మొదట మనం అందానికి చిట్కాలు చెప్పుకున్నాము . ఇప్పుడు ఆరోగ్యానికి . ఇవన్ని మా ఇంట్లో మా
పెద్దవాళ్ళు పాటించినవి . ఇవన్నీ నేను పాటిస్తుంటాను .పిల్లలికి ఎక్కువ మందులు వాడే పని లేకుండా ఉపయోగ పడుతుంటాయి .
1] దగ్గు ఆయాసం వున్నవాళ్ళు ,కాస్త చల్లబడగానే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది . అలాంటప్పుడు కాస్త
వాము వేయించి , ఒకగుడ్డ లో మూటకట్టి ,ఛాతి మీద వీపు మీద కాపడం చేయాలి . త్వరగా ఫలితం వుంటుంది
2] ఒకోసారి తిన్న తిండివల్లనో ,బయట బండిమీద తినడం వల్ల కూడా కడుపులో నొప్పిలా అన్పిస్తుంది . అప్పుడు కొంచెం నునె లో కొంచెం వాము ఒక ఎండుమిర్చి , కరివేపాకు వేయించి వేడి వేడి అన్నం లో
కలిపి కొద్దిగా ఉప్పు చేర్చి తినాలి . కడుపునొప్పి హుష్ కాకి అయిపోతుంది .
3] ఎప్పుడూ చేసుకునే చారు విసుగు పుడుతోందా .. ఐతే రెండు బెండకాయల తో పాటు చిన్న బెల్లం ముక్క
వేసి మరిగించండి , పోపులో వాము వేసి తాలింపు పెట్టండి .
4] ముఖ్యం గా గుర్తు పెట్టుకో వలసిన విషయం వాము త్వరగా మాడుతుంది ,కాబట్టి చిన్న మంట మీద
చేసుకోవాలి .
5] ఎప్పుడన్నా వాము ఆకు దొరికితే ,బజ్జీ వేసుకోవడం మర్చి పోకండి . రుచికి రుచి ,ఆరోగ్యానికి ఆరోగ్యం .
6] సెనగపిండి పడని వాళ్ళు చాలామందే వుంటారు . అలాగే పప్పులు కూడా అలాంటి వాళ్ళు , సొంటి పొడి
దొరుకుతుందిదానితో ధనియాలు ,జీలకర్ర పొడిచేసుకుని ,అన్నంలో మొదటిముద్దలో నెయ్యి వేసుకుని తినాలి .
7] కడుపులో కాస్త మండగానే మందులు గుప్పించేయ్యకండి ఎర్రని పళ్ళు పరకడుపున తినాలి . స్ట్రాబెర్రీ ,చెర్రీ
లేదా టమాట పళ్ళను రెండు తీసుకుని ముక్కలుగా కోసి ,కాస్త పంచదార చల్లి తిన్నా మంటతగ్గుతుంది . వారం
లో రెండుసార్లన్నా తీసుకుంటే త్వరగా ఫలితం వుంటుంది .
8] ప్రొద్దుటే తలతిరిగే బాధ ముఖ్యం గా ఆడ వాళ్ళ లో ఎక్కువగా వుంటుంది . పుట్నాలు [వేయించిన శెనగ
పప్పు ] పొడి చేసుకుని బెల్లంతో ,కలిపి తినాలి . లేదా పాలుకలుపుకుని కూడా తినచ్చు .
9] ఆడపిల్లలికి తరచూ నువ్వులు బెల్లం కలిపి చేసే నువ్వులుండలు పెడుతుండాలి .
10] కప్పు నువ్వులు, స్పూను జీలకర్ర , ఎండుమిర్చి ,వలిచిన వెల్లుల్లి కలిపి వేయించి ,పొడికొట్టి రొజూ మొదటి ముద్దలోతినాలి . దీనివల్ల కాల్షియం లభిస్తుంది .
11] వీలైనంత వరకు ఖర్జూరం ఎక్కువ తింటే మంచిది .
12] నెలకి ఒకసారన్నా పొద్దున్న ఖాలీ కడుపుతో దనియాలు రసం తీసి పుచ్చుకోవాలి కఫం తగ్గుతుంది .
13] పెద్దవాళ్ళకి కాళ్ళు నొ ప్పులుగా వున్నప్పుడు ,రాళ్ళ ఉప్పు ను, వేడిచేసిన నీళ్ళలో వేసి ,వేడి సరి చూసి
కాళ్ళు ఉంచమని చెప్పాలి , నొప్పులు తగ్గుతాయి .
14] దాల్చిన చెక్క పొడి చేసుకుని ,టీ కాచేటప్పుడు చిటికెడు వేసుకుంటే ,కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .
15] కాస్త నూనె లో వలిచిన వెల్లుల్లి నాలుగు , రెండు చిదిమిన ఎండు మిర్చి వేసి వేయించి ,మెత్తగా
నూరిన గసగసాలు ముద్ద వేసి కురలా చెయ్యాలి . ఇది వేడి అన్నం తో తింటే , జిగట విరోచనాలు
అదే రోజు తగ్గిపోతాయి .
16] ఒక గుప్పెడు గోధుమలు ఒక రోజంతా ,నీళ్ళ లో నానించి ,వాటిని ఒక తొట్టిలో మొలకేత్తించాలి ఆ గడ్డి
కట్ చేసి , గ్రైండ్ చేసి వడపోసి ,నిమ్మచెక్క పిండి ,కాస్త తేనే కలిపిఉదయమే పుచ్చుకొండి ఆ రోగ్యంకోసం .
17] రోజు మొత్తం లో ఒక పది నిముషాలన్నా వ్యాయామం మంచిది . ప్రొద్దుటే చెయ్యడం వీలు కాక పొతే
తిన్న తర్వాత నాలుగు గంటల విరామం ఇచ్చి వ్యాయామం చేస్తే మంచిది . అవి కూడా యోగా సనాలు
శరీరాన్ని భాదించ కుండా నిదానం గా చేసుకుంటూ వెళ్ళడం ముఖ్యం . ఇప్పటికే వచ్చి వుంటే
సరే లేక పొతే ,టి వి లో చూసి కాకుండా ఎవరన్నా నిపుణుల దగ్గర నేర్చుకుని కనీసం రోజుకు పది
ఆ సనాలు వెయ్యగలిగే ప్రయత్నం చెయ్యాలి .
.
***********************************************

Good tips
ReplyDeleteధన్యవాదాలు గురుగారు .
Delete