Total Pageviews

Thursday, October 5, 2017

రొయ్యల వేపుడు .



రొయ్యలు  ఎప్పుడు పొట్టు వలిచి శుభ్రం  చేసినవే  తెచ్చుకోవాలి . తెచ్చిన వాటిని  గిన్నెలో వేసి
నీళ్లతో  రెండు మూడు సార్లు  కడిగి పసుపు ,చిటికెడు ఉప్పు వేసి  స్టవ్ మీద ఉంచాలి , చాలా నీరు వస్తుంది ,మొత్తము నీరు ఆవిరై రొయ్యలు మాత్రం మిగిలే వరకు ఉంచి తర్వాతస్టవ్ కట్టేయాలి .
ఇప్పడు చల్లారేక  ఫ్రిజ్ లో ఉంచితే  నాలుగు రోజులు ఉంటాయి . లేదా అప్పుడే వండాలన్నా
కూడా  నీరు మొత్తం పోయేవరకు  స్టవ్ పైన  ఉంచడం  మాత్రం ముఖ్యం .


జీడి పప్పు ,రొయ్యలు  సమానం గా  తీసుకోవాలి ,కట్ చేసిన ఉల్లిపాయముక్కలు , అల్లం
వెల్లుల్లి పేస్ట్ , పసుపు ,ఉప్పు ,రెండు స్పూన్ల కారం ,గరం మసాలా పొడి ,కరివేపాకు ,పచ్చి
మిర్చి ముక్కలు . నూనె, కొత్తిమీర .

 చేసే విధానం :

నూనె వవేడెక్కగానే  ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి . పచ్చిమిర్చి ,కరేపాకు  వేసి వేయించాలి .
అల్లంవెల్లుల్లి పేస్ట్  వేసి జీడిపప్పు వేయాలి . వేగాక రొయ్యలు (పై  విధంగా నీళ్లు తీసేసినవి) వెయ్యాలి . తర్వాత ఉప్పూ ,పసుపూ ,కారం ,గరం మసాలాలు వేస్తూ  వేయించాలి బాగా
వేయిస్తూ మంచి రంగు రాగానే ,కొత్తి మీర  చల్లి దించేయాలి . అన్నం కోసం  వెయిట్
చేయక్కర లేదు , స్పూన్ వేసుకు ని  లాగించేయొచ్చు .. అంతబావుంటుంది తప్పకుండ
ట్రై చెయ్యండి   .. .....















*****************************************************************************

Saturday, September 30, 2017

దసరా శుభాకాంక్షలు

 బ్లాగ్ సోదర  సోదరీ మణులకు , ప్రేక్షకులకు ,వీక్షకులకు  దసరా శుభాకాంక్షలు . 











************************************

Thursday, September 14, 2017

మేకింగ్ ఆఫ్ ...


మేకింగ్ ఆఫ్ ... బాహుబలి  అంటాననుకున్నారా ! అబ్బా ఆశ దోసె  ,అప్పడం వడ . నేను ఇవి చేశాను అని చెప్పడానికే, మీరు చేసారా అని నమ్మలేనట్లు చూసారుకొందరు అప్పుడు నాకు ఇదేదో గొప్పపని కాబోలని మీకు చెప్పాలని ఇదంతా ,చిన్ని చిన్ని కుండలు ,కొనుక్కొచ్చి ఈ పండుగకి డెకరేషన్ అద్దిరిపోవాలి అని  అనుకున్నా ఏదన్నా అనుకుంటే అయిపోవాలి  వెంటనే ,ఈ మాయరోగం  ఒకటి వుందికదా !అబ్బెబ్బే ఆయన్నేమి వేధించను కావాలంటే మీరే ఆయనతో  మాట్లాడు కోవచ్చు . ఫోన్ నెంబరా ? చివర్లో పెడతానే ... :)) నా కాలక్షేపం నాదే, ఇంట్లోనే ఉండి టైం పాస్ చెయ్యడానికి బోలెడు  ఆలోచనలు చేస్తుంటాను .

ఇంట్లో  గేట్ కి వెయ్యడానికి తెచ్చిన  పెయింట్ లు  వున్నాయి . అలాగే ఒక వాటర్ పైప్ 4ఇంచెస్ ది వుంది. నేను కొన్నదేమిటంటే ,ప్లాస్టర్ అఫ్ పారిస్ ,ఎం సి ఎల్  ఒకటి తెచ్చాను .పైప్ నీట్ గా కడిగి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీళ్లతో కలిపి పైప్ కి పట్టించేసాను.కాస్త మందం గా అయింది . పడిపోకుండా బ్యాలెన్స్ కోసం క్రిందవైపు  మళ్ళీ పైన ఏమైనా పెడితే  పడకుండా పై వైపు ఒక రౌండ్ గా పొడవుగా  చేసి అతికించాను . మిగిలిన పి  ఒ పి తో చిన్న బుడిపెల్లా చేసి  అతికించాను అందం కోసం . ఒక దువ్వెనతో  లైన్ల మాదిరిగా గీతలు  పెట్టాలనుకుని మళ్ళీ రెగ్యులర్ గా ఉంటుందనిపించి మానేశా. 




 

రంగు వేసాక  ఇలా  తయారయ్యింది , గడపల  కోసం తెచ్చిన  ఎల్లో  ఆరంజ్ కలర్ వున్నాయి . వాటితో మరిన్ని హంగులు అద్దేసాను . ముందుగా  ఏమి అనుకోలేదు కానీ  చేస్తూ ఉంటే  ఇలా ఐతే బావుంటుంది అన్పించింది చేస్తూ వెళ్ళాను . మొత్తానికి  బాగానే  ఉందనిపించింది . కొని తెచ్చిన చిన్న కుండలని   కూడా  తోచిన విధంగా రంగులద్దేసాను .














అంతా  అయ్యేసరికి  పండుగకి  అలంకరించేసరికి  ఈవిధంగా  వున్నాయి . ఆ పువ్వులవీ  ఎం  సి ఎల్  తో చేసి అతికించాను  . కొని తెస్తే ఏమో కానీ  నేను చేశాను  అనుకుంటే మాత్రం  చాల బావుంటుంది మనసుకి . మరీ చిన్న పిల్లలుంటే  ఇలాంటి పని చేయలేము . (వాళ్ళు పూసుకునేదే ఎక్కువ ఉంటుంది : )) ఒక రెండు గంటలు కూర్చోగలము ఫర్వాలేదు  అనుకుంటే మొదలు  పెట్టచ్చు . కుదరలేదు అనుకోండి ,ఇంత కన్నా అందమైనవి బయట చాలాచోట్ల దొరుకుతున్నాయి  శుభ్రంగా కొని తెచ్చేసు కోవడమే ... సింపుల్ గా ...


***************************************

Thursday, September 7, 2017

వర్షం పడగానే ..



చినుకులు మొదలవ్వగానే  వచ్చే  మట్టి వాసన  నచ్చని  వాళ్లుండరని  నా గట్టి నమ్మకం ,
ఐతే  మన ఆహార వ్యవహారాలు ,అలవాట్లు  బట్టి ఆరోగ్యం  కాస్త అటు ఇటూ అవడానికి 
ఎక్కువ  ఆస్కారం  మాత్రం ఈ సీజన్ లో నే  . గ్రీన్ టీ లు ,అల్లం టీ లు పక్కన పెడితే 
వర్షం పడి  వాతావరణం చల్ల బడగానే ,నేను ఇంట్లో చేసేది ''అల్లం పులుసు ''ఆ .. .. 
బోలెడన్ని వంటలు ప్రోగ్రామ్స్  వున్నాయి ,మన వంటలు  ఎవరు పట్టించుకుంటారు ?
అనుకున్నాను ,కానీ''  కొబ్బరి అన్నం ''పోస్ట్ పెట్టిన కొద్దిరోజులకు  జనవరి 11న అనుకుంటా 
అభిరుచి  ఛానల్ లో దేశీరుచులు ప్రోగ్రాం లో'' కొబ్బరి అన్నం ''చేయడం చూపించారు . 

అలాంటప్పుడు ఆరోగ్యానికి పనికి వచ్చే ,ఈ పులుసు  చేయడం చూపించాలి  అనుకున్నా !
తీపిపదార్ధాలు  ఎక్కువతినడం వల్లవచ్చేపైత్యం, వికారం ,తగ్గుతాయి ,ప్రయత్నించండి . 
కట్టా మీఠా ,ఇష్ట పడేవాళ్లకు నచ్చుతుంది  కూడా ... 

అల్లం శుభ్రం చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి 
అదే సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి 
అదే సైజు చింతపండు గుజ్జు  తీసి పెట్టు కోవాలి 
స్పూన్ కారం ,సరిపడా ఉప్పు ,నూనె ,పసుపు 
వలిచిన  వెల్లుల్లి పాయరేకులు కొంచెం ఆవాలు
కరివేపాకు ,ఎండుమిర్చి ,కాస్త బెల్లం   .

విధానం ; ముందుగా నూనె  వేడిచేసి  ఆవాలు వేసి కరేపాకు ,వెల్లుల్లి ఎండుమిర్చి వెయ్యాలి .
ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించి ,అల్లంపేస్ట్ వేయాలి వేగాక పసుపు ,ఉప్పు ,కారం వేసి
వేయించి ,చింత పండు పులుసు వేయాలి ,కొంచెం నీళ్లు పోసి ఉడక నివ్వాలి ,దగ్గరకాగానే
బెల్లం వేసి ,అన్ని కలిపి ఉప్పు సరిచూసుకోవాలి . పొద్దున్నే ఒక్కరోజుకు టిఫిన్ త్యాగం చేసి
వేడి వేడి  అన్నం లో ఈ పులుసు వేసుకుని  భోజనం చేసేయండి .(ఎండల్లో మాత్రం వద్దు .)













  
***************************************************************************

Thursday, August 31, 2017

మనసే మూలం .



''మనసేమూలం ''

నిజమే కదా ! మనం ఏమి ఆలోచిస్తున్నామో , అదేచేస్తాం మన మనసేమి చెప్పిందో అదే సరైనదనుకుని నమ్మిపాటిస్తాము . మనసుకు మాత్రమే  జవాబు దారీగా  ఉంటాం. అలాంటప్పుడు మన ఆలోచనలెంత సరైన దారిలో ఉండాలి ? మన మనసెంత  స్వచ్ఛం గా ఉండాలి ? అలావుంటే  ఆ ప్రశాంతత మన ముఖం లో కన్పిస్తూ ,మన బుద్ధి తేటగా  ఉందని, ఆలోచన సవ్యంగా  ఉందనే విషయం ఎదుట వారికి కూడా అర్ధమౌతుంది . చక్కగా సర్దిఉంచిన గదికి ,చిందరవందర గా  వున్నా గదికి తేడాలేదూ ! అలాంటి గదిలో ఎంతసేపు  కూర్చోగలం ?.
                                                                                                                               
                           
ఒక మేకపిల్లని  నీళ్ళల్లో  పడేస్తే వెంటనే  ఈదుకుంటూ  వచ్చేస్తుందట ,అదే ఒక మనిషిని నీళ్ళల్లో పడేస్తే రెండో ఆలోచన లేకుండా  మునిగి పోతాడట ,కారణం వాడికి ' నాకు ఈత రాదు ' అని బలంగా  నమ్మడం వలన , అదే మేకపిల్లకి  నాకు ఈత రాదు అని దానికి తెలియదు కదా ! అందుకే  అది దర్జాగా  ఈదుకుంటూ  వచ్చేస్తుంది . మనం ఇంత చదువుకుని ,విజ్ఞానం వుండి, ఇంగితం ఉండి మన ఆలోచనలేమో ఇలా ఉంటాయి . ఎవరన్నాఅదిగో  వాళ్ళు నీ గురించి  ఇలా అన్నారు అనగానే  అదినమ్మి మన ఆత్మీయులని కూడా ఆలోచించ కుండా వాళ్ళని దూరం చేసేసు కుంటాం  ఎందుకంటారు ? ఆసమయం లో మన ఇంగితం  ఏమైపోతుంది ? కొంత మందికి ఇదే ఆట ,అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటే  చూడలేరు ,తల్లీ పిల్లలిని విడదీస్తే  గాని ఉండలేరు . అంతా ఒకరికొకరు  దూరమై పోతే ఒక మానసిక ఆనందం ... ఇంత చేసి వాళ్ళేమన్నా బావుంటారా అంటే ఇంతకి పదింతలు  వేరే రూపంలో  అనుభవిస్తూనే వుంటారు అనుభవించాలి కూడా  ఎందుకంటే .. చెడు ఆలోచనల ఫలితం  అనుభవించక తప్పదు . తాగుడు అలవాటున్న తండ్రిని అతని ప్రవర్తనని  చూసి అసహ్యించుకునిజీవితం లో  తాగని కొడుకులు కొందరైతే, తాగుబోతు  తండ్రిని చూసి ఆయనే తాగంగా లేనిది  నేను తాగలేనా అంటూ అలవాటు చేసుకునే కొడుకులున్నారు .(మనసే మూలం ).




                                                                                               
కొంతమంది తండ్రులు  తమ బంధువుల్లో చక్కగా  చదువుకుని  మంచి ఉద్యోగంలో ఉన్న' అంకుల్ 'ని కొడుక్కి చూపించి ,నేనుబాగా  చదువుకుని అలా మంచి వుద్యోగం చేస్తూ ,కార్లలో తిరగాలనుకున్నా .. కాని మానాన్న ''అక్కయ్య పెళ్లి చెయ్యాలి కదా నువ్వు వుద్యోగం చెయ్యాలి నాకు కాస్తన్నా సహాయంగా ఉండాలి ''అని వుద్యోగం చెయ్యమన్నారు ,తప్పలేదు . నువ్వన్నా బాగా చదువుకుని పైకి వస్తే చూడాలనుంది ,అన్నాడు అనుకోండి వాడుకాస్త  మంచి మనసు గలవాడైతే  అయ్యో నాన్నకి ఇలా అయిందా అందుకే చదువుకోలేక పోయాడా నేను తప్పకుండ అయన కోరిక నెరవేరుస్తాను అని నిర్ణయించుకుని పట్టుదలతో సాధిస్తాడు . అదే మరో తండ్రి మరో కొడుక్కి ,అదే అంకుల్ ని  చూపించి పై కధంతా చెప్పినప్పుడు ,కొడుకు బుద్ధి వంకరనుకోండి ,వాడు ఇలా అనుకుంటాడు ,ఒక సైకిల్  కొనడానికి  దిక్కులేదు కానీ ,బాగా సంపాదించి ఇచ్చేస్తే ,తీసుకుంటాడు ,కార్ కొని తిప్పేస్తే తిరుగుతాడట  సిగ్గులేదు .. నాకు వుద్యోగం రానీ నేనేమిటో చూపిస్తాను?? . ఇప్పుడు చెప్పండి మీకేమనిపిస్తోంది ,మనసే మూలం కదా .. అత్తగారు ఇంటినించి  బాగా పెట్టిపోతలు లేవని భార్యని పట్టించుకోని వాళ్ళున్నారు , చివరివరకూ తోడుగా ఉండాల్సింది మేమిద్దరమే  అనే ఆలోచన ఎందుకుండదు ? చిన్నతనం లో అడిగినవన్నీ కొనివ్వలేదని తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమం లో పెట్టేవాళ్లున్నారు .ఎందుకిలా జరిగిందో వాళ్ళకుకూడా అర్ధం కాదు ,లోపం ఎక్కడా అని బుర్రబద్దలు కొట్టుకుంటారు. చివరాఖరికి  పిల్లల్ని కనగలం  కానీ వాళ్ళబుద్ధుల్ని కనగలమా ? అని సరిపెట్టుకుంటారు. ఎంత నిజం  మనమేమో పద్దతి లేని పిల్లలిని చూసి ఏమిపెంపకం అని తిట్టుకుంటాము .
కుటుంబానికో అంతస్థు ,ఆర్థిక పరిస్థితి ఉంటుంది . ఏ రెండు కుటుంబాలకు పోలిక ఉండదు . 
వెండి శుభలేఖలు పంచి హెలికాఫ్టర్ లో బంధువులను రప్పించేవాళ్లున్నారు . ఇంటిముందు పందిరేసి  పదిమంది  బంధువులనుపిలిచి పెళ్ళిజరిపించే వాళ్ళున్నారు . అదీ పెళ్ళే ఇదీ 
పెళ్ళే .   ఇద్దరు పిల్లలున్న వాళ్ళు  చెరోవిధం గా ఉండడం ,ఒకే చెట్టు కాయలు వేరే వేరే రుచితో ఉండడం మనకు తెలిసిందేకదా !ఇలాంటి పిల్లలు (కొడుకులు ) వున్నవాళ్లు  అనుకోవలసిందే

'అ' ''పుత్రస్యగతిమ్ నాస్తి'' ...... 


********************************************************************************

Friday, August 25, 2017

వినాయకచవితి శుభాకాంక్షలు

                                       అందరికీ  వినాయకచవితి  శుభాకాంక్షలు 





*************************************************************************

Sunday, May 14, 2017

సినిమా



మొదటి మూడు రోజుల్లో గా ,సినిమా చూడక పోతే అవమానంగా  భావించే వాళ్ళని చూసినవ్వుకునే దాన్ని ,కానీ బాహుబలి 2 సినిమాకి  నేనుకూడా మా పిల్లలతోపాటు టికెట్స్ కోసం తొందర చేసేను ,మొత్తానికి నాలుగోరోజు దొరికాయి . అనుకున్నట్లే అన్ని సమపాళ్లలో  కుదిరి రెప్పలార్పకుండా చూసేలా తీశారు . రాజప్రాసాదాలు ,కోటలు, ప్రాంగణాలు ప్రాకారాలు  కళ్ళముందు ఆవిష్కరించారు . చిన్నతనంలో  అమ్మమ్మ పక్కలో పడుకొని
సారంగధర ,బాలనాగమ్మ కధలు విన్నప్పుడు  దేవాతావస్త్రం ,ఒంటిస్తంభం మేడ ఊహించుకోడానికి బుర్రచించుకునేదాన్ని , కళ్ళముందు ఇంత గొప్పగా కధనడుస్తుంటే ఊహలు నిజాలవుతుంటే రెప్పలార్పడం మర్చిపోడంలో  ఆశ్చర్యమేముంది ?
                                     
తనమనసులో ఏముందో బొమ్మలు వేసి చూపి , సెట్లువేసి ,గ్రాఫిక్స్ చేయించి ,జనాన్ని ఆనంద సినిమా సాగరంలో ముంచెత్తడం ఒక ఎత్తయితే ,అంతఖర్చు పెట్టడానికి వెనుకాడని నిర్మాతలు దొరకడం మరొక  ఎత్తయితే ,రాజకుమారుడి ఆహార్యం తో ఏలోపములేని రూపముకలిగి ఉండి, అన్ని సంత్సరాలు కేటాయించి ధైర్యం తో నమ్మకంతో ఈసినిమాకు పనిచేయడం, రాజకుమారుడంటే ఇలాగేవుంటాడా అనిపించేలా  వున్నాడు ప్రభాస్ . సినిమాకి అవార్డులు  మాటాఏమోకాని ,చుసిన ప్రతి ప్రేక్షకుడూ సాహోరెబాహుబలి అనుకోకుండా బయటికిరావడం లేదు ,అంతకన్నా అవార్డు అక్కరలేదనుకుంటా !. అందరికి అన్ని సినిమాలు నచ్చాలని లేదు ,నూటికి తొంబై మందికి నచ్చి పదిమందికి నచ్చక పోవచ్చు ,కానీ ఆ పదిమందిలో ఉన్నవాళ్ళు , జురాసిక్ పార్క్ ,టైటానిక్ ,అవతార్ సినిమాలని మెచ్చుకున్నవాళ్ళు ఐతే మాత్రం ఆలోచించాలి. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత గుర్తు  చేసుకోవాలి .
                                                 
మన సినిమాలు సందేశాలు ,సామాజికస్పృహలు ఇచ్చే రేంజ్ ఎప్పుడో దాటేశాయి,మానాన్నగారి  చిన్నప్పుడు నాగేశ్వరరావు ,రామారావు గారు లాంటి హీరోలతో  సిగెరెట్ కల్పించాలంటే  దర్శకులు ఆలోచించేవారంట ,హీరో నే తప్పుగా చూపిస్తే  యూత్ చెడిపోతారని వాళ్ళ ఆలోచనట . తర్వాతికాలంలో  అదేహీరోలు సిగెరెట్లూ కాల్చేవాళ్ళు డాన్సులు వేసేవారు . ఇక మా వరకు  వచ్చేసరికి బ్రేక్, షేక్ డాన్సులు వచ్చేసాయి ,ఆ హీరో ఐతే డాన్స్ చేస్తూనే జేబురులోనించి రుమాలు తీసి మొహం తుడుచుకుంటే అబ్బో .. ఎంచేసేడు ? (ఏంచేసేడు ?) అనుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడు డాన్సులు పోయి  జిమ్నాస్టిక్స్ వచ్చేసాయి  తల క్రిందికి కాళ్ళుపైకి  పెట్టి, మోకాళ్ళమీద దేకుతూవాళ్ళ  అవస్థలు చూస్తుంటే నాకైతే కాళ్ళు లాగేస్తుంటాయి .అరవైఐదుసంత్సరాలహీరో,ముప్పైఐదుఏళ్ల అతని కొడుకు కలిసి ,ఒక యువతీ లాంటి ప్రౌఢ తో ( ముప్పయ్యారు ఇంచీలు నడుముకి అరమీటరు గుడ్డ ,పైన రిబ్బను
ముక్కకట్టుకుని ) డాన్సులేస్తుంటే  చూసి అలవాటు పడ్డవాళ్ళం ,మనకు ఎలాంటి సినిమాలైనా  నచ్చుతాయి .

పోలీస్ ఆఫీసర్ ఐన  హీరో లంచాలు తీసుకుంటాడు చివరాఖర్న మారిపోయినట్లు చుపిస్తారులెండి ,చెల్లెలి కాపురం కోసం  వాళ్ళ కుటుంబాన్ని ,వాళ్ళఇంట్లో పనివాళ్లని నరికేస్తాడు హీరో, కానీ ఒక్క పోలీసు కూడారాడు ఎంచక్కా అందరూ  వేరే వూరువెళ్లిపోయి హాయిగా  వుంటారు. ఇవన్నీ సినిమాలనుకుని చుసినవాళ్ళం  బాహుబలి చూసేక  మళ్లీ మాములుగా ఎప్పటి లాగే సినిమాకి వెళ్లాలంటే కొంత ధైర్యం కావాలి .

**************************************************************************