Total Pageviews

Thursday, May 7, 2015

నా డ్రైవింగ్

  ఇదీ పాత  టపానే  చదివి  మీరు  నవ్వుకున్నారానుకోండి  నాకదో ''తుత్తి ''.

ఉన్నది  ఒక్క  ఆదివారం , ఇంట్లో  ఉండేదే  తక్కువ , ఒక స్కూటీ  కొనిస్తే ,కూరలు ,  కరెంట్  బిల్ ,పోన్ బిల్ 
అన్ని  నేనే  చూసుకుంటాను  కదా .  పాత  సినిమాలో  ఇల్లాలి  లా ' ఇన్నేళ్ళ  కాపురం లో  మిమ్మల్ని ఎప్పుడన్నా
ఎమన్నా  అడిగానా , అన్నా . గొంతు లో  పచ్చి వెలక్కాయ  పడ్డట్టు  చూసారు  చంద్ర . అంతే  కాదు  చూద్దాం  లే 
అంటూ  దాటేసారు . ఒక్కసారి  నా  మోకాల్లోకి  ఒక ఆలోచన  వస్తే  ఎంతకీ పోదు [నా  బుర్ర  అక్కడే వుంది  మరి ]
వదలకుండా  జిడ్డులా  పట్టుకున్నా , మాట్లాడితే  ఇన్నేళ్ళ  కాపురం లో ....ఎప్పుడన్నా  ఏదన్నా  మిమ్మల్ని .... 
ఈనస  భరించ లేక , ఒక 'సరైన  సమయం లో ' కొత్తది  కాదు ,పాతది  కొనిస్తా ,నీకు  బాగా వచ్చాక  మార్చి కొత్తది 
 కొంటాను  అని  కమిట్  చేయించారు . మెకానిక్  చెప్పి ,ఒక వైట్  స్కూటీ  కొన్నారు . దానికి  పూల మాల  వేసి 
పసుపు ,బొట్టు ,పెట్టి  నిమ్మకాయలు  తొక్కించి ,పార్క్  తీసుకేల్లాము ,కంటోన్మెంట్  ఏరియా  కావడంతో  పార్క్ 
లో ప్రేమ  జంటలుండవు , మనం  డర్టీ పిక్చర్  చూడక్కర్లేదు . బాయ్స్ మాత్రం  క్రికెట్  ఆడుతుంటారు . స్కూటీ 
నేర్చు  కోవడం మొదలు పెట్టా , ఎలాగో  కిందా ,మీదా   పడి  నాలుగు  రోజుల్లో  నేర్చేసుకున్నాను . ప్రాక్టిస్  బాగా 
చెయ్యమని  చంద్ర  ఒకచెట్టు  చూసుకుని  పేపర్  తీసారు , నేను జాం   జాం మంటూ రౌండ్స్  కొట్టేస్తున్నను . 
ఇంతలో  పెద్ద శబ్దం ,కళ్ళు  చీకటి  కమ్మాయి . చుస్తే  స్కూటీ 7 వ  నెంబర్ ,నేను 3 వ  నంబరే  వేసున్నాము . 
ఎక్కడో  ఏదో  కలుక్కు  మంది . నేను  ఇక్కడ  వుంటే ,స్కూటీ పదడుగుల  దూరం లో వుంది . బాయ్స్ పరుగున 
వచ్చి  స్కూటీ  లేపారు ,చంద్ర పరుగున  వచ్చి వాళ్ళెక్కడ  నన్ను లేపెస్తారో  అని  తనే ముందు  నన్ను  లేపారు . 
[జెలసి ]. మొత్తానికి  అన్ని పార్ట్లు  బానే  ఉన్నాయని  నిర్ధారించుకుని ,ఇంటికి  వచ్చాము ,మరుసటి రోజు  నేను 
భయ  పడుతూ  కూర్చుంటే  కుదరదు ,సాహసం  చేయరా  డింబకా ,రాజకుమారి  దొరుకుతుంది  అనుకుంటూ 
స్కూటీ  తీసి మార్కెట్  కి  వెళ్ళాను ,  ఒక  టీ బడ్డి  దగ్గర బండి  పెట్టేసి , స్టైల్ గా  కీ  ఊపుతూ  వెళ్ళి  కూరలు   కొన్నాను  బండేగా  మోస్తుంది  అని కొంచెం  ఎక్కువే కొన్నాను  ఎలాగో  అవి తీసుకుని  వచ్చి స్కూటీ కి తగిలించా 
వెళ్ళేప్పుడు  లేని  ఒక  బైక్ ,రెండు సైకెల్  అక్కడ  వున్నాయి . రోడ్  ఎత్తులో వుంది ,మట్టి లోనించి  తీసి  రోడ్  ఫై 
పెట్టడం  నావల్ల కావడం  లేదు , చుట్టూ చూసాను ఎవరి పనుల్లో  వాళ్ళున్నారు . టి షాప్ అతను చిల్లర లెక్క 
పెట్టుకునున్నాడు . ఏమి చెయ్యాలి అని చూస్తున్నాను , బల్లమీద  కూచుని  చిన్న గాజు  గ్లాస్  లో టి  తాగుతున్న 
ఒకతన్ని చూసా ,పూలు అమ్ముతడను కుంటా పక్కనే సైకిల్  దానిమీద జంగిడి  దానిలో పూలు తడి  గుడ్డ కప్పి 
వున్నాయి ,''భయ్యా '' అనిపిల్చాను ,అతను అటు  ఇటు  చూసి  తననే  అని నిర్దారించుకుని 'హా  బోలో 'అన్నాడు 
'జర  గాడి నికాలో భయ్యా ' అన్నా ప్లీసింగా ,వెంటనే వచ్చి  బండి రోడ్ మీద  పెట్టేసి 'ఠీక్ హైనా 'అన్నాడు నేను 
థాంక్స్  చెప్పాను 'అరె ఇస్మే  క్యాహే బెహన్ ' అన్నాడు ,ప్రతి వారం ఈ టైం కి  ఇక్కడే  ఉంటాడా  అడుగుదామను
కున్నా , బావోదేమో  అని ఊరుకున్న ,మెల్లగా  బేలన్స్ చేసుకుంటూ  బయల్దేరా , అదేమీ చిత్రమో  అందరూ 
నన్ను దాటి  వెళ్లి పోతున్నారు , ఆఖరికి సైకిల్  వాళ్ళు కుడా ,వాళ్ళని ఆశ్చేర్యం గా చూసుకుంటూ  ఇంటి 
దారి పట్టా , లారి  వచ్చినా ,బస్ వచ్చినా ప్రక్కకు  ఆపేస్తూ , మళ్ళి రోడ్ మీదకి వస్తూ ,నానా  తంటాలు  పడుతూ 
వస్తుంటే  ఎదురుగా కార్ లో  వస్తున్న 'స్మార్ట్ ఫెల్లో ' నవ్వుతూ ఏదో సైగలు చేసాడు ,''సచ్చినోడ ,అక్కా ,చెల్లెళ్ళు 
లేర్రా ,పోతవురరేయ్  వెళ్ళే దార్లో  కరెంటు స్తంబానికి  కార్ గుద్దుకుని ,కాళ్ళు  చేతులూ  విరిగి పోతాయి రా ''
అని  సపించాను . ఇంకాస్త ముందుకు రాగానే  బైక్ ఫై  వస్తున్న వాడు కూడా ఏదో సైగ చేస్తూ  వెళ్ళాడు . ఏమైంది 
ఈవేళ  ఈసచ్చి నోల్లందరికి  వీడుకూడా  బస్ గుద్దు కుని ... ఒక పెద్దాయన 'అమ్మా రైట్ సిగ్నల్ వేసుకు ని 
వెళ్తున్నావు  అన్నాడు [ఆడవాళ్ళం కదా అనుమానం  ముందు పుట్టి  వెనకాల మేము పుడతాము . ]అయ్యయ్యో 
ముందు  వెళ్ళిన వాళ్ళిద్దరిని కాపాడు  దేవుడా నామంచికె  చెప్పారు ,అని అనుకుంటూ  డ్డు .. డ్డు మంటూ 
ఇల్లుచేరాను ,ఛత్రపతి లా  సంచి లాక్కుంటూ వచ్చా . అన్న మాట ప్రకారం  పనులన్నీ  నేనే చేసే దాన్ని అయితే 
ఇలా రెండు నెలలు కూడా గడవలేదు ,స్కూటీ సెల్ఫ్ స్టార్టర్ పోయింది . మెకనిక్ చూపిస్తే  వాడు  బండి ఖరీదు 
అడిగాడు , ఇలా కాదని  కిక్ అలవాటు చేసుకున్నాను . స్కూల్కి వెళ్లి పిల్లలిని  తేవాలంటే మూడింటికి మొదలు 
పెట్టాలి కిక్ కొట్టడం ,ఒకోసారి  నాలుగయ్యేది ,వాళ్ళే వచ్చేసి ,బాగ్స్  నా మొహాన  పారేసి  వెళ్ళేవారు  కోపంగా 
మరుసటి రోజు నుంచి  లంచ్  అవర్ కె మొదలు పెట్టే దాన్ని కానీ నా కాలు  ఎందుకూ పనికి రాదనిపించి న్ది . 
ఇంక ఇలా కాదని  నాకు  నేనే  బండి  అమ్మేయ్  అన్నాను . వెంటనే ఉత్సాహంగా [ఇలాంటి వాటికీ ముందుంటారు 


అమ్మి పారేసారు . నా జీవితంలో ఎప్పుడు  ఏమి  అడగనండి  అని పరోక్షం గా  నాతోనే  అనిపించారు . 

5 comments:

  1. హహ్హా... బావుందండీ!
    పట్టువదలని విక్రమార్కుడు జన్మించిన నేల మనది... ఈసారి నాలుగు చక్రాల శకటాన్ని ప్రయత్నించండి! ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు... వాహనం తప్ప :))

    ReplyDelete
  2. అదీ అయింది నాగరాజుగారు ,మీరు చదవాలనుకొంటే ''ఎటో వెళ్ళిపోయింది ... '' నా పాత టపా
    ఒకటి వుంది చదివి చూడండి . ధన్యవాదాలు .

    ReplyDelete
  3. మరి కొత్త బండి సంగతి ఏమి అయ్యింది :)

    ReplyDelete
  4. మరి కొత్త బండి సంగతి ఏమి అయ్యింది :)

    ReplyDelete
  5. మీరు మరీ అమాయకుల్లా ఉన్నారే ! ఆడవాళ్ళు ఎప్పుడన్నా పట్టిన పట్టు విడవడం చూసారా !
    కొనిపించేసేమండి , వెగో'' . నా బ్లాగు కు స్వాగతం .. అలాగే మీకు ధన్యవాదాలు ...........

    ReplyDelete