తెల్లవారుతూ నే టైటాన్ వాచ్ లో టైం చూసి ,స్లీప్ వెల్ పరుపు మీంచి లేచి కూర్చుంది ' తను' , శంకు మార్కు
లుంగీ , గోకుల్ బనియన్ తో అటుతిరిగి పడుకున్న 'మనూ ' కి ఒకటి అంటించింది తనూ , పూర్వం పాద
నమస్కారం చేసే వారట లెండి . ''ఇప్పుడంత టైమేక్కడిదండి ?'' . పారగన్ చెప్పులేసుకుని ,దగ్గరగా రా అనే
క్లోస్ అప్ తో పళ్ళు తోముకుని ,లక్స్ తో స్నానం చేసి , పల్లవి కాటన్ చీరతో బయటికి వచ్చింది . అప్పటికే
నిద్ర లేచిన మనూ 7 o క్లాక్ తో షేవ్ చేసుకుంటున్నాడు . ఇద్దరూ దొడ్ల పాలతో సన్ రైస్ కాఫీ కలిపి తాగేరు .
మనూ తలకి ట్రాఫిక్ వల్ల కానీ బాస్ వల్లకాని ఏ తలనొప్పి రానివ్వని ,నవరత్న ఆయిల్ రాసింది . లైఫ్ బాయ్
ఎక్కడ వుంటే ఆరోగ్యం అక్కడ వుంది అనే సబ్బుతో స్నానం చేసి ,మగవాళ్ళ చర్మానికి సరిపడే ఫెయిర్ నెస్ క్రీం
రాసుకుని వచ్చాడు . తనూ చేసిన ''డబుల్ హార్స్ మినప గుళ్ళు ''తో చేసిన ఇడ్లీ తిన్నారు . అబ్బా అవి' ఇనప '
గుళ్ళు కా దండీ మినప గుళ్ళే , ఎంత ఇడ్లీ కాస్త గట్టిగా వుంటే మాత్రం హన్నా ... ఇంతలో చంటాడు లేచాడు .
రాత్రంతా హాయిగా నిద్ర పోయే డైపెర్ మార్చి ,డాక్టర్ తల్లి కాక పొఇన వాడికి జాన్సన్ సోప్ తో లాలపోచి ,
డైపెర్ , జుబ్బా వేసింది . వాడు మళ్లీ బట్టలు తడుపు కునే లోపే మనూ వాణ్ణి ఒకసారి ఎత్తుకుని ''ఒంటి నాన్న
ఒంచె త్తున్నలు '' అని పయ్ కేగరేసి తనూ కిచ్చేసాడు . తన వి కే సి ప్రెడ్ చెప్పులేసుకుని ,సామ్ సుంగ్
పోన్ తీసుకుని ,సిగ్నో వేరా డబ్బా లో భోజనం తీసుకుని ,అబద్దం చెప్పినా పోన్ చేసి ఒప్పుకునే కిన్లే వాటర్
బాటిల్ ,అసెర్ లాప్టాప్ తో అమేజ్ కార్ లో బయల్దేరాడు ఆఫీస్ కి . ముందు బైక్ వుండేది కానీ ఇ సి జి
ప్రాబ్లం వల్ల అందరు పుష్ప రాజ్ అంటుంటే ,ఈ మధ్యే కార్ కొన్నాడు .
బాబు కి దుర్గా నెయ్యి తో ఇడ్లి పెట్టి , కెంట్ వాటర్ పట్టించి ,లయ్ జోల్ తో తుడిచిన గచ్చు మీద కూర్చో
పెట్టింది . విమ్ తో గిన్నెలు కడిగి ,పది చేతులు అవసరం లేని సర్ఫ్ ఎక్సెల్ వేసి ,బట్టలన్నీ ఐ ఎఫ్ బి
వాషింగ్ మెషీన్ లో వేసింది . బట్టలు తడుపు కున్న చంటాడికి బట్టలు మార్చిపాలు పట్టి పడుకో బెట్టింది .
లలితా బ్రాండ్ బియ్యం తో చేసిన అన్నం ,సన్ఫ్లవెర్ ఆయిల్ తో చేసిన కూర తెచ్చుకుని ,టి వి చూస్తూ
తింది . ఆ సీరియల్ కి అమృతాంజన్ ఏ డ్ మరి వాళ్ళకి ఎలా తెల్సో తప్పకుండా తలనొప్పి వస్తుందని .
వెంటనే ఒంటరి గా వున్నా బలహీనం కాదు ,''ఇక స్టూ హూల్ మీదే నిన్చోవాలను కుంటా 'అనే మీరా
కొబ్బరి నూనె రాసుకుంది . తనూ పెద్ద అందగత్తె కాక పోఇన ' డవ్ ' మోడల్ లా మాత్రం వుండదు .
తెలుగు షాది . కామ్ లో [తెలుగు లో'''షాది ''ఏమిటో ]చూసి మనూ వాళ్ళు ఆమె ని ఇష్టపడి వచ్చారు .
తనూ వాళ్ళింట్లో అంబికా అగరబత్తి వెలిగించి వుండడం తో వెంటనే పెళ్లి చే సే సుకున్నారు? . చంటాడి
ఆ లా పన తో వాడ్ని తెచ్చి లైట్ గా వుండు లైట్ గా తిను అనే మేరీ బిస్కెట్ తినిపించింది . తను మాత్రం
''అన్ హేల్డి చిరుతిళ్ళు హాబిట్ '' మన్పించే 3 రోజ్ ఎస్ టీ తాగింది . పిల్స్ బరి ఆటా తో చపాతీ ,చేసి
బిగ్ బజార్ వారి బుధవారం మార్కెట్ లో కొన్న ఆలు తో కూర చేసింది . మమ్మీ అంటే నమ్మలేని సోప్
సంతూర్ , చిక్ షాంపూ తోనూ స్నానం చేసింది . గోద్రెజ్ బీరువా లోంచి , కళామందిర్ శారి తీసి కట్టుకుంది .
పెళ్ళికి మూడేళ్ళు టైం అడిగే క్రీమ్ [పెళ్లి అయ్యాక రాసు కోవచ్చా ] రాసుకుంది . మనూ వచ్చి 'కాకర కాయ
కూర ,కాకరకాయ వేపుడు ఈ వారం లో ఇది నాల్గో సారి అని విసుక్కోకుండా ఉండేందుకు జెట్ మాట్
వెలిగించింది . బాబుని ఎత్తుకుని ,ఏ షియన్ పెయింట్ వేసిన తమ ప్రకృతి విల్లా ముందు నించుంది .
తన నోకియా పోన్ లో ,డొక్కో పో సారీ డొకో మో సిమ్ వేసి ఫ్రెండ్ తో కబుర్లు చెపుతోంది . దూరంగా
తమ అమేజ్ కార్ వస్తూ కన్పించింది . మురిసి పోతూ బాబు కు చూపెట్టింది . మనూ రాగానే ముగ్గురూ
లోపలికి వచ్చారు . క్విక్కర్ లో కొన్న సోఫా లో కూర్చున్నారు .పండుగ సీజన్ కాబట్టి టి వి లో వస్తున్న
ముద్దుల పోటీలు చ చ అచ్చుతప్పు ,ముగ్గుల పోటీలు చూస్తూ కూర్చున్నారు . ఆ తర్వాతేమో .....
రాత్రి భోజనం చేసి ,బాబుని బజ్జో పెట్టింది . బోంబే డైయింగ్ బెడ్ షీట్ వేసి ,యంగేజ్ స్ప్రే చేసింది .
హబ్బా ఇంకా ఏమిటి చూస్తున్నారు ? ఇంకేమి రాస్తాం ? టుయ్ .......... టుయ్.. సెన్సార్ . బై ..........
[ఎందుకన్నా మంచిది ] కేవలం సరదా కే నండోయ్ ............
**********************************
మీరు ఓ ముఖ్యమైనది మర్చిపోయారనుకుంటా... బాబు బట్టలు తడుపుకోకుండా వేసే " డయపర్లు "....
ReplyDeleteనమస్తే అండీ , మీ కామెంట్ కి కాస్త ధైర్యం వచ్చింది
ReplyDeleteతిట్టలేదు కదా మధ్యలో ఒకసారి మాత్రమే డైపెర్ ప్రస్తావించాను
jeevitham antha commercial aipoindho............... cheppakane chepparu,.........SUMNDI..
ReplyDeletemeeru bhale catch chesaru.
ReplyDelete