Total Pageviews

Thursday, November 19, 2015

కొబ్బరి అన్నం .



ఇదేమిటి కొత్తగా ! వంటలూ ? అనిమీరనుకుంటున్నారని  నాకు తెలుసండి ,కాని ఏమిచేస్తాం , పరిస్తితుల ప్రభావం .
అసలే  కార్తీకమాసం  కూరగాయాలు  అదేనండి కూరగాయల ధరలు ఆకాశాన్ని  అంటుతున్నాయి ఏదో త్వరగా
అయిపోతుంది కదా అని ' పప్పు టమాటా ' వండుకుందాం అంటే , అబ్బో 'పప్పు టమాటా'  నే  ఈమె బాగారిచ్చి కాబోలు అనుకుంటున్నారా  అంతలేదండి ,అలాంటివి  '' ప్రముఖులు '' తినే వంటలు . కనుక మన పరిధిలో ఒక
అద్భుత మైన వంట ,ఈ నెలంతా  వెజ్ భోజనం మాత్రమె చేస్తాం కాబట్టి , భక్తీ తో మనం కొట్టే కొబ్బరి వాడెయ్యాలి
కాబట్టి అన్నివిధాల  ఈ వంట ఉపయోగం ,అంతే కాదండి ఈమధ్య కిట్టి పార్టి లో  తిన్నవాళ్ళలో ఇద్దరు పోన్ చేసి
మరీ  అడిగారు  ఎలాచేసారండి  అని అందుకే మీరు కూడా ప్రయత్నిస్తారని  ఒకచిన్న ఆశ .

చాలా''తక్కువ'' మషాలా లు  వాడుతూ చేసుకోవచ్చు . మీరు చెయ్యాల్సింది  కొబ్బరి మిక్సి లో వేసి పాలు తీసి
పెట్టుకోవాలి  అంతే ,కొద్దిగా ఉల్లిపాయముక్కలు ,కొంచెం మషాలా పొడి ,ఒకస్పూన్  అల్లంవెల్లుల్లి పేస్ట్ ,కడిగిన
బియ్యం ,మసాలా దినుసులు కూడా కావాలి . నచ్చితే టమాట వేసుకోవచ్చు . లేకపోయినా ఫర్లేదు .
నెయ్యి ,నూనె  సమానం గా తీసుకున్నాను ,షాజీర ,జీడిపప్పు వేసాను ,తర్వాత మసాలాదినుసులు వేసాను .
అవి వేగగానే ,ఉల్లిముక్కలు ,పచ్చిమిర్చి చీలికలు(కారం వెయ్యము కనుక మిర్చి ఎక్కువే వెయ్యచ్చు ) ,వేయించి ,టమాట ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేయించాను ,అన్ని మసాలా దినుసులు కలిపి పొడి చేసిన మసాలా ఒకస్పూన్ వేసి
కడిగిన బియ్యం ,సరిపడా ఉప్పు వేసి ,ఒక కప్పు బియ్యానికి ఒకకప్పు కొబ్బరిపాలు ,ఒకకప్పు నీళ్ళు కలిపి
వుడికించాను . ఇది మంచి రుచిగా వుంటుంది . ఆలూ కుర్మాకాని  ,చికెన్ కుర్మా కికాని  మంచి కాంబినేషన్.





















                                                    ***************************


ఇది ఇంకా  సులువుగా చేసుకునే మరో ''కొబ్బరి అన్నం ''2.



వండిన అన్నం  ఒక కప్పు ,పచ్చి కొబ్బరి అరకప్పు , జీడిపప్పు ,ఎండుమిర్చి ,కరేపాకు ,ముఖ్యమైనది
దాల్చిన చెక్క పొడి  ఒకస్పూన్ ,నెయ్యి ,నూనె సమపాళ్ళు లో తీసుకోవాలి . ముందుగా నెయ్యి ,నూనె
వేడి చేసి  జీడి పప్పు వేయించాలి ,అందులోనే ఎండుమిర్చి ,కరేపాకు వేసి వేగగానే  అన్నం వెయ్యాలి ,
అప్పుడు పచ్చి కొబ్బరి తురుము  వేసి వుప్పువేసి  కొద్దిసేపు కలిపి దించెయ్యాలి .
ఉప్మా చెయ్యగానే మా పాప  చుట్టు పక్కల కనపడకుండా  మాయం అయిపోతుంది ,నాకూ నచ్చదు మరి
ఏమి చెయ్యను ,అసలు ఈ ఉప్మా ఎవరుకనిపెట్టేరో కానీ ... ఎందుకులెండి  ఉప్మా ప్రియులు కోప్పడతారు .
అందుకే ఉప్మా చేసి నప్పుడు  తప్పనిసరిగా  ఇది చేస్తుంటాను . మీరు చేసి చూడండి  నచ్చుతుంది .













                                 *************************************************

No comments:

Post a Comment