Total Pageviews

Thursday, February 26, 2015

నాకొచ్చిన కల ............


''త్వరలో  సెజ్  లో  కాని ,సాగర హారం ,లో కానీ భాగం   కానున్న మా[వారి ] వారసత్వపు  భూములు .'

''నానీ  గ్రౌండ్  అంటే ఏమిటి ?'' అంటే  ఇదే నాన్నా   కాలితో  ఫ్లోర్  మీద  తడుతూ  చూపించాను
.'' ఉహు  కాదు ఇది   కాదు  ఇది మల్హోత్రా  అంకుల్   వాళ్ళ రూఫ్
మనం  వుండేది  99 ఫ్లోర్  మీ డాడి  కావాలని  ఇంత ఎత్తు లో  కొన్నాడు .
ఎన్ని ఫ్లోర్  లు దిగినా ,ఎన్ని ఫ్లోర్ లు  ఎక్కినా  ఎవరో  ఒకరి  రూఫ్ మాత్రమే  వస్తుంది .
 ''మరి మట్టి  అంటే '' మట్టా ? ఇవన్ని  ఎవరు చెప్తున్నారు నీకు ? ''మట్టి లో  మొక్కలు ఉంటాయట ,ఇంకా పూలు
పళ్ళు  వస్తాయట ? ఆశ్చర్యంగా  చూసాను  వాడి ముద్దు మోములో  బోలెడన్ని  సందేహాలు . అవన్నీ  గత
వైభవాలు , ఇపుడు  వాటి ఆనవాళ్ళు  కూడా లేవు . అవన్నీ ఎందుకు కాని  నువ్వు వెళ్లి  టి  వి  చూడు మమ్మీ
వచ్చే టైం ఐంది  వస్తూ  ఈరోజు ,బర్గర్ లు  తెస్తుంది  వీకెండ్ కదా .. ''ఓహ్  నానీ మర్చిపోయా  ఈరోజు  మనం
ఫుడ్  తింటాము  కదూ .. '' ఆనందం గా  గంతులేస్తూ  వెళ్ళాడు . ఈరోజు  శుక్రవారం  మా  కోడలు వస్తూ బర్గర్
తెస్తుంది ,అవి మేరీ  బిస్కెట్స్  లా  ఇంతే వుంటాయి , వాటిని  నీళ్ళు చల్లి  ఓవెన్  లో పెడితే  పెద్దగా వుబ్బుతాయి
అవే తింటాము ,అదీ వేడిగా ! రోజూ  మాత్రం మూడు పూటలా  మూడు ''స్టమక్ ఫుల్ '' మాత్రలేసుకుంటా ము  .
అవిచాల ఖరీదు తో కూడినవి  కనుక ఇప్పటి వాళ్ళంతా  పెద్దవాళ్ళని  దగ్గర పెట్టుకోవడం ,పిల్లలిని  కనడం
మానేసారు . ఏదో మా  కోడలు  మంచిది కనుక ,మా వారిని నన్ను వుండనిచ్చింది . మనవడు  కావాలంటే
కనిచ్చింది . కొన్నేళ్ళ ముందు  దేశాన్ని సింగపూర్ చేస్తామంటూ , పండే పొలాల్లో  సిమెంట్ పోసారు , బిల్డింగులు
కట్టి  ,మట్టనేదే లేకుండా చేసారు . గేసు తోడే క్రమం లో   సగం పొలాలు , క్రూ డాయిల్  లీకేజీ వల్ల  మరికొన్ని
పొలాలు ,సెజ్  లంటూ కొన్ని ,మిగతావి  ఔటర్ రింగ్ రోడ్డు లంటూ ,భూమాత కనుమరుగైంది . ఆకాశా హర్మ్యాలు
వెలిసాయి . కొత్తలో మేము  ఇదే బాగుందను కున్నాము . కాని వారమంతా బర్గేర్స్ ,ఆదివారం పిజాలు లేదా
చపాతీలు తినేవాళ్ళం . పండుగలకి అన్నం వండుకునే వాళ్ళం ,అవి  దిగుమతి చేసిన బియ్యం  కావడం  వల్ల
వెయ్యి రుపాయలనించి ,ఐదు వేలవరకూ   కిలో బియ్యం ధర వుంటుంది . కాని ఆకుకూరలు ,టమాటాలు
కూరగాయలు  లాంటివి దొరక్క పోవడం వల్ల  ఆ  అవసరం కూడా లేకపోయింది . కనీసం ఇళ్ళలో  పండించే
వీలు లేకుండా ,మట్టికుండీలు  కూడా  కనుమరుగయ్యాయి . మట్టి తో చెయ్యాలిగా . పోన్ చేస్తే  వచ్చే పిజాలు
బర్గర్ లు  తిని కూచుని  టి  వి లు  చూస్తూ  జనం  వింత రోగాల బారిన పడ్డారు ,జనాభా బాగా తగ్గింది  ఎక్కడో
మాలాగా ఒకటి అరా  తప్ప 40 ల్లొనే  ప్యాక్ అప్  చేసేసారు . 99 అంతస్తుల  మా అపార్ట్  మెంట్ లోనే  మా
వయసు వాళ్ళని వేళ్ళమీద  లెక్కపెట్టొచ్చు , పసివాళ్ళ నికుడా  అంతే .

నేను నెట్  ఆన్  చేసి  పంట పొలాల కోసం వెతికేను  అబ్బే  ' అయ్యో మీరు వెతికే  పేజ్  దొరకలేదు ' అని
వస్తోంది . మొక్కలు  కుండీలు ఇమేజ్ ల  కోసం వెతికేను ,ఉహు ... ఎక్కడ చూసినా  బిల్డింగులు ,సిమెంట్ .
మట్టి వాసనే లేదు .  చినుకులు పడుతుంటే  తడిసిన  మట్టి  నుంచి  వచ్చే  ఆ  కమ్మని వాసన పీల్చని
బ్రతుకెందుకు ? ఏ  పేజ్ వెతికినా  ఆన్  లైన్  లో  ''స్టమక్  ఫుల్ '' మాత్రలు కొనమనే  వస్తోంది ? .

చుర్రు మనేసరికి  ఉలికి పడి లేచా ''లే  ఇవాళ  లంచ్  బాక్స్  కట్టవా '' అన్నారు . జీవితమంతా  తిండి గోలే
 కలలో  లాగ  ఆ   ''స్టమక్ ఫుల్ ''   మాత్రలేప్పుడొ స్తాయో  ఏ మిటో .. ............

                                       ************************************

4 comments:

  1. నేను ఆ దృశ్యం ఊహించనుకూడా ఊహించలేను.......బాబోయ్ కలకూడా ఇంత భయంకరంగా వద్దు దేవుడా..

    ReplyDelete
  2. కలే కాని ,నిజమవ్వుద్దేమో అని భయంగా వుందండి . వందనాలు ...

    ReplyDelete
  3. నిజంగానే నిజమవ్వకూడదని కోరుకొనే కల.

    ReplyDelete
  4. కిషోర్ వర్మ గారు , ధన్యవాదాలు మీ స్పందన కి ,

    ReplyDelete