చినుకులు మొదలవ్వగానే వచ్చే మట్టి వాసన నచ్చని వాళ్లుండరని నా గట్టి నమ్మకం ,
ఐతే మన ఆహార వ్యవహారాలు ,అలవాట్లు బట్టి ఆరోగ్యం కాస్త అటు ఇటూ అవడానికి
ఎక్కువ ఆస్కారం మాత్రం ఈ సీజన్ లో నే . గ్రీన్ టీ లు ,అల్లం టీ లు పక్కన పెడితే
వర్షం పడి వాతావరణం చల్ల బడగానే ,నేను ఇంట్లో చేసేది ''అల్లం పులుసు ''ఆ .. ..
బోలెడన్ని వంటలు ప్రోగ్రామ్స్ వున్నాయి ,మన వంటలు ఎవరు పట్టించుకుంటారు ?
అనుకున్నాను ,కానీ'' కొబ్బరి అన్నం ''పోస్ట్ పెట్టిన కొద్దిరోజులకు జనవరి 11న అనుకుంటా
అభిరుచి ఛానల్ లో దేశీరుచులు ప్రోగ్రాం లో'' కొబ్బరి అన్నం ''చేయడం చూపించారు .
అలాంటప్పుడు ఆరోగ్యానికి పనికి వచ్చే ,ఈ పులుసు చేయడం చూపించాలి అనుకున్నా !
తీపిపదార్ధాలు ఎక్కువతినడం వల్లవచ్చేపైత్యం, వికారం ,తగ్గుతాయి ,ప్రయత్నించండి .
కట్టా మీఠా ,ఇష్ట పడేవాళ్లకు నచ్చుతుంది కూడా ...
అల్లం శుభ్రం చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
అదే సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి
అదే సైజు చింతపండు గుజ్జు తీసి పెట్టు కోవాలి
స్పూన్ కారం ,సరిపడా ఉప్పు ,నూనె ,పసుపు
వలిచిన వెల్లుల్లి పాయరేకులు కొంచెం ఆవాలు
కరివేపాకు ,ఎండుమిర్చి ,కాస్త బెల్లం .
విధానం ; ముందుగా నూనె వేడిచేసి ఆవాలు వేసి కరేపాకు ,వెల్లుల్లి ఎండుమిర్చి వెయ్యాలి .
ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించి ,అల్లంపేస్ట్ వేయాలి వేగాక పసుపు ,ఉప్పు ,కారం వేసి
వేయించి ,చింత పండు పులుసు వేయాలి ,కొంచెం నీళ్లు పోసి ఉడక నివ్వాలి ,దగ్గరకాగానే
బెల్లం వేసి ,అన్ని కలిపి ఉప్పు సరిచూసుకోవాలి . పొద్దున్నే ఒక్కరోజుకు టిఫిన్ త్యాగం చేసి
వేడి వేడి అన్నం లో ఈ పులుసు వేసుకుని భోజనం చేసేయండి .(ఎండల్లో మాత్రం వద్దు .)

***************************************************************************
No comments:
Post a Comment