు  వచ్చినా అసలు
తెలియనే  తెలియరు . మరికొంతమంది  చిన్నవయసు లోనే  ముదురుల్లా  అన్పిస్తారు . మనజీన్స్  ఎలాంటివైనా
కొన్ని జాగ్రత్తలతో , అందాన్ని  ఆరోగ్యాన్ని   కాపాడుకోవచ్చు . మన ఆడవాళ్లకు  జుట్టు  అంటే ఎంత ప్రేమో  ,                            
1   పెరుగులో  మెంతి పిండి  వేసి రాత్రంతా వుంచి  తలకు పెట్టేది .
     ఇది జుట్టు మెత్తగా  అవడానికి  పనికి వస్తుంది .2   గోరింటాకు  తలకు పెట్టె వాళ్ళు ,టీ  డికాషన్ లో  కలపకూడదు .
     పెరుగులో  మాత్రం  కలపాలి . రాత్రి కలిపి వుంచి  పొద్దున తలకు
     పెట్టుకుని  నీళ్ళతో  మాత్రమే  కడగాలి .'' తర్వాత రోజు ,కొబ్బరి నూనె
     రాసి  ఒకగంట ఆగి  షాంపూ చెయ్యాలి'' . తలలో చుండ్రు  ఉన్నట్లయితే
     బీట్ రూట్  రసం తో గోరింటాకు కలిపితే ,చుండ్రు వదిలి పోతుంది . రంగు
     వద్దు  కేవలం  మెత్తదనం కోసం  అనుకుంటే ,కొబ్బరి నూనె రాసి ,గోరింట
       ఆకు పెట్టుకోవాలి .3    కలిపే విధానం తెలుసు గా ,ఒక  కప్  గోరింట పొడి ,గుంటగల గరాకు  పొడి  ఒకస్పూన్ ,ఉసిరి పొడి
      సగం స్పూన్ , నాలుగు చుక్కల యూక్ లిప్ట స్  ఆయిల్ , నాలుగు చుక్కల  నిమ్మరసం ,నీళ్ళతో
      కలిపి  రెండు స్పూన్ల  పెరుగు వెయ్యాలి , లేదా  పైన చెప్పినట్లు  బీట్ రూట్  రసం  తో మొత్తం
      కలుపుకోవచ్చు .వాసన నచ్చకపోతే  జుట్టు కడిగేటప్పుడు నిమ్మచేక్క పిండి న  నీళ్లు పోసుకోవాలి .


4    మొహానికి , తురిమిన  ఆలుగడ్డ [బంగాళదుంప] లో నిమ్మరసం  వేసి  మొహమంతా మృదువు గా
      రాయాలి . మిగిలిన మిశ్రమం  కళ్ళ మీదవుంచి పా వుగంట  తర్వాత  చల్లని నీళ్ళతో  కడగాలి .
       మీరిక కెమికల్  బ్లీచ్ వాడే అవసరం  రాదు .       మచ్చలు  ముడతలతో పాటు ,చెడు అలవాట్ల వల్ల  కళ్ళకింద  వచ్చిన  ముడతలు  పోతాయి .
        అన్నట్లు  వట్టినిమ్మచేక్కరాసినా  బ్లీచ్  అవుతుంది  కాని ఎండలోకి  వెళ్ళకూడదు  మొహం
         నల్లబడుతుంది .

5   '' టమాట  మధ్యకి  కట్ చేసి ,రెండుచేతుల  పట్టుకుని  చెంపల మీద  పైకి తిప్పుతూ  మొహం
      అంతా రాయాలి ,20 నిముషాలు ఆగి  కడిగేస్తే  ఎండవల్ల  వచ్చిన ''టాన్ '' పోతుంది . స్కిన్
      లో కూడా చాల మార్పు  గమనించవచ్చు  వారానికి  రెండుసార్లు  చేస్తే చాలు ''.6     మగవాళ్ళకి  ఎండలో తిరగడం  వల్ల  వచ్చే నల్లని  మచ్చలు  వలయాలు ,పోవాలంటే ,అలోవేర
       [కలబంద ] గుజ్జులో నిమ్మ రసం  నాలుగు చుక్కలు  వేసి  మచ్చలమీద  రాసి ఆరాక  కడిగేయాలి .
      '' ఏన్ని  మందులు వాడినా  తగ్గని  మచ్చలు ,ఇలా వారానికి   నాలుగు సార్లు చేస్తే  పోతాయి'' .


7     మీది పొడి  చర్మమా , తేనే  రాసి చుడండి , కాస్త బొంబాయి  రవ్వలో  తేనే  నీరు  వేసి ముద్దలా
       చేసి  మోహము  మెడ  రాసి  కాస్తాగి కడగాలి  మృదువైన  చర్మం మీసొంతం .అలాగే  పొడిచర్మం
       ముడతలికి  అవకాసం  ఎక్కువ  కనుక  ,నూనె  మసాజ్  వారానికి  ఒకసారన్నా అవసరం .


8     గుడ్డులోని  తెల్ల సోన  లో  కాస్త  పసుపు ,ముల్తాని మిట్టి  కలిపి ,రాస్తే  ముడతలు  తగ్గుతాయి .
        తెల్లసొన  ఎలాంటి  వాసనా  వుండదు , కనుక  నిరభ్యంతరంగా  వాడచ్చు . ఇదే  తెల్లసొన
         కండిషనింగ్  కొసమ్ జుట్టుకి  వాడితే , కడగడానికి  చల్లని  నీరుమత్రమే  వాడాలి .


9     మోచేతులు నల్లగా  ఉన్నాయా  ఐతే  వాడేసిన  నిమ్మచేక్కలో కొంచెం  సాల్ట్ వేసి  రుద్దితే
       నలుపు విరిగి పోతుంది . మేడలో గొలుసువల్ల  వచ్చిన నలుపు కూడా పోతుంది .


10    ముఖ్యమైన  విషయం ఏమిటంటే , చెప్పాను  కదా అని  అన్ని కలిపి చెయ్యవద్దు . మీకు ఏది
         అందుబాటులో   వుందో తరచూ అంటే  వారానికి  కనీసం మూడు సార్లన్న  చెయ్యగలి గినది
         ఎంచుకుని  అది   మాత్రం  చెయ్యండి .


11     చెప్పినవన్నీ  మొహం తో పాటు మెడకు కూడా చేసే అలవాటు చేసుకోండి . అప్పుడే బావుంటుంది .
         వీటిలో  ఏ విధమైన  హానికర పదార్ధాలు  లేవు  అన్ని  వంటింటి  లోని ఉపయోగించే పదార్దాలే
         కనుక  ఎటువంటి  హాని  జరగదు .


12     జలుబు  వున్నప్పుడు  విక్స్  కాని  బామ్  కాని ,వేడినీళ్ళలో  వేసి  ఆవిరి పట్టండి . అదే బాగా
       ''  గొంతు నొప్పిగా ఉందనుకోండి  గ్లాస్ నీళ్ళలో స్పూన్ జీలకర్ర చిటికెడు  పసుపు  ఉప్పు  వేసి
         మరిగించి ,వడపోసి  తాగి చూడండి''   ,ఎంత త్వరగా    ఉపసమనం  వుంటుందో .


13     రాత్రిపూట  మజ్జిగ  మానేస్తే  పొట్ట రాదట , పెరుగుకన్నా ,చిలికిన మజ్జిగ మంచిదట .


14     పడుకునే ముందు పాలలో  పటిక  బెల్లం పొడి వేసుకుని  తాగితే నిద్ర బాగా  పడుతుంది .


16     ఎలర్జీ  వల్లబాధపడే  వాళ్ళు,  తుమ్ముల తో  ఆస్తమా  తో ఇబ్బంది పడేవాళ్ళు  రోజూ  తాగే
        ''  నీళ్ళు వేడిచేసుకుని  తాగడం అలవాటుచేసుకోవాలి '',  ప్రతిరోజూ గోరువెచ్చగా  నీరు త్రాగడం
         వల్ల  ఎన్నో వుపయగాలు  వున్నాయి ,పొట్టకు మంచిది , మొహానికి  ముడతలుకుడా రావట .
17      ప్రొద్దున్నే  చెక్క నిమ్మ  రసంలో   స్పూన్ తేనే కలిపి తాగితే , వళ్ళు తగ్గుతుంది  తెల్సుగా
          అలాగే కళ్ళలో వయసు వల్ల   మెరుపు తగ్గడం  వుండదు . తుమ్ములు  అలర్జీ  కూడా
           తగ్గుతుంది .  తగ్గలేదంటే ,పడలేదేమో చూసి  తేనే   మానే సేయ్యండి .


18      గ్ర్రెన్ టీ  తాగడం వల్ల  షుగర్ వచ్చే అవకాశాలు ,మోహంలో  ముడతలు  వచ్చే  అవకాశాలు
         తగ్గడం  తో  పాటు ,పోట్టకుడా  తగ్గుతుంది .  వాడేసిన  టీ  బాగ్స్  కళ్ళమీద  పెట్టుకుంటే
         రిలాక్సేషన్  తో బాటు , దిగులుగా వుండే  కళ్ళకు  మెరుపు వస్తుంది .

19      ఏ మచ్చలు  లేని మంచి రంగు , చర్మం  ఉన్నాయా , ఐతే  మీరు నెలకి  ఒకసారన్నా ఈ ప్యాక్
          వేసుకోవాలి ఇక మీదట కూడా  ఏ  ఇబ్బందులు  రాకుండా ,సెనగ పిండి [బేసన్ ] లో ఒక చెక్క
          నిమ్మరసం  , ఒకపెద్దస్పూను పెరుగు ,చిటికెడు పసుపు ,వేసి కలిపి ,మొహానికి  మెడకి ,
           అవసరం అనుకుంటే చేతులకి  వేసుకుని , ఆరాక కడిగెయ్యాలి . ఇద    మచ్చలు , ముడతలు ,
            రాకుండా  చర్మం  నునుపుగా  ఉండటానికి  పనికొస్తుంది .
                                               ****************************

     
                                       


2 comments:

  1. Good chitkaas... shared in my FB Timeline... Best wishes to you on the occasion of this Manmatha nama samvatsara Telugu Ugadi!

    ReplyDelete
  2. namaste ,meeekukuda manmadha nama samvatsara ugadi subhakankshalu.

    ReplyDelete