Total Pageviews

Thursday, January 22, 2015

ప్రయాణం చేస్తున్నారా ...



భయపడే వారు ,వ్యక్తిగతం గ  తీసుకునేవారు  ఈ టపా  చదవద్దని  మనవి .
మీరు  ఎక్కడికన్నా  వెళ్ళాలను కుంటున్నారా ,అదే ప్రయాణం చెయ్యాలను  కుంటున్నారా ,మీ తల్లి తండ్రులను కాని ,అక్క చెల్లెళ్ళను ,అన్నాదమ్ము ళ్ళను ,చూసి రావాలను కుంటున్నారా అని ? ఐతే ఒకపని  చెయ్యండి . మీరు
వెళ్ళే దారి పొడవునా ,కొండలు ,లోయలున్నాయా ,ఘాట్ రోడ్ వుందా , చెరువులు  అడవులున్నాయా ,అని ముందు గా  తెలుసు కొండి . తర్వాత  మీ డబ్బంతా  వెచ్చించి , వాటర్ ప్రూఫ్ ,ఫైర్ ప్రూఫ్ ,బాంబు  ప్రూఫ్ ,అంటే
బాంబు లు పేలితే  నట్లు మేకులు  గుచ్చు కోకుండా  అన్నమాట . తలనించి కాలి బొటన వేలిదాక ఒక డ్రెస్ కొనండి .
వ్యోమ గామి  లాగన్నమాట . మీ ఆదార్ కార్డు కూడా  కాస్త పెద్ద గా పోటో ఫ్రేం కట్టించి  మీదగ్గర  పెట్టుకోండి ,ముఖ్య
గమనిక ఏమిటంటే  అది తడవకూడదు ,కాలకూడదు ,అదన్నమాట . ''తర్వాత '' మన గుర్తింపు  కార్డు అదే మరి.
వెళ్ళే ముందు  భీమా  చేయించండి ,విల్లు వ్రాసి పెట్టండి . ఏమో తిరిగోస్తామో  లేదో ? బస్సెక్కితే  లోయలో పడి
పోవచ్చు ,డ్రైవర్ తాగి వుంటే అసలే పోవచ్చు . రైలు ఎక్కితే  నీళ్ళలో పడచ్చు ,నిప్పు అంటుకోవచ్చు . కారు ఐతే
అంతే సంగతులు ,అదే తగలడి  పోవచ్చు . విమానమా ! ఇంకే   అడ్రస్  గల్లంతన్నమాట . చచ్చామని తెలిస్తే
ఏడుస్తారు ,బ్రతికున్నామని  తెలిస్తే ఎదురు చూస్తారు . ఏమయ్యమో  తెలియక పొతే ,అదొక త్రిశంకు స్వర్గం
ఇక్కడ త్రిశంకు నరకం అనాలేమో !

 మీ అదృష్టం  బాగుండి  క్షేమంగా  వూరు చేరినా ,మీరేక్కిన ఆటో  ని  అదుపు తప్పిన  కారు  గుద్దేయ్యొచ్చు .
మీరు రైలు  ఎక్కినట్లయితే  తస్మాత్ జాగ్రత్త , ఏ  హిజ్రాలో  వచ్చి ,ఏదడిగితే అది ఇచ్చెయ్యండి [సీంగిల్ మీనింగే ]  లేక పొతే రైల్ లోనించి  తోసేసినా  తోసేస్తారు .  ప్రాణాలకే  ముప్పు రావచ్చు .బెర్తు మీద  వాలే టప్పుడు  మీ
విలువైన వస్తువులు  చేత్తో పట్టుక్కు చోండి ,అర్ధ రాత్రి  దొంగలు వచ్చి భోగి  అంతా  దోచేస్తుంటే ,తన్నులు తినక
ముందే సమర్పించేయండి . ఎక్కడా  ఫిర్యాదు చెయ్యకండి . ఫలితం  వుండదు . ఇంత జరిగి  మీ సహస  యాత్ర
ముగిసి  మీరు మీ వాళ్ళని కలిసి క్షేమం   వెళ్లి లాభం గా తిరిగొచ్చార ? ఇకనేం  మీరు '' నిజ జీవిత  విజేతలు ''
 మళ్లీ ఇప్పట్లో ప్రయాణం పెట్టుకోకండి ,పోన్ లో మాట్లాడండి ,స్క్యప్  లో  కళ్లారా మీ  వాళ్ళను   చూసుకోండి .

ఒక  గృహిణి గా బయటికి  వెళ్ళిన  భర్త ,పిల్లల కోసం నేను పడే ఆందోళన మాత్రమే  మరోటి కాదని  సవినయం
 గ మనవి  చేస్తున్నాను . ఎవరినైనా నొప్పించి నట్లయితే  ,మన్నించండి .
                                     *************************************``

2 comments:

  1. అబ్బా! ఇంతుందా? ఎక్కడికీ వెళటం లేదు లెండి :)

    ReplyDelete
  2. నమస్కారం గురుగారు .. వార్తలు చూసి కూడా భయపడే ,పరిస్తితిలో వున్నాము .
    మానసికమైన ,అలజడికి లోనవు తున్నాము ,అదిచేప్పటమే నావుద్దేస్యం .

    ReplyDelete