మన సామెతలు చాల బావుంటాయి . ప్రతిదాని వెనుక ఎంతో అర్ధముంటుంది . పల్లెటూళ్ళలో ఐతే సామెతలు
లేకుండా , మాటలే సాగవు . మనకి సామెతల గురించి తెలిసింది తక్కువే , మీకుతప్ప కుండ నచ్చు తాయను కుంటున్నాను . ఇందులో కొన్ని మోటు సామెతలున్నాయి ,వాడుకలోవే ,కనుకమీరు అర్ధం చేసు కుంటార నుకుంటాను . మనలో చాల మంది ప్రతీది ఎక్కడో విన్నా మే అనుకుంటారు .
1) సాటివారితో సరిగంగ లాడబోతే , ముసలి మొగుడిని మొసలి ఎత్తుకు పోయిందట .
అంటే కొత్తగా పెళ్ళైన ఆమె తో బాటు ,పొరుగమే కూడా నదిలో స్నానానికి వెళ్తే ఈమె భర్త ముసలాడు మరి.
వయసులో ఉన్నవారితో [పక్కవారి తో ] పోటి వద్దని చెప్పడం అన్నమాట . ఇటువంటిదే మరోటి .
2) సాటి వారితో చల్లచేస్తే చల్లకుండ చిల్లడిందని ... అంటారు .
పూర్వం ప్రతి ఇంటిలోనూ పాడి వుండేది ,తప్పనిసరిగా చల్లకుండలో చల్ల [మజ్జిగ ]చిలికేవారు వెన్నకోసం .
పొరుగామె ,పాడి లేకున్నా , మజ్జిగ లేకున్నా పోటీ గా వట్టి కుండ పెట్టి చిలికిందట . కుండ చిల్లుపదడా మరి .
3) ఆడపడుచు ఉసూరు మంటే ఆరు తరాలు అరిష్టం . ఇంటి ఆడపిల్లను అందంగా మంచి చెడ్డా చూసుకోక
పొతే ఆరు తరాలవరకు కుటుంబం పైకి రాదని అర్ధం .
4) అక్క చెల్లెలికి పెట్టి లెక్క రాసు కున్నట్లు . తోడపుట్టిన వాళ్ళకి పెట్టింది ఎవరన్నా లెక్కచుస్తారా అని
అలాచుసిన వాళ్ళు మనుషులే కాదని అర్ధం .
5) వెనకటికెవడో ముందుకు పడ్డా మీసాలకి మట్టి అంట లేదన్నాట్ట . తప్పు చేసామని తెలిసేలేదని
బుకాయించ వాళ్ళకి ఇది వర్తిస్తుంది .
6) కడుపులో లేనిది కావలించు కుంటే వస్తుందా . కడుపులో నిజంగా ప్రేమవుంటే ప్రకటించ క్కర లేదు .
ప్రేమలేక పాయినా కౌగలించుకో నవసరం లేదు . అదన్నమాట
7) మొహమాటానికి పొతే కడుపోచ్చిందట ,మోట గా వున్నా ఇది చాల నిజం ,మొహమాటానికి ఆఫీసు లో ,
పక్క వారి పనులు చేసి ఇరుక్కు పోయే వారు ,పక్కవాళ్ళు నగలడిగినా ,కార్ అడిగినా ఇచ్చేసి ,తిరిగి
ఆకారం కోల్పోయి అవి తిరిగి వచ్చిన పరిస్తితి చూసి బాధపడే వాళ్ళకు ఇది వర్తిస్తుంది .
8) గుడారం లో బిడారం . ''బిడారం ''అంటే ఒంటె ,చలిలో గుడారం [టెంట్ ] వేసుకున్న యజమాని
ఒంతెకి చలి వేస్తుందేమో అని తలపెట్టు కోనిచ్చాడట , ఐతే తెల్లవారే సరికి యజమాని బైట ,ఒంటె
గుడారంలో ఉన్నారట . మొత్తం ఆక్రమిన్చేసిన్దన్నమాట . సాయం చేసినవాడికే నెత్తిన చెయ్యి పెడితే
ఇది వాడుతుంటారు .
9) కనికరిస్తే కంట్లో వేలు అనేది కూడా ఇదే అర్ధం వస్తుంది .
10) జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులన్నా పెడుతుంది . నిజమే జుట్టు లేనివాళ్ళు ఏమి రకాలు వేసు కో
గలుగుతారు , ఇది డబ్బున్న వాళ్లకు లేని వాళ్ళకు మధ్య పోటి సూచిస్తుంది .
ఇకనేం మీరుకూడా సామెతలు వాడేయ్యండి . మీరు ఇంగ్లిష్ మీడియం అయినా ఫర్లేదు సరేనా!!!!!!!!!.
*********************************
No comments:
Post a Comment