Total Pageviews

Thursday, June 25, 2015

పేరు లో ''నేము''న్నది '' .




బారసాల  జరుగుతోంది ,బంధువులందరి  తో  ఇల్లంతా  సందడి గా  వుంది . పంతులు  గారి  మంత్రాలు వీధి  వరకు
వినిపిస్తున్నాయి . ''బాబూ  మీరు  మనసు లో పేరేమి అనుకున్నారో  ఆ పళ్ళెం లోని  బియ్యం  లో  రాసి అబ్బాయి
చెవిలో  ముమ్మారు చెప్పి ,బంగారు ఉంగరం తో పాలు నాలికకు రాయండి ,తర్వాత  అందరూ  వరుసలో  వచ్చి అదే
విధం గా  చేస్తారు'' . పిల్లాడి తండ్రి  ప్రసాదు  బియ్యం ఉన్న  పళ్ళెం లో  పేరు  రాయడం  మొదలు పెట్టాడు . చోటు
సరిపోక  పంతులు గారి వైపు  చూసాడు 'ఫర్లేదు  రాసిన చోటే రాయి నాయనా '' అనడం తో  హమ్మయ్య  అనుకుని
రాయసాగేడు ,అతని తమ్ముని వరుసయ్యే  వాడు, వాడి తొమ్మిది నెలల జీవిత చరిత్ర  రాస్తున్నావా  ఏ మిటి  అని
అడగడం తో  పంతులు  నవ్వాపుకున్నాడు  . రాయడం పూర్తి  కాగానే అబ్బాయి పేరు  బంధువులందరికీ  చెప్పండి ,
వాళ్ళు కూడా  పేరు చెప్తూ  పాలు తాగిస్తారు అనగానే ,పెరుచేప్పడం  మొదలెట్టాడు ప్రసాదు ''వీర  వెంకట  సత్య
సాయి శ్రీనివాస భాస్కర ప్రసన్న  శ్రీ రామచంద్ర బాలయోగి  అనంత పద్మనాభ ఆంజనేయ త్రిమూర్తి  శివ పరమేశ్వర్
పట్టాభి వరప్రసాద్  శ్రీకాంత్  సిద్దార్ద్ '' గుక్కతిప్పకుండా చెప్పేసి  ఆనందం గా అందరి  వేపు చూసాడు . ముందు వరుస లోని  కుర్చుని  మొత్తం  శ్రద్దగా  ఆలకించిన   పెద్దామె  చర్రున  లేచింది ,''మీ పెదనాన్న పేరు 'కాసి విశ్వనాద్  కలపలేదట్రా  , సొంత పెద్దమ్మను  కాదనేగా ,  వేలు   విడిచిన  దాన్ని  అనేగా ''అంటూ  రుస రుస లాడింది .

బోలెడంత బ్రతిమాలి  ఆమె ను, శాంతింప చేసి , కాశీ విశ్వనాద్  కూడా తగిలించేసారు ,ఈసారి అంతా  లేవండి
భోజనాలకి  అంటూ పిల్లాడి తాత  గారు అందర్నీ వెంట  బెట్టుకెళ్ళాడు  . అక్కడే బిక్క మొగమేసుకుని కూర్చున్న
పిల్లాడి తల్లి తులసి  ని చూసి  ఏమ్మా అలావున్నావు అంది వరుసకు అక్క అయ్యే ఆమె ,పిల్లాడి కి పెట్టిన పేరు లో
ఒక్క ముక్క కూడా   గుర్తు లేదక్కా  అంది తులసి 'అయ్యో మీ ఆయన్ను కాగితం మీద రాసిమ్మను ,రెండు రోజులు
కంటథా   పడితే రాదా  అంది . ఇంతలో తులసి తమ్ముడు ముందు కొచ్చి అక్కా బళ్ళో వెయ్యాలంటే  మొత్తం రిజిస్టర్
అంతా సరిపోదేమో  అన్నాడు . తులసికి ఇంకా దుఖం ముంచుకొచ్చింది . తులసి బావ వచ్చి  ఏమైంది అని అడిగి
విషయం విని, నాకు మధ్యలో ఎక్కడో  యోగి అని  వినబడింది ,ఎంచక్కా ప్రభాస్ సినిమా పేరు  దాంతో వేసేయ్ బళ్ళో
అన్నాడు . కాదు ప్రసన్న అని చప్పుడు వచ్చింది దాంతో వెయ్యి అని మరొకరు . చిన్నో బుజ్జో పిలవండర్రా అనొకరు
తులసికి ఇంకా కంగారు ఎక్కువైంది . రావడం చూసి రాగం ఇంకాస్త పెంచింది . అతనొచ్చి అంతావినిపిచ్చిదానా  మా వాళ్ళంతా  నొచ్చుకోకుండా  అందరి పేర్లు కలిపాను అంతే ,మనం బళ్ళో వేసేటప్పుడు నీకిష్ట మైన
''రెండు '' అక్షరాల పేరుతొ వేద్దాం అదే వాడి పేరు సరేనా  అన్నాడు . అంతే తులసి  మొహం మతాబులా  వెలిగింది .


మొన్న '' వర్గల్ '' లో అర్చన సమయం లో  పిల్లల పేర్లు చెప్తూ  ,లవ్లీ ,ఇషిక  అంటూ చెప్తున్నారు . నాకైతే చాల
ఆశ్చర్యం  వేసింది  చెప్పుకోవడా నికి  ఇబ్బంది పడే  పేర్లు  పెట్టుకొనేల ! ,ఆ బాధేలా ! ,  ముద్దుగా  పిలవాలంటే
''ఇస్శూ ''అనాలేమో , ఒకమ్మాయికి  కాంతి  అని పేరు పెడితే  తల్లి తండ్రుల దగ్గర  ఉన్నంత సేపు  కాంతి  అదే
అత్తారింటికి  వెళ్ళేక  కాంతం ,వయసైనాక కాంతమ్మ గారు ,అవునూ ఇంతకీ  నన్ను అంజూ  అనిపిలిస్తే  ఏమి
బావుంటుంది  ముంజు లాగ , తర్వాత కొన్ని రోజులకు  అంజమ్మ గారు అంటారా కొంపతీసి ? . నేను ఒప్పుకోను అంజలీదేవి గారూ  అని  పిలిపించు  కుంటా  కాస్త  గెటప్ కూడా మార్చేస్తాను . అదెలాగో  తెలుసా పాత సినిమా లో
జమిందారి ణి  లా ,ఒకే చోట చిన్న తెల్ల జుట్టు ,ఖరీదైన పట్టు చీరా ,శాలువా ,బరువైన నగలు  వేసుకుని  మొహం
ఒకపక్కా భుజాలు  ఒక పక్కా  పెట్టి ,చూపులు ఆకాశం లో పెట్టి భారీ డైలాగులు చెప్తూ ,ఒక్కసారి నన్ను నేను
ఊహించు కుంటే  హబ్బే నేనలా  ఉండలేను నాకసలే నవ్వాగదు ... అన్నట్టు  పేద్ద ... ముడి మెడ తిరగకుండా
అది మర్చిపోతే ఎలా ...   లుక్కు రావద్దూ ... !


పేరుకు లింగబేధా  లు  ఉంటాయని తెల్సుగా ! మాధవి అంటే  అమ్మాయి  ,అదే  మాధవ్ అంటే  అబ్బాయి . లింగ
భేదాలు  లేని  పేర్లు కొన్ని వున్నాయి  . అవే  ఇవి,  రాఘవ ,రమణ ,నూక రాజు . ఈ పేర్లు  మానా న్నమ్మ తరపు
కొంత మంది బంధువులు వచ్చే వారు  వాళ్లకి ఉండేవి .ఆడ  మగా కూడా ,ఈపేర్లు పెట్టేసు కుంటారు .   నాకో చిన్న సంఘటన గుర్తు వస్తోంది ,అదేమిటో చెప్తానుఒకసారి  నాన్నమ్మ  బంధువులు వచ్చి భోంచేసి  వెళ్ళేరు . మళ్లీ వంటచేస్తోంది . ఇంతలో మా బాబాయ్  భోజనానికివచ్చారు ,ఏమిటి ఇప్పుడు వండుతున్నావు  అని అడిగాడు . చక్రం వాళ్ళు వచ్చి భోంచేసి  వెళ్లారు  రా అందుకే!అంది . అప్పుడు  బాబాయ్  ఠకీ మని ''ఏ  చక్రం ? ఆడ చక్రమా , మగ చక్రమా ? అని అడిగేసేరు . నేనైతే ఒకటేనవ్వడం  అలా  వుంటుంది  మరి ,మనమేమో  పేరులో'' నేము'''న్నది అనుకుంటాము . పేరు లోనే అంతా వుంది .[ఏమిటి  ఫ్యామిలీ  అంతా  వంకరే అనుకుంటున్నారా విన్పిస్తోంది లెండి ]

పేరులో  నేమి లేదు  అంపించే పేర్లు కూడా వున్నాయండొయ్  అలాంటివి కొన్ని చూద్దాం ! పిల్లాడి 21 వ రోజు
పెరుపెట్టేస్తాం ,రంగు తప్ప  రూపు రేఖలు  తెలీవు . తెల్లగా వెన్నెల్లా  వున్నా అమ్మాయికి '' నిశిత''  అనికాని ,
నల్లని అమ్మాయికి శ్వేత అనికాని పెడతారు . ఇక ఆకార వికారాలంటా రా  తర్వాత తర్వాత రూపుదిద్దు కుంటాయి
శ్రీరాం అనిపెరున్నవాడు  రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరిదీ పూచీ ? భీమేశ్వర్ అన్నవాడు పుల్లలా  వుంటే
ఏమిచెయ్యగలం ? వేణి అన్నపేరున్న  అమ్మయికి జడ లేకపోతె ఎలా ? '' భిక్షపతి '' కోటీశ్వరుడు  గా  ఉండచ్చు .
మాచిన్నప్పుడు  మా  బంధువు ఒకాయన  మద్రాసు నించి వచ్చేవారు ,ఆయన కు పెళ్ళికాలేదు . ఒకనెల వచ్చి
అందరి దగ్గరా ,నాలుగేసి రోజులు వుండేవారు . మేము మెడ్రాస్ మామ  అనేవాళ్ళం పెద్దవాళ్ళు మెడ్రాస్ బాబు ,
అనేవారు  ఆయన పేరు  ''శోభానా ద్రీస్వర్ ర్రావు '' కాని ఆయనకు పెళ్లి కాలేదు . అదిమన తప్పా ?పేరు మాత్రం
''శోభనా ...  కాని ఆయన జీవితం లో మాత్రం ...... లేదు .  అర్ధ మైన్దనుకుంటా ?!!!!!!!!.

ఇంకేంటి మరి , చాలా  సేపైంది  ఉండనా మరి వచ్చేవారం కలుస్తాం కదా !!!!!!!!!!!!


**********************************************************************************

No comments:

Post a Comment