మేకింగ్ ఆఫ్ ... బాహుబలి అంటాననుకున్నారా ! అబ్బా ఆశ దోసె ,అప్పడం వడ . నేను ఇవి చేశాను అని చెప్పడానికే, మీరు చేసారా అని నమ్మలేనట్లు చూసారుకొందరు అప్పుడు నాకు ఇదేదో గొప్పపని కాబోలని మీకు చెప్పాలని ఇదంతా ,చిన్ని చిన్ని కుండలు ,కొనుక్కొచ్చి ఈ పండుగకి డెకరేషన్ అద్దిరిపోవాలి అని అనుకున్నా ఏదన్నా అనుకుంటే అయిపోవాలి వెంటనే ,ఈ మాయరోగం ఒకటి వుందికదా !అబ్బెబ్బే ఆయన్నేమి వేధించను కావాలంటే మీరే ఆయనతో మాట్లాడు కోవచ్చు . ఫోన్ నెంబరా ? చివర్లో పెడతానే ... :)) నా కాలక్షేపం నాదే, ఇంట్లోనే ఉండి టైం పాస్ చెయ్యడానికి బోలెడు ఆలోచనలు చేస్తుంటాను .
ఇంట్లో గేట్ కి వెయ్యడానికి తెచ్చిన పెయింట్ లు వున్నాయి . అలాగే ఒక వాటర్ పైప్ 4ఇంచెస్ ది వుంది. నేను కొన్నదేమిటంటే ,ప్లాస్టర్ అఫ్ పారిస్ ,ఎం సి ఎల్ ఒకటి తెచ్చాను .పైప్ నీట్ గా కడిగి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీళ్లతో కలిపి పైప్ కి పట్టించేసాను.కాస్త మందం గా అయింది . పడిపోకుండా బ్యాలెన్స్ కోసం క్రిందవైపు మళ్ళీ పైన ఏమైనా పెడితే పడకుండా పై వైపు ఒక రౌండ్ గా పొడవుగా చేసి అతికించాను . మిగిలిన పి ఒ పి తో చిన్న బుడిపెల్లా చేసి అతికించాను అందం కోసం . ఒక దువ్వెనతో లైన్ల మాదిరిగా గీతలు పెట్టాలనుకుని మళ్ళీ రెగ్యులర్ గా ఉంటుందనిపించి మానేశా.
రంగు వేసాక ఇలా తయారయ్యింది , గడపల కోసం తెచ్చిన ఎల్లో ఆరంజ్ కలర్ వున్నాయి . వాటితో మరిన్ని హంగులు అద్దేసాను . ముందుగా ఏమి అనుకోలేదు కానీ చేస్తూ ఉంటే ఇలా ఐతే బావుంటుంది అన్పించింది చేస్తూ వెళ్ళాను . మొత్తానికి బాగానే ఉందనిపించింది . కొని తెచ్చిన చిన్న కుండలని కూడా తోచిన విధంగా రంగులద్దేసాను .
అంతా అయ్యేసరికి పండుగకి అలంకరించేసరికి ఈవిధంగా వున్నాయి . ఆ పువ్వులవీ ఎం సి ఎల్ తో చేసి అతికించాను . కొని తెస్తే ఏమో కానీ నేను చేశాను అనుకుంటే మాత్రం చాల బావుంటుంది మనసుకి . మరీ చిన్న పిల్లలుంటే ఇలాంటి పని చేయలేము . (వాళ్ళు పూసుకునేదే ఎక్కువ ఉంటుంది : )) ఒక రెండు గంటలు కూర్చోగలము ఫర్వాలేదు అనుకుంటే మొదలు పెట్టచ్చు . కుదరలేదు అనుకోండి ,ఇంత కన్నా అందమైనవి బయట చాలాచోట్ల దొరుకుతున్నాయి శుభ్రంగా కొని తెచ్చేసు కోవడమే ... సింపుల్ గా ...
***************************************
No comments:
Post a Comment