ఉదయం తొమ్మిది గంటలికి పెళ్లి . ఈ పెళ్ళిలో ఎలా అన్నా ఒక మంచి అమ్మాయి మా అరుణ్ కి దొరకాలి ,అని అనుకున్నాను . అరుణ్ మా అక్క కొడుకు . హైదరాబాద్ లో విలయమ్స్'లో జాబ్ చేస్తున్నాడు . నేను ,చంద్ర, అరుణ్ కలిసి మండపం లో గాలింపు మొదలు పెట్టాము . చాలామంది అమ్మయిలు వచ్చారు . 'కలర్స్' తో కళకళ లాడిపోతోంది మండపం . కానీ అదేంటో దేశం లో తిండికి కఱువు వచ్చి నట్లు ఉంటే సన్నగా వానపాము లావున్నారు . లేకుంటే తినడమే జీవిత ద్యేయం అన్నట్లు ఇటు పక్క ఎమ్ 'అర్ 'ఎఫ్ టైర్ అటు పక్క బ్రిడ్జిస్టోన్ , వున్నవాళ్ళు కన్పిస్తున్నారు , లంగా ఓణి , చూసి అమ్మాయిలను కోవాలి తప్ప లేకపోతె .......... ఇంతలో ,అరుణ్ ఒక వైపు చూపించాడు , ఓహో .. నారాజా మావాడి పంట పండింది . నిమ్మపండు రంగు చీర లో నిమ్మపండు లా మెరిసి పోతూ చాల అందంగా ఉంది . అరుణ్ కేమో కానీ నాకుమాత్రం పూల వర్షం ,మెరుపులు లాంటివన్నీ అని పించి నాయి . చంద్రని వెతికి పట్టుకున అమ్మాయి ని చూపించాం . తనకి కూడా నచ్చింది . నీపంట పండింది రా అబ్బాయ్ 'అన్నారు . మావాడు ,' థాంక్స్ ' బాబాయ్'. అన్నాడు . పెళ్లి ఐంది , భోజనాలు చేస్తూ ,కిలో బరువున్న పళ్ళాలు పట్టుకు తిరుగుతూ అమ్మాయి కోసం వేదికాము ఒక చోట మూడు నాలుగేళ్ళు ,బాబు ఏడాది ,పాపకి అన్నం పెడుతూ ఆమె ,నీళ్ళ గ్లాస్ పట్టుకుని ఆమె భర్త కన్పించేరు . 'జిగ్'మని తలలు తిప్పి ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం .. కరెక్ టైం కి వచ్చేసారుచంద్ర 'ఏమి టైం మిన్ గ్ వై 'అనుకున్న . రావడమే అటు చూసి 'ఏరా వాళ్ల ఆయన ఇక్కడే ఉన్నట్లున్నాడు అడిగి చూడ కూడద ', అన్నారు . అరుణ్ 'అబ్బ పిన్ని గుండెల్లో కలుక్కు మంది ' అన్నాడు . నాక్కూడా అనుకుంటూ 'నువ్వేమి ఫీలవ్వకు నీకు మంచి పిల్లని చూసే బాద్యత నాది అన్నాను . నాకప్పుడు తెలీదు పెళ్ళంటే మాటలు కాదు నాకున్న అనుభవం ,అవగాహనా సరిపోవని . అన్ని రకాల పేపర్లు తెచ్చాము . మాట్రిమొని లకి ఫోన్ చేసాం .కొన్ని సెలక్ట్ [మా సామజిక వర్గం ] సెలక్ట్ చేసాం . మూడు ఫోన్లు చేసాం అవేమంత గొప్పవి కాదు కానీ ఒక ఫోన్ గురించి మాత్రం చెప్పాలి . kg బంగారం ఇస్తారట అమ్మాయి కి ,నా కల్లుమేరిసాయి ఇంకేం వాళ్ళకి చేశా ,ఆఫీసు లో రిసెప్షనిస్ట్ లా చాల కాజువల్ గా మాట్లాడింది . పెల్లికుతురి అక్కట . వివరాలడిగింది చెప్పాను .
ఆమె _ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ?
నేను -ఇక్కడే హైదరాబాద్ లోనే
ఆమె - ఎకంపనీ ?
నేను - అదేనండి విలయమ్స్ నెలకి 80 వేలు వస్తుంది అబ్బాయి చాల మంచి వాడు తల్లిని ,చెల్లిని బాగాచూస్... ఆ మె -తల్లికి గంజి ఎయ్యనోడు పిన్నమ్మకి కోకేట్టాడఅంట మా అమ్మయిని ఎలా చూసు కుంటాడో మాకదే ముఖ్యం . ఇంతకీ సాఫ్ట్ వేర్ ఇంజినీరేనా ? అంది . నేను - కాదండి చార్టెడ్ అక్కౌంట్ టెంట్ అన్నా ఆమె -మాకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలి , అని ఫోన్ పెట్టేసింది . నేను పట్టువదలని విక్రమార్కిని లా మాట్రిమోని లన్ని వెతకబట్టేను . ఒక మేరజే బ్యురోకి చేశాను . ఇన్నివేలైతే మీకు నచ్చే వరకు చూపిస్తాం తక్కువైతే ,మూడే చూపిస్తాం . అన్నారు . 'నాకుముందు అమ్మాయి ల ఫోటో లు కావాలి డబ్బు కట్టాక మీరు అల్లాటప్ప వి చూపిస్తే ' అన్నాను ఆమె సరే ఫోన్ నంబర్ మాత్రం డబ్బు కట్టాక ఇస్తాను అంది . సరే అన్నా అరుణ్ మెయిల్ ఐ డి తీస్కుని మూడు ఫోటో లు పంపింది . అరుణ్ మెయిల్ ఐ డి కి ఫొటోస్ రాగానే మూడు ఫొటోస్ లో ఒకటి సెలెక్ట్ చేసాడు . పేరు మాన్విత ,ఇద్దరు అన్నలు ,తనేమో బి టెక్ చదివింది . నాన్న ట్రావెల్స్ నడుపుతారట . ఇంతలో ఎవరో అరుణ్ కి చెప్పారట , డబ్బు తీసు కున్నాక మంచి వి చూపించరని . ఏమి చెయ్యాలి అని ఆలోచించాము , చివరికి వద్దనుకున్నాం . కానీ మేరేజ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు . నేను ఏదో చెప్పి తప్పించు కుంటూ వస్తున్నా . ఒక రోజు అరుణ్ కే ఫోన్ చేసి అమ్మాయి తల్లి రేపు వస్తుందని మాట్లాడమని చెప్పారట . తను వెంటనే నాకు చేసాడు . నేను చంద్రకి విషయం చెప్పాను , 'ఏమి కాదు మాట్లాడు ' అన్నారు . అనుకున్నట్లే ఫోన్ వచ్చింది . 'పెళ్లి కూతురి తల్లి వచ్చారు మాట్లాడండి అని ఫోన్ ఇచ్చారు . పరిచయాలు చేసుకున్నాం . పెద్దా విడ గొంతు వింటే చాల మర్యాదస్తు రాలి లా వున్నారు . మీరు పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది చెపితే మా తమ్ముడు వాళ్ళని పిల్చు కుంటా మంది . మీ నంబరు ఇవ్వండి అన్న వెంటనే మేరేజ్ బ్యూరో ఆమె తీసుకుని మీరు డబ్బు కట్టకే నెంబర్ ఇస్తామంది . పెళ్ళికూతురు వాళ్ళు డబ్బు కట్టేసారండి అనిచెప్పింది . సరే అంతా బావుంది కదా అని డబ్బు కట్టేం .రెండు నంబర్ లు ఇచ్చారు . ఒకటి వాళ్ళ నన్నది , ఇంటిది . వాళ్ళ నాన్నగారికి చేసాము . అయన బిజి ట ఇంటికి మాట్లాడమన్నారు . ఆ నెంబర్ కి చేస్తే ఒకపోష్ లేడీ ; యా హూ ఈస్ దిస్ ' అంది . నేను మొ త్తమ్ చెప్పి వాళ్ళ అమ్మకిమ్మన్నాను . ఇంటికేల్లక చేపిస్తానని అంది . నేను తెగ మురిసి పోయా అసలే మనం బి ఏ 'డిస్క్ ' ఏమో ఇంగ్లిష్ కోడలు పిల్లలు కూడా ఇంగ్లిష్ లోనే ఏడుస్తూ ,నవ్వుతూ ,'అన్నీ ' ఇంగ్లిష్ లోనే చేస్తుంటే ఎంత బాగుంటుంది ,అనుకున్న . వారం తిరిగింది ఎ ఫోనూ రాలేదు . మగ పెళ్లి వాళ్ళ మయ్యె ... ఆరోజు అంత కంగారు పడింది ఇప్పటికి చెయ్యలేదు . ఆఖరికి నేనే చేసినా ఎవరెవరో తీసేవారు . పొంతన లేని సమాధానాలు , విసిగి పోయి ఇలా కాదని , .... క్షణ మేరేజ్ బ్యూరో కి చేశాను మా 'కేసు ' చూసే ఆమె సెలవు లో ఉందట . వచ్చేక మాట్లాడమన్నారు . నేను చేస్తూనే ఉన్నాను ,పదిహేను రోజులు గడిచాయి . అప్పటికి ఆమె వచ్చింది . నేనెవరో ఆమెకి మొత్తం గుర్తు చెయ్యాల్సి వచ్చింది . 'అయ్యో మీరా ఆ అమ్మాయి కి పెళ్లి కుదిరింది కదా మీరు వేరే ఫొటోస్ చూడండి పంపిస్తాను . అంది . ఇంకేమంటాను ,పొరగా పొరగా మూడు ఫొటోస్ పంపింది . ముమైత్ కి మార్పులు చేసి నట్లు ఒకామె , వేదం లో ' కర్పూరం ' లా ఒకామె ,మూడోది మెల్లకన్ను . నేను ఫోన్ చేసి చెడ మడ తిట్టేను , ఆమె ఏమి పట్టించు కోలేదు . ఇది మాములే అన్నట్లు ఉంది . నా రక్తం మరిగింది ,కళ్ళు ఎరుపెక్కి పిడికిళ్ళు బిగిసు కున్నాయి . నా ఈగో హర్ట్ ఐంది . వెంటనే ఫోన్ తీసి గుండె లదిరే సౌండ్ తో బ్రేకింగ్ న్యూస్ వేసీ ఛానల్ కి ఫోన్ చేశాను . మాకు జరిగిన అన్యాయం చెప్పాను . ఎలా అయినా ... క్షణ ని మూ ఇంచా లన్నాను మాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగ కుడదన్నాను . 'తప్ప కుండా మేడం అన్నాడు .
నేను -ఎప్పుడు వెళ్తారు .
ఛానల్ వాళ్ళు -మీరెప్పుడంటే అప్పుడే .
నేను -అవునా.. తక్షణమే వెళ్ళండి .
ఛా వా - మీరెప్పుడు డబ్బిస్తే అప్పుడే .
నేను - డబ్బే మిటి ..
ఛా వా - ఒక పెళ్లి కొడుకుని సెట్ చేసి తీస్కేల్లాలి ,చిన్న కెమెరా ఉండాలి ,సంబాషణ రికార్డ్ చెయ్యాలి
రెండు , మూడు ,సార్లు అక్కడికి , ఇక్కడికి ,తిరగాలి .. అంతా కలిసి పదిహేను , ఇరవయ్ వేలు అవుతాయి .
నేను -ఆ ?
ఛా వా - ఆ ;;.....
ఇప్పుడు అరుణ్ పెళ్ళి జరిగింది ,బందువుల అమ్మాయి తో నే . వాళ్ళు హ్యాపీ గా వున్నారు .
No comments:
Post a Comment