''మనసేమూలం ''
నిజమే కదా ! మనం ఏమి ఆలోచిస్తున్నామో , అదేచేస్తాం మన మనసేమి చెప్పిందో అదే సరైనదనుకుని నమ్మిపాటిస్తాము . మనసుకు మాత్రమే జవాబు దారీగా ఉంటాం. అలాంటప్పుడు మన ఆలోచనలెంత సరైన దారిలో ఉండాలి ? మన మనసెంత స్వచ్ఛం గా ఉండాలి ? అలావుంటే ఆ ప్రశాంతత మన ముఖం లో కన్పిస్తూ ,మన బుద్ధి తేటగా ఉందని, ఆలోచన సవ్యంగా ఉందనే విషయం ఎదుట వారికి కూడా అర్ధమౌతుంది . చక్కగా సర్దిఉంచిన గదికి ,చిందరవందర గా వున్నా గదికి తేడాలేదూ ! అలాంటి గదిలో ఎంతసేపు కూర్చోగలం ?.
ఒక మేకపిల్లని నీళ్ళల్లో పడేస్తే వెంటనే ఈదుకుంటూ వచ్చేస్తుందట ,అదే ఒక మనిషిని నీళ్ళల్లో పడేస్తే రెండో ఆలోచన లేకుండా మునిగి పోతాడట ,కారణం వాడికి ' నాకు ఈత రాదు ' అని బలంగా నమ్మడం వలన , అదే మేకపిల్లకి నాకు ఈత రాదు అని దానికి తెలియదు కదా ! అందుకే అది దర్జాగా ఈదుకుంటూ వచ్చేస్తుంది . మనం ఇంత చదువుకుని ,విజ్ఞానం వుండి, ఇంగితం ఉండి మన ఆలోచనలేమో ఇలా ఉంటాయి . ఎవరన్నాఅదిగో వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు అనగానే అదినమ్మి మన ఆత్మీయులని కూడా ఆలోచించ కుండా వాళ్ళని దూరం చేసేసు కుంటాం ఎందుకంటారు ? ఆసమయం లో మన ఇంగితం ఏమైపోతుంది ? కొంత మందికి ఇదే ఆట ,అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటే చూడలేరు ,తల్లీ పిల్లలిని విడదీస్తే గాని ఉండలేరు . అంతా ఒకరికొకరు దూరమై పోతే ఒక మానసిక ఆనందం ... ఇంత చేసి వాళ్ళేమన్నా బావుంటారా అంటే ఇంతకి పదింతలు వేరే రూపంలో అనుభవిస్తూనే వుంటారు అనుభవించాలి కూడా ఎందుకంటే .. చెడు ఆలోచనల ఫలితం అనుభవించక తప్పదు . తాగుడు అలవాటున్న తండ్రిని అతని ప్రవర్తనని చూసి అసహ్యించుకునిజీవితం లో తాగని కొడుకులు కొందరైతే, తాగుబోతు తండ్రిని చూసి ఆయనే తాగంగా లేనిది నేను తాగలేనా అంటూ అలవాటు చేసుకునే కొడుకులున్నారు .(మనసే మూలం ).
కొంతమంది తండ్రులు తమ బంధువుల్లో చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్న' అంకుల్ 'ని కొడుక్కి చూపించి ,నేనుబాగా చదువుకుని అలా మంచి వుద్యోగం చేస్తూ ,కార్లలో తిరగాలనుకున్నా .. కాని మానాన్న ''అక్కయ్య పెళ్లి చెయ్యాలి కదా నువ్వు వుద్యోగం చెయ్యాలి నాకు కాస్తన్నా సహాయంగా ఉండాలి ''అని వుద్యోగం చెయ్యమన్నారు ,తప్పలేదు . నువ్వన్నా బాగా చదువుకుని పైకి వస్తే చూడాలనుంది ,అన్నాడు అనుకోండి వాడుకాస్త మంచి మనసు గలవాడైతే అయ్యో నాన్నకి ఇలా అయిందా అందుకే చదువుకోలేక పోయాడా నేను తప్పకుండ అయన కోరిక నెరవేరుస్తాను అని నిర్ణయించుకుని పట్టుదలతో సాధిస్తాడు . అదే మరో తండ్రి మరో కొడుక్కి ,అదే అంకుల్ ని చూపించి పై కధంతా చెప్పినప్పుడు ,కొడుకు బుద్ధి వంకరనుకోండి ,వాడు ఇలా అనుకుంటాడు ,ఒక సైకిల్ కొనడానికి దిక్కులేదు కానీ ,బాగా సంపాదించి ఇచ్చేస్తే ,తీసుకుంటాడు ,కార్ కొని తిప్పేస్తే తిరుగుతాడట సిగ్గులేదు .. నాకు వుద్యోగం రానీ నేనేమిటో చూపిస్తాను?? . ఇప్పుడు చెప్పండి మీకేమనిపిస్తోంది ,మనసే మూలం కదా .. అత్తగారు ఇంటినించి బాగా పెట్టిపోతలు లేవని భార్యని పట్టించుకోని వాళ్ళున్నారు , చివరివరకూ తోడుగా ఉండాల్సింది మేమిద్దరమే అనే ఆలోచన ఎందుకుండదు ? చిన్నతనం లో అడిగినవన్నీ కొనివ్వలేదని తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమం లో పెట్టేవాళ్లున్నారు .ఎందుకిలా జరిగిందో వాళ్ళకుకూడా అర్ధం కాదు ,లోపం ఎక్కడా అని బుర్రబద్దలు కొట్టుకుంటారు. చివరాఖరికి పిల్లల్ని కనగలం కానీ వాళ్ళబుద్ధుల్ని కనగలమా ? అని సరిపెట్టుకుంటారు. ఎంత నిజం మనమేమో పద్దతి లేని పిల్లలిని చూసి ఏమిపెంపకం అని తిట్టుకుంటాము .
కుటుంబానికో అంతస్థు ,ఆర్థిక పరిస్థితి ఉంటుంది . ఏ రెండు కుటుంబాలకు పోలిక ఉండదు .
వెండి శుభలేఖలు పంచి హెలికాఫ్టర్ లో బంధువులను రప్పించేవాళ్లున్నారు . ఇంటిముందు పందిరేసి పదిమంది బంధువులనుపిలిచి పెళ్ళిజరిపించే వాళ్ళున్నారు . అదీ పెళ్ళే ఇదీ
పెళ్ళే . ఇద్దరు పిల్లలున్న వాళ్ళు చెరోవిధం గా ఉండడం ,ఒకే చెట్టు కాయలు వేరే వేరే రుచితో ఉండడం మనకు తెలిసిందేకదా !ఇలాంటి పిల్లలు (కొడుకులు ) వున్నవాళ్లు అనుకోవలసిందే
'అ' ''పుత్రస్యగతిమ్ నాస్తి'' ......
'అ' ''పుత్రస్యగతిమ్ నాస్తి'' ......
********************************************************************************
No comments:
Post a Comment