Total Pageviews
Thursday, August 27, 2015
Thursday, August 20, 2015
పిల్లలిని కొడతారా ??!!!!!!!
పిల్లలిని కొడతారా ! అని ఆశ్చర్య పోయాను ఆమెని చూసి , వెనకింటి ఆమె వాళ్ళ అమ్మాయిని చెంపలు
వాయిస్తోంది ,అదికూడా వాకిట్లో ,అందులోనూ అమ్మాయి చిన్నది కాదు ,ఇంటరు చదివే అమ్మాయి .
తల్లికూతురు ఒకేలా వుంటారు బొద్దుగా ,అక్కాచెల్లెళ్ళ లా వుంటారు మోకాళ్ళ వరకూ వుండే జీన్స్ లూస్
గా వుండే '' పేద్ద టాప్ '' వేరే డ్రెస్ లో చూడలేదు నేను వాళ్ళని . ఎదిగిన పిల్లని కొట్టడమే జీర్ణించు కోలేదు .
నెట్టేసి గేటు వేసేసి లోపలి వెళ్ళిపోయింది . మేడమీద నించున్న నాకు ఒకటే కంగారు ,ఎటన్నా వేల్లిపోతుందేమో
అని కోపం లో ఏమన్నా చేసుకుంటే ఏమిటి దారి ? అసలే ఇవాళ రేపు పిల్లలు చాలా సున్నితం గా
వుంటున్నారు . అమ్మకోడితే ,పెద్దవాళ్ళు చేరతీసేవాళ్ళు ,ఇప్పుడె వరున్నారు స్నేహితులతో ఇలాంటివి చెప్పడం
వాళ్ళ కి అవమానం . వాళ్ళు అవమానం గా భావించేలా మనం ఉండ చ్చా ?! విదేశాల్లో ఐతే ముందు గ
ఒక ఫోన్ నెంబర్ పిల్లలికి నేర్పిస్తారు . అమ్మ నాన్న కొడితే కాల్ చెయ్యమని .కొన్ని ఇళ్ళలో అమ్మానాన్న లే
కాదు ఐన వాళ్ళు కూడా కొట్టేస్తుంటారు పిల్లల్ని . టీచర్లు బంధువులు ఎవరన్నసరే పిల్లల మీద చెయ్యి
ఎత్తడానికి భయపడేలా చట్టం వస్తే బావుండును .
వాళ్ళకి ఏదీ చెప్పి నేర్పించలేము ,మనం ఎలావుంటే ,వాళ్ళు అలా వుంటారు . ఇంకా చెప్పాలంటే మనల్ని
అనుకరిస్తారు ఎంత అంటే చాలా ... వాళ్ళముందు ఒకలా వెనుక ఒకలా మనం నటించడం మొదలు పెడితే
మనం 'అపరిచితు'[ డు ]లమైపోతాము . మీరెప్పుడూ కొట్టలేదా అంటే కొట్టాను చిన్న క్లాస్ చదివే టపుడు
చిన్న చిన్న దెబ్బలు పడేవి , తొడపాసం పెట్టేదాన్ని [దీనినే కొన్నిచోట్ల సొంటి పిక్కలందురు] అదికూడా మా వజ్రానికి మాత్రమే ,పాప కిప్పటివరకు అవసరం రాలేదు ,రాలేదు అనేకంటే తనే రానివ్వలేదు అంటే సరిపోతుంది .
వాళ్ళు స్కూల్ నించి రాగానే తినడానికి పెట్టి వాళ్ళు చెప్పే దంతా వింటాను అస్సలు విసుక్కోను ,విసుక్కుంటే
మళ్లీ జీవితం లో మనతో ఏమి చెప్పరు . ఇలా ఎందుకు చేసావు ,అలా చేసుండాల్సింది ,అంటూ మధ్యలో
సలహాలిస్తూ వుంటాను . అంత వరకే , తర్వాత ఒక బుక్ తీసుకుని కుచుంటాను చదువు కుంటూ .. వాళ్లకి
అర్ధమై పోతుంది .చదువుకునే టైం అని ,నేను చెప్పకుండానే బుక్స్ తెచ్చుకుని వర్క్స్ చేసేసు కుంటారు .
పిల్లలిని ఎప్పుడూ ఐన వాళ్ళ దగ్గర వుంచి చదివించ కూడదు . మన దగ్గరే వుంచుకోవాలి ఎంత ఇద్దరూ వుద్యోగస్తులైన సరే . వీలైనంత ఎక్కువ టైం కేటాయించాలి , డబ్బు కాదు ,చాలామంది ఎక్కువసేపు
ఒంటరి గా వుంటున్నారు కదా అని డబ్బిచ్చేస్తూ వుంటారు . ఏదో ఒకటి కొని తింటారు అని ,కాని
చెడు అలవాట్లకి ,మంచి అలవాట్లకి మధ్య దూరం చాల తక్కువ . ఒకవేళ డబ్బిచ్చినా ఆరా తీస్తున్నట్లు
కాక సహజం గా అడుగుతున్నట్లు అడిగి తెలుసు కోవాలి . వాళ్ళ స్నేహితులందరి తో మనకి కూడా
పరిచయం వుండడం ముఖ్యం . చిన్న చిన్న పార్టీలు పెట్టి వచ్చిన వాళ్ళను గమనిస్తుండాలి .
ఇక హాస్టల్ లో పిల్లలను ఉంచడానికి నేను పూర్తి వ్యతిరేకిని . అక్కడ వుంచడం వల్ల వీళ్ళను మించిన
వాళ్ళు పరిచయం అవుతారు ,చాలా మారి పోతారు . మానసికంగా పెద్దవాళ్ళకు దూరం అవుతారు .
మేం ఒంటరిగా ఉంటున్నాం పెద్దవాళ్ళ మయ్యాము అనే భావం వచ్చేస్తుంది . 24 గంటలు చదివి
రాంకులు కొట్టడం , ఉద్యోగాలు పట్టడమే కాదు ,తల్లితద్రులు ,కుటుంబం , విలువలు ఇలాంటివన్నీ
ముఖ్యమే కదా ! అంతే కాదు బాల్యం ,ఆటపాటలకు దూరం గా పెరిగితే ,వాళ్ళ జ్ఞాపకాల్లో ఏమి
మిగులుతుంది . పిల్లలు పిల్లలే వాళ్ళు రేపటి మన డబ్బు మెషీన్లు కారు . ఆట పాటలకీ దూరంగా
చీకటి గదుల్లో బంధించి చదివించే హక్కు మనకు లేదు . బాగా బ్రతకడమే కాదు బ్రతికుండడం కూడా
ముఖ్యమేకదా !
నేను మాత్రం వాళ్ళని అది చెయ్యి , ఇది చెయ్యకు , అని ఎప్పుడూ అధికారం చెయ్యను . ఏది చేసినా
దానివల్ల వచ్చే మంచి చెడు మాత్రం వివరం గా చెప్పేస్తాను . నిర్ణయాధికారం వాళ్ళదే ,పిల్లలు నా
బానిసలు కాదు ,నా ఫ్రెండ్స్ అంతే ........
***********************************
Thursday, August 13, 2015
Thursday, August 6, 2015
వయసంటే ఎందుకో అంత భయం ?

చాల మందికి వయసు పెరుగుతోంది అంటే తలనెరుస్తుంది ,ఇప్పుడు కాలేజ్ పిల్లలకి కూడా కాలుష్యం వల్ల
మెరిసి పోతోంది ,అదివేరే సంగతి అనుకోండి . ఇక మన విషయానికి వస్తే జుట్టు మెరవగానే రంగు వేసుకోడం ,
మనం మాములుగా చూసే విషయం ,కాని ఇప్పుడు వేలకు వేలు పోసి ,పేస్ లిఫ్టింగ్ అని ,బొటక్స్ ఇంజక్షన్స్
తీసుకోడం అని ,మన బ్లడ్ తీసి మళ్లీ మనకే మొహం లో ఎక్కిస్తారట ,అందువల్ల ముడతలు కనపడవట .
ఇవన్నీ సినిమా వాళ్ళు చేస్తే ఓకే ,కాని ఇప్పుడు మాములు జనాలు కూడా ఇవన్ని చేయించుకుంటున్నారు .
ఇంట్లో పెద్దవాళ్ళకు కళ్ళజోడు వచ్చినప్పుడు ,పంచాంగం చూసేటప్పుడో ,బియ్యం ఏరే ట ప్పుడో పెట్టుకుంటే ,
చూస్తే ముచ్చటేసేది మనమెప్పుడు పెద్దవాళ్ల మౌతమా అన్పించేలా కళ్ళకి ఇంపుగా వుండే వారు . అదే
ఇప్పుడైతే అదొక నేరం లా వుంది . వయసు పెరిగితే హుందాగా ఆ విషయం అంగీకరిస్తేనే బావుంటుందేమో !
పాత నీరు కొట్టుకు పొతే నే గా ,కొత్తనీరు ప్రవహించేది ? పెద్దావిడ ప్యాంటు షర్టు వేసుకుంటే ఏమి బావుంటుంది
కాని నేనుచూ సాను . చూడ చక్కగా వున్నారు ఆవిడ ,కాని ... అదే ఒకబెంగాలి కాటన్ శారీ వేసుకుని చిన్న
వేలు ముడి వేసుకుంటే దణ్ణం పెట్టకుండా ముందుకు కదలలేము ,కాని ఆమె సౌకర్యం ఆమెది కదా!!!!!!!!!!!!
అందరం కూర్చుని కబుర్లు చెప్పుకునే వేళలో మా నాన్న ,అమ్మను బాగా ఆడించేవారు ఏదో ఒక విధం గా
వయసు ప్రసక్తి తెచ్చి '' మీ ఇంటికి బట్టలు తెచ్చి అమ్ముతాడే మీ సూర్రావు అన్నయ్య , నీ ఈడువాడే కదూ''
అంటే చాలు అమ్మకి తిక్క రేగేది '' మీరు మరీనూ , మేము బడికి వెళ్ళే రోజుల్లోనే .. అతనికి పెళ్లి అయ్యింది .
ఇప్పటి లాగా '''ఆంటి '' అంకుల్ '' అని పిలుపులు అప్పుడు లేవు కనుక అన్నయ్య అంటున్నాము ,
అతనే నాటివాడు ?'' అనేది నవ్వులతో ఇల్లు హోరేత్తేది . నాన్న వదలకుండా మరి మీ చుట్టాలతను వున్నాడు
చూడు బాబు రావు ,అతను నువ్వు ఒక తోటి వాళ్ళేనా ,అని మళ్లీ ఉడికించే వారు . బావుంది అతను మా
నాన్న దగ్గర పన్చేస్తాడు . మాకన్నా చాల పెద్దోడు ''అతనే నాటివాడు 'అనేది . అందరూ నవ్వుతుంటే నాకు మాత్రం ' వయసంటే ఎందుకో అంత భయం ' పెద్ద ఐతే నేను ఇలాగేనా' అనుకునే దాన్ని . తర్వాత ఆ విషయం మర్చిపోయినా ఈమధ్య బాగా గుర్తు వస్తోంది .
షాపింగ్ కని కోఠీ వెళ్ళాము , తీసుకు వెళ్లి తను మాత్రం కార్ లో కూర్చుని మీరెళ్ళి వచ్చేయండి అంటారు .
సరే అని కోఠీ లో ప్రవేసిస్తాను ఒక ఇరుకు మార్గం లో అటూ ఇటూ వున్న దుకాణాల మధ్య , బండి మీద ,
అందం గ అమర్చిన చెక్కల మీద చిట్టి పొట్టి బట్టలు ప్లాస్టిక్ సామాలు ,ఇంట్లోకి పనికివచ్చే కాఫీ ఫిల్టర్ లు
ప్లాస్టిక్ పువ్వులు, బాగ్ లు ,క్లిప్పులు , బిందీలు , కప్పు లు, దుప్పట్లు దివాన్ కవర్లు ,ఏమి ఉండవని అడగండి .
ఊరికే వెళ్ళినా కూడా కొనాల్సినవి చాలా కన్పిస్తాయి . చిన్న సైజ్ ఎగ్జిబి షన్ లాంటిది . ఇదికాక వచ్చే పోయే
ఆటో లు బైక్ లు , జన సందోహాన్ని చేదించు కుంటూ వెళ్తూ వస్తు వుంటాయి . అంత చిన్న దారి లో ఇవన్ని
ఎందుకు నడవనిస్తారో తెలీదు . ఏమాత్రం అప్రమత్తం గా లేక పోయినా కాళ్ళు పచ్చడే ,సరే ఇక విషయానికి వస్తే
ఐస్ క్రీమ్ కొనివ్వగానే తినేసి ,మా అమ్మాయి నా చెయ్యి విడిపించుకుని డాడి దగ్గరుంటా అంటూ జారుకుంది .
ఎడాపెడా పనికొచ్చేవి పనికి రానివి కొనేసి ,''ఏమిటో .. వీటికోసం ఇంతదూరమోస్తామా మళ్లీ , పెట్రోలు దండుగ
కదూ! అనుకుని నేను చేసిన మంచి పనికి నా భుజాలు నేనే చరుచుకుని ఆనందం గా మోసుకొచ్చి కార్ లో
పెడుతుంటే హాయిగా దర్జాగా సీట్ లో పడుకుని పాటలు వింటూ ,నన్నుచూసి లేస్తూ , బాగ్ లు వెనకాల పెట్టు అంటూ సలహా ఒకటి ..' నీళ్ళలోనే వుంటారు కాని తడి అంటదు అదృష్ట వంతులు అనుకుంటూ ,అన్ని పెట్టేసి
కూర్చున్నా ,కుస్ కుస్ అంటూ నవ్వులు విన్పిస్తుంటే ఏమిటి అన్నాను . ఏమిలేదు అనడం మళ్లీ అదే నవ్వు ,
ఏమిటో చెప్పచ్చు గా అన్నా , శారీ పిన్స్ కొన్నావా అనడిగేరు , నాకు అర్ధమయ్యింది . కొన్నాను అన్నాను .
మరి ముందు ఒకతను వచ్చి కొనమంటే ఎందుకు కొనలేదు అన్నారు . మళ్లీ కుస్ కుస్ లు ఎక్కువయ్యాయి .
''అదా ముందు కొనమన్నవాడు ' ఆంటి ' శారీ పిన్స్ కావాలా అన్నాడు . '' నేనేమన్నా నీకు అత్తనా ,పిన్నినా
ఆంటీ అంటున్నావు ,తెలియని వాళ్ళని ''మేడం''అనాలని తేలీదా అన్నాను . అంతేకాదు శారీ పిన్స్ వద్దన్నా
''మరి ఎవరి దగ్గర కొన్నావు '' అక్కడజరిగిందంతా వచ్చి చెవిలో వుదేసిందన్నమాట ,అందుకేనా ఆ నవ్వులూ ?
ఎవరిదగ్గర కొన్నావు చెప్పు .. వదిలేటట్టు లేరు ,చెప్తుంటే నాకే నవ్వు వచ్చేసింది ''అక్కా శారీ పిన్స్ తీస్కొఅక్కా ''
అన్నాడు వాడి దగ్గర కొన్నాను . ఎంతకీ నవ్వాగడం లేదు పాపం . వెళ్తూ కూడా నవ్వుకోవచ్చు కార్ తీస్తారా
ఇంటికెళ్ళి వంట చేస్కోవాలి మళ్లీ అన్నాను . దాన్లో ఏముంది నువ్వు ' ఊ 'అనాలి కాని దార్లో మంచి హోటల్
లో భోంచేసి వెళ్దాము అన్నారు .ఐతే ఇంకేం నాకసలే చాల ఆకలి వేస్తోంది బాగా షాపింగ్ చేసి అలసి పోయాను
రెండు ఏనుగులు ,ఒక గుర్రం ఐతే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడున్న ఆకలికి అన్నాను . వెళ్తున్నాం కదా ఏమాత్రం తిని వుద్దరిస్తావో చూస్తాను అన్నారు . సరే దేనికైనా ముందు బయల్దేరాలి కదా అన్నాను సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ..
రెండు ఏనుగులు ,ఒక గుర్రం ఐతే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడున్న ఆకలికి అన్నాను . వెళ్తున్నాం కదా ఏమాత్రం తిని వుద్దరిస్తావో చూస్తాను అన్నారు . సరే దేనికైనా ముందు బయల్దేరాలి కదా అన్నాను సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ..
ఇప్పుడు తెల్సిందా మీకు , మా అమ్మ వయసు కధ నాకు ఎందుకు గుర్తు కొచ్చిందో ............
*************************************
Thursday, July 30, 2015
నా ప్రావీణ్యం
అంతటి తో ఆగితే బాగుండేది . కొత్త కదా !సరదా కొద్దీ ఎదీ వదలకుండా పెయింట్ చేసేస్తున్నాను . చివరికి వారి
టీ షర్ట్ కూడా ! నేను అస్సలు ఖాళీగా వుండలేనండి ,ఏదో ఒక పని వుండాలి ఊరికే కుర్చోవాలంటే ఏమి బావోదు
ఇదే కాదండి , బయటకెళ్ళి వస్తే ఎవరో ఒకరిని అభినయిస్తాను . విశాఖ జిల్లా , తూర్పుగోదావరి , తెలంగాణా యాసలతో ఇల్లు ఒక కొలిక్కి తెస్తూ వుంటాను . మీరు అనుకున్నది కరెక్టే ''పాపం మా వారు ''.................
Thursday, July 23, 2015
ఏ కార్ కొనాలని ???
కార్ మార్చి కొత్తది కొనాలని నిర్ణయించాక ,ఒకరిద్దరు వచ్చి చూసి వెళ్లారు . వారడిగే ధర నచ్చక ,ఆ స్తాన విద్వాంసుడు లాంటి మెకానిక్ దగ్గర సలహా అడిగాము . olx లో పెట్టి అమ్మేయండి అని చెప్పాడు ఓహో
కమిషన్ ఆశించకుండా ,ఇంత మంచి ఐడియా ఇచ్చాడేమో ఇంకేంటి అని రెచ్చిపోయి ,కార్ చుట్టూ నిలబడి
కూర్చుని బోల్డన్ని ఫోటోలు తీసి [ మావి కాదు కార్ వే ] olx లో పెట్టేశాం . ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల ,ఫోన్ లు
మొదలయ్యాయి . ఎందుకమ్మేస్తున్నారు , ఎన్ని కిలోమీటర్లు తిరిగారు , ప్రోబ్లం ఏమైనా వుందా [వుంటే మాత్రం
చెప్తా మటండీ !!] కొందరైతే ఒకడుగు ముందుకేసి ,ఎక్కడ పన్చేస్తారు ?అంటూ అనుమనించేవారు . దొంగ కార్ లు
కొని అమ్మేవాళ్ళ లాగ చూసేవారు ,ఫోన్లోనే లెండి . ఎంత చెప్తున్నారు ? ఇంతకైతే ఇస్తారా అని కొందరు ,అదేంటి
వచ్చి చూడరా ,చూడకుండా బేరమెలా అడుగుతారు అంటూ ఒహటే హాచ్చెర్యం .... ఇంకో వెబ్ సైట్ వాళ్ళైతే
మేం ఇంట్రస్ట్ గా వున్నాం అంటూ మెస్సేజ్ చేస్తారు . మనమే వాళ్ళని సంప్రదించాలి . ఒకొక్కరు ఒక్కో మూడ్ లో
వుండేవారు . మనసు మార్చుకున్నాం అని వొకరు ,టైం కావాలని ఒకరు ,ఏమిప్రోబ్లెం వల్ల అమ్మేస్తున్నారు అని
ఒకరు ,ఎంతైనా మనమే ఫోన్ చేస్తే లోకువే కదా !మొట్ట మొదట కార్ చూసి [olx లో ] ఫోన్ చేసిన వ్యక్తి మాత్రం
నేను వచ్చేయనా ? క్యాష్ తెచ్చి కార్ తీసుకు పోతాను అంటూతెగ కాలు తొక్కేసే వాడు నీ రేట్ మాకు నచ్చలేదు రా బాబోయ్ .. అంటే వినడు . మొత్తానికి మేము అనుకున్న ధరకి అమ్ముడైంది . హమ్మయ్య అనుకుంటున్నారా ?
అప్పుడే ఎక్కడైంది ? ముందు వుంది క్రొకోడైల్ ఫెస్టివల్ ..........
ఇక మరో పర్వం మొదలు . ఇప్పుడు కార్ కొత్తది కొనాలా ,పాతదా అని . పాతది కొనడం పిల్లలనించి ఎవ్వరికి
ఇష్టం లేదు . 2సం లో పెద్ద ది కొందాము అని నచ్చ చెప్పి ,ప్రయత్నాలు మొదలు పెట్టేము . ఒక స్నేహితుడు
నేను బెంగళూర్ వెళ్ళిపోతున్నాను కనుక ,నా కార్ తీస్కోండి అన్నాడు ఒక సంత్సరం అయ్యింది ,10 వేలు
తిరిగింది ,పిక్ అప్ బావుంది ,రిజిస్ట్రే షన్ ,టాక్సకి టైం వుంది , సీట్ కవెర్స్ కొనక్కర్లేదు , ఫుట్ మాట్స్ వున్నాయి ,
బావుంది కాని ... కాని ... మైలేజ్ 13 కిలోమీటర్లు ఒక లీటరు కిస్తోంది . ఇప్పుడోచ్చేవన్ని పదహారు ,కొండొకచో
23 కూడా ఇస్తున్నాయి . అలాంటప్పుడు ఈ ''బున్ దాయ్ -1 20'' కోనడమెందుకు అని మనసు పీకుతోంది .
స్విఫ్ట్ డిసెర్ కొత్తది చుసోచ్చేము . మోడల్ మార్చి చాల పెద్దదిగా చేసారు. అమేజ్ కి పోటీ అట ఈ మెగా సిటీ లో
మెగా ట్రాఫిక్ లో కనీసం టర్నింగ్ కూడా తిప్పలేము . పొఇన చోటే వెతుక్కుందాం అని అదే వెబ్సైట్ లో వెతక
బట్టేము . కార్ నచ్చితే కలర్ నచ్చదు ,కలర్ నచ్చితే కార్ మైలేజ్ నచ్చదు .అంతా బావుంటే తెగ తిరిగేసినవే
ఉంటున్నాయి . ఇక్కడొక తమాషా చెప్పనా !మా కార్ కొనే వాళ్ళు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకి నవ్వుకొనే వాళ్ళం .
ఎందుకమ్మే స్తున్నారు అంటున్నారు . చిన్న గీత కూడా లేని అందమైన మంచి కార్ కొనుక్కోవడానికి నెప్పా ?
అనుకునే వాళ్ళం . కాని చిత్రం గా ,అవే ప్రశ్నలు మేము అడుగుతుండే వాళ్ళం .. తనదాకా వస్తే కానీ ......
ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కొంత మంది 'దయగల బాబులు' నడిపే పద్దతి మీద ఆధార పడివుంటుంది మన కార్
అందం చందం , రాత గీత ,చొట్ట గిట్టా ను . ఏమిచేస్తాం స్వతంత్ర భారతదేశం కదా తప్పదు మరి ,భరించాలి .
ఒకవ్యక్తి తన కార్ ఆరు నెలలకే నెట్ లో పెట్టేసాడు . కలర్, కార్ నాకు తెగ నచ్చేసింది . వారికి ఫోన్ చేసాం వేరే
''దుమ్ము ధూళి ''అనే కార్ వుందట ,అందుకే అమ్మేస్తున్నాడట . సరే చుస్తామన్నాము ,ఇప్పుడు నేను సికింద్రాబాద్ లో వున్నా నన్నాడు ,మాకు దగ్గర అక్కడే చుస్తామన్నాము . వెళ్ళాము చూసాము .. సీట్ కవెర్స్ కూడా తీయలేదు
మాకు అతనికి ధరలో 20 వేలు మించి తేడా లేదు . సర్విసింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనడిగా !అతను
తడబడి ఇంకా చేయించలేదు అన్నాడు . మైలేజ్ గురించి అడిగితె ,అబ్జర్వే చెయ్యలేదన్నాడు . నాకేదో డౌట్
కొట్టింది . వస్తూ మళ్ళీ ఆస్తాన విద్వాంసుడి [మెకానిక్ ] దగ్గరికి వెళ్లి విషయం చెప్పాం . ఆ కారా వద్దండి
''ఆ లూర్డ్ లిగో ''కొంటే సర్వీసింగ్ కె ఆస్తులు అమ్ముకోవాలి ?పెట్రోల్ మంచినీళ్ళ లాగా తాగుతుంది అన్నాడు . మాకు బుద్ధి వచ్చింది .
లెట్స్ గో అంటూ వెళ్లి ముందు వాడిన మోడల్ కార్ మళ్లీ ' కొత్తది' కొనుక్కొచ్చాము .పెట్రోల్ తప్ప మధ్యలో ఒక
నట్టుకుడా అడగదు ఆ కార్ ఐతే ... ఎందు కంటే గత ఎనిమిదేళ్ళు గా అదేగా వాడుతున్నాము .అన్నట్లు
మార్చే పోయాను ,ఇప్పుడు సర్విసింగ్ అంటూ పొద్దున్న తీస్కెళ్ళి ఇచ్చి సాయంత్రం మళ్లీ ఆటో లో వెళ్లి లేదా
ఉదయం నుంచి అక్కడే కూర్చునే పనిలేకుండా ,ఇంటికొచ్చి 2గంటల్లో ఇంటి వద్దే సర్విసింగ్ చేసి ఇచ్చి వెళ్తున్నారు
అదే ధరలో , ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరన్నా వుంటే వెంటనే మీ కార్ కొన్న షో రూం లో సంప్రదించండి .
మీకేమన్నా ఉపయోగ పడుతుందేమో అని మాత్రమె ..............
*********************************************************
Thursday, July 16, 2015
గుర్తుండి పోతాయి ........
నేను చాల రోజుల క్రితం ఒక సినిమా చూసాను . ఆ హీరోయిన్ పేరు బ్రూక్ షీల్డ్ అనుకుంటా !! హబ్బా ...
భలేవుంది . హీరో పేరు తెలీదు . సినిమా మాత్రం '' బ్లూ లాగున్ '' ఏమి ఫోటోగ్రఫీ .. ఆ అమ్మాయినే కాదు ,
ప్రకృతిని కూడా కళ్ళకు కట్టినట్లు చూపించాడు . ఇప్పటికి మర్చిపోలేను . అంతబావుంది . మళ్లీ చాలాసార్లు
ఆ ఛానల్ పెట్టాను ,కాని ఎప్పుడూ రాలేదు . ఇద్దరు చిన్న పిల్లలు గా వున్నప్పుడుపరిస్తితుల కారణం గా ఒక దీవిలో చిక్కుకు పోతారు అక్కడే పెద్దవాళ్ళు అవుతారు . అందమైన ప్రకృతి నడుమ ,ప్రకృతి సహజమైన ఆహరం తీసుకుంటూ ,ఎంతో సహజం గా ఒక్కటవుతారు భార్య భర్తలుగా సహజీవనం సాగిస్తారు . ఒక సంఘటన అంత
చక్కగా సినిమాగా మలచగలగడం ,నిజంగా అద్భుతం . ఒక్కసారన్నా తప్పకుండ చూడండి .
ఆడ పిల్ల గురించి తప్పుగా అనుకునే కొంత మంది మగవాళ్ళకు , పెళ్ళికి ముందు వయసు ప్రభావం
వల్ల కన్ను చెదిరినా ,మనసు చెదిరినా , అది కేవలం క్షణికమే అని . ఆమెకి తాళి కట్టినవాడినే ప్రేమిస్తుంది ,
ఆరాధిస్తుంది ,గౌరవిస్తుంది ,అని చాల సులభం గా అర్ధ మయ్యేట్టు గా తెలియచెప్పే టట్లు తీసిన సినిమా !!!!
''హమ్ దిల్ దేచుకే సనమ్ '' ఐశ్వర్య అభినయం , అందం చూసి తీరాలి . అంతే కాదు ప్రేమించిన వాడిని
తండ్రి కిచ్చిన మాట కోసం దూరం చేసుకుని ,పెళ్లి జరిగాక భర్త తో సర్దుకోలేక భాద పడుతుంది . విషయం
తెల్సుకున్న భర్త ,ఆమెని ప్రియుని చెంతకి చేర్చలనుకోవడం . ఆప్రయాణం లో కొన్ని సంఘటనలు వారిని
దగ్గరచేయ్యడం .. ప్రియుని దగ్గర అతను వదిలేసి నప్పుడు , భర్తే సర్వస్వమని నమ్మి ఆమె , ప్రియునికి [సల్మాన్ ఖాన్ ]వీడ్కోలు పలికి ,భర్త తో కల్సి [అజయ్ దేవగన్ ]తిరుగు ముఖం పడుతుంది .
నాకు చాలా నచ్చిన సినిమాలలో ఇదీ ఒకటి ,ఏదీ రెండో సారి చూడటం అలవాటు లేని నేను ఈ సినిమా
మాత్రం చాలా సార్లు చూసాను . మొదటి భాగం అంతా సల్మాన్ తో సరదాలు , ఆటపాటలతో గడిచి పోతుంది .
రెండోభాగం అజయ్ కోపతాపాలు ,ప్రయాణంలో పదనిసలు .. వీలుంటే తప్పకచూడండి .
''గ్రావిటీ '' చూసారా చూసే వుంటారు . ఎంతో బావుంది ,ఆ సినిమాకి పెట్టిన ఖర్చులో సగభాగం తో మన
దేశం లో , అంతరిక్షం లోకి ఒక నౌక నే పంపించారట . అంత ఖర్చు చేసి తీసిన సినిమా ,ఒక రోజంతా మన
ఆలోచన వదిలి పోదు . మంచి ఎక్కడున్నా మెచ్చు కు తీరాల్సిందే కదా !!!!!! తప్పకుండ చూడండి ,
మెచ్చు కొండి .
బాహుబలి బహుశా చరిత్రలో మిగిలిపోతున్దనుకుంటా ! అసలు నీరే లేనిచోట అతిపెద్ద జలపాతమున్నట్లు ,
నీటి హోరు తో సహా అతిచక్కని అద్బుతమైన సృష్టి ,చందమామ కథలు చదివి ఊహకందని రాజ ప్రాసాదాలు
రాక్షసులు ,అడవులు జంతువులూ ,జలపాతాలు ఊహించడానికి ప్రయత్నించేవాళ్ళం కదా ! అవన్నీ మన
కళ్ళముందు ఆవిష్కరించి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి పోతాయి . ప్రతి నిముషం ప్రతి సీన్ రాజ మౌళి
కష్టం కన్పిస్తుంది . ఎంత ప్రణాళికతో అందర్నీ నడిపించాడో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది . అన్ని భాషల్లో
నిర్మిస్తున్న చిత్ర మైనప్పటికీ తెలుగు నటీ నటులకు మాత్రమె అవకాసమివ్వడం అభినందనీయం . దర్శకుడి
ఆత్మవిశ్వాసానికి తార్కాణం .
********************************************************
''గ్రావిటీ '' చూసారా చూసే వుంటారు . ఎంతో బావుంది ,ఆ సినిమాకి పెట్టిన ఖర్చులో సగభాగం తో మన
దేశం లో , అంతరిక్షం లోకి ఒక నౌక నే పంపించారట . అంత ఖర్చు చేసి తీసిన సినిమా ,ఒక రోజంతా మన
ఆలోచన వదిలి పోదు . మంచి ఎక్కడున్నా మెచ్చు కు తీరాల్సిందే కదా !!!!!! తప్పకుండ చూడండి ,
మెచ్చు కొండి .
బాహుబలి బహుశా చరిత్రలో మిగిలిపోతున్దనుకుంటా ! అసలు నీరే లేనిచోట అతిపెద్ద జలపాతమున్నట్లు ,
నీటి హోరు తో సహా అతిచక్కని అద్బుతమైన సృష్టి ,చందమామ కథలు చదివి ఊహకందని రాజ ప్రాసాదాలు
రాక్షసులు ,అడవులు జంతువులూ ,జలపాతాలు ఊహించడానికి ప్రయత్నించేవాళ్ళం కదా ! అవన్నీ మన
కళ్ళముందు ఆవిష్కరించి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి పోతాయి . ప్రతి నిముషం ప్రతి సీన్ రాజ మౌళి
కష్టం కన్పిస్తుంది . ఎంత ప్రణాళికతో అందర్నీ నడిపించాడో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది . అన్ని భాషల్లో
నిర్మిస్తున్న చిత్ర మైనప్పటికీ తెలుగు నటీ నటులకు మాత్రమె అవకాసమివ్వడం అభినందనీయం . దర్శకుడి
ఆత్మవిశ్వాసానికి తార్కాణం .
బాహుబలి ఒక అద్భుతం .
********************************************************
Subscribe to:
Posts (Atom)