,రెండో అన్నయ్య తో బాగా చనువు గా వుండే నేను ,పెద్దన్నయ్య అంటే చాల అభిమానిస్తాను , నన్ను ఎవరన్న ఏదన్న అంటేచాలు వుతికేసేవాడు . కాలేజ్ కి వచ్చి తీసుకు వచ్చే వాడు ,14 ఏ ళ్ళ కె స్కూటర్ నడిపే వాడు .
పోలిస్ ఆపితే , స్టేషన్ కి వెళ్దాం అంటూ తనే ,పోలిస్ ని వెంట తీస్కెళ్ళి ,సి ఐ తో [ఆయన నాన్న ఫ్రెండ్ ]
ఇంకెప్పుడు ఆపద్దని చెప్పండి ,అన్నాడట , ఆయన నవ్వేసి లైసెన్స్ లేకుండా ఎలా ,అంటే నాకు రెండు
రోజుల్లో మీరే ఇప్పించండి ,అని చెప్పి తీసుకున్నాడు . కార్స్ చాల మార్చాడు ఇప్పుడు ,బొలెరో మర్చి
స్కార్పి యో దగ్గర ఆగాడు . రెండు రోజులైనానిద్ర పోకుండా డ్రైవ్ చేస్తాడు . ఒకవేళ డ్రై వరుంటే ,తనతో కబుర్లు చెప్తూనే వుంటాడు ఎక్కడనిద్ర పోతాడోఅని ,మేము మాత్రం ,తన భరోసాతో హాయిగా బజ్జుంటాం .
నేను దసరాకి నాల్రోజులు ,వేసవికి వారం రోజులు , తప్ప పుట్టింటికి వెళ్ళడం కుదరదు . చంద్రకి అది కూడా
కుదరదు . నేను మాత్రమే పిల్లలతో వెళ్తుంటాను . మా పాపకి నాలుగేళ్ళు వుంటాయేమో ,మేము దిగాల్సిన
స్టేషన్ వస్తోందని , హడావిడి గా సర్దు తున్నాను . ఇంతలో మా పాప అమ్మా అదేంటి అంది ,ఏమిటా అని చుస్తే
ట్రై ను పక్కకి గేదలున్నాయి , అదా గేద ,అనేసాక మా ఎదుట సీట్లో ఉన్నాయన నా వంక కోపంగా చూస్తూ
కన్పించాడు . ''ఏ గ్రహం నించి తెచ్చావు తల్లి ఈ పిల్లలిని ,గేద కూడా తెలియకుండా పెంచుతున్నావు ?ఏ
ఊరి పతివ్రతవమ్మా నువ్వు ?''అన్నట్టుంది ఆయన చూపు ,ఆయన భార్య నవ్వాపు కోలేక పోతోంది . నాకు
చాల సిగ్గన్పించింది ,సైడ్ బెర్త్ లో వాళ్ళు కూడా నవ్వుతున్నారు . పాప కి మూడేళ్ళ వరకు మాటలు రాలేదు .
మా పెద్దన్నయ్య 'దీన్ని ఎవడు చేసుకుంటాడో వాడు అదృష్ట వంతుడు ,మాటలు రావు కదా 'అనేవాడు .
స్కూల్లో లేట్ గ వేసాము ,అదీ కాకా అప్పట్లో వుండేది అపార్ట్ మెంట్ రెండో ఫ్లోర్ ఇక గేద ఎలా తెలుస్తుంది .
దిగినాక సామాను కార్లో పెడుతుంటే ,అదే వ్యక్తీ ఆటో మాట్లాడుతూ కన్పించాడు ,'ఈ కాస్త దూరానికి యాభై
ఇవ్వాలా ,ఊరికి కొత్తా అన్నాడు ,ఆటో వాడికి కోపం వచ్చి నట్లుంది 'అవును ఇప్పుడే రైలు దిగాను అన్నాడు .
నా కస్సలు నవ్వాగదు , ఆ విధం గా బదులు తీరి పోయింది .
మా పెద్దన్నయ్య అంటే పాప కి భయం ,రెండో అన్నయ్య తో చాల క్లోజ్ . వచ్చే టపుడు ట్రైన్ ఎక్కిస్తే అస్సలు
దిగ నిచ్చేది కాదు ,సామర్లకోట దిగుతానని కూర్చునే వాడు ,ఈలోగా నిద్ర పొతే వొకే ,లేకపోతె రాజముండ్రి ,
లేకుంటే నాసీట్ పక్కభోగి లో వుంది అక్కడ కూచుంటా నని జారుకునే వాడు .
తను పొద్దున్న లేట్ గా లేస్తాడు ,ఈ లోగా భార్య రెండు సార్లు టీ ఇస్తుంది . మొహం కడగండి అంటుంది .
ఎం టిఫిన్ చేసావు ' అంటాడు ఇడ్లీ అంటే పెసరట్టు వేసి అప్పుడొచ్చి లేపు అని పడుకుంటాడు . చాలవెట
కార పురుషుడు . ఒకసారి మా పాప చూసి ' ఛి యాక్ మొహం కడక్కుండా టి తాగు తున్నవేంటి ' అంది
మరి మీ ఇంట్లో మొహం కడిగి తాగుతారా అనడిగాడు ఆశ్చర్యంగా ,మా మమ్మీ డాడి మొహం కడిగి
కాఫీ తాగుతారు అంది అదేదో గొప్ప లా , ''భలే దానివే మొహంకడిగి తాగితే ఔషధ గుణాలు పోతాయి
చెప్పు మీ డాడి కి అన్నాడు . [ఖర్మ ...... ఖర్మ .. ]
ఇంకో విశేషం ఏమిటంటే ,మా పెద్దన్న కూతురు అచ్చం నా లాగానే వుంటుంది . చివరికి పళ్ళు కూడా
నావే వచ్చాయి . బాగైంది ,ద్రోహి నన్ను నోటినిండా పళ్ళే ,రెండు వరుసలు , అనేవాడు ,కూతురికి అలాగే
వచ్చాయి ఏమి చేస్తాడు , అది నవ్వినప్పుడల్లా నన్నే గుర్తు చేసుకుంటాడట ,అచ్చం మీ అత్త పళ్ళు వచ్చాయి .
అంటాడట అదే చెప్పింది . నాకెంత సంతోషమేసిందో [శునకా నందం ] .పళ్ళకి క్లిప్ వేసుకుంటా అంటే అబ్బే
పన్ను మీద పన్నుంటే అదృష్టం అన్నాడు ఇప్పుడేమి చేస్తాడు . హ్హ హ్హా . కట్ చేస్తే మా వజ్రం అచ్చం మా
అన్న లాగానే వుంటాడు ,మాట్లాడటం చేతులు ,కాళ్ళు , ఇంతే కాక మేమంతా ఖాది టవల్స్ వాడితే వాడు
మా అన్న లాగానే టర్కీ టవల్స్ వాడతాడు , అది కట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే త్వరగా రెడీ కా అంటూ
అరుస్తుంటాను , ఎందుకంటే మా అన్న గుర్తు కొచ్చేస్తాడు మరి . ''ఇదింతే నేమో''' ప్రతి ఇంట్లో తప్పనిది .
***************************************
No comments:
Post a Comment