భర్తకి పిల్లలకి , రుచికరమైన ,ఆరోగ్యకరమైన భోజనం వండి పెట్టాల్సిన బాద్యత ఇల్లలిదే అంతేకాదు తను కూడా
ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతోవుంది . కానీ దొరికేవన్నీ కల్తీ వని తెలిస్తే ... ''ఏమి తినాలి ..? ''.
ఆకుకూరలు తింటే చాల మంచిదంటారు ఆరోగ్యానికి ,కళ్ళకి ,చర్మానికి కాని ఏది మురికినీళ్ళు మడిలోనికి
మళ్ళించి పెంచే ఆ ఆకుకూరలా ?ఆరోగ్యానికా అనారోగ్యానికా ? పండ్లు తింటే పీచు తగిన తీపి అందుతుంది ,
తీపి పదార్ధాలకు దూరంగా ఉండచ్చుట ,వయసైనా సొగసు భద్రంగా ఉంటుందట ,ఏదీ మాత్రలతో మగ్గించి
పొగతో పండించేవి [అరటిపళ్ళు ], పౌడర్ తో పండించేవా ! పుచ్చాకయలో ఎరుపురంగు ఇంజెక్ట్ చేస్తారట ?
ఏపిల్ పళ్లకు నిగ నిగలడేందుకు ఏదో [హాని కరమైన ] నునె కూడా రాస్తారట మెరవడానికి . ద్రాక్షపళ్ళ
గురించి మనందరికీ తెలిసిందే మందు చల్లుతారని ,అందుకే గొంతుపట్టేస్తుంటుంది ,నీళ్ళు వేడి చేసి ఉప్పు
వేసిపండ్లని రెండుగంటలుంచి తింటుంటాము . కూరగాయలు పండించేవాళ్ళు ఏమేమి వాడుతారో ,ఏవిధంగా
శుభ్రం చెయ్యాలో మనందరికీ తెలిసిందే . కూరగాయలు కడగటానికి లిక్విడ్స్ వచ్చేసాయంటే చుడండి మరి .
చేపలు మురుగు కాల్వలో పెంచుతున్నారని న్యూస్ లోనే చెప్తున్నారు . కేట్ ఫిష్ ఐతే చాల ప్రమాదమట .
చేపలు ఎంపిక చెయ్యడమే కష్టం ,అందులో మళ్లీ ఇదొకటి , కళ్ళకి మంచిది ,తెలివితేటలు పెరుగుతాయి
పిల్లలకు పెట్టండి అంటారు ఇవా పెట్టేది ?. కోడిగుడ్డు నాటుకోడి ఐనా ఫారం కోడి ఐనా ఒకటే బలం అట
కాని నాటు కోడి గుడ్డు ఎక్కువ ధర ఇచ్చి తెస్తాము ,ఎంపిక కోసం పెంకు కొంచెం ఎక్కువ రంగు వుంటే
అదే గుడ్డు కొంటాము ,కాని మామూలు గుడ్డునే టీ డికాక్షన్ లో వేసి తీసి ఉంచుతారట ? కోడికైతే ఎన్ని
ఇంజెక్షన్ ఇస్తారో లేక్కేలేదట కోళ్ళ ఫారం లో .. మీరుకూడా చూసే వుంటారు . ఈమధ్య దొరికిన కల్తీ
పదార్ధాలు ,వార్తల్లో చూపిస్తున్నారు . అల్లం వెల్లుల్లి పేస్టు ,నెయ్యి, గరం మాసాల పేకిట్లు ,పసుపు ,
బెకేరి లలో వాడె సాస్ లు ఏది వదిలి పెట్టడం లేదు .
పాలుతాగుదామంటే పాలకోసం గేదేకి కూడా ఇంజెక్షన్ లే ఆ తీసిన పాలల్లో కూడా ,పౌడర్లు ,పామాయిల్
కలుపుతారట , నూనె ఐతే జంతుకళేబరాలతో ,కొవ్వులతో కాచిన నూనెలు అమ్ముతున్నారు . ఫాస్ట్ ఫుడ్
వాళైతే మొత్తంగా అదే నూనె వాడుతున్నారట . ఆ కొవ్వుల వల్లనే ఆ ఫుడ్ కి అంత రుచి .అందరం ఆర్గానిక్
ఫుడ్ అంత ధరపెట్టి కొని తినగలమా !పప్పులు బియ్యము కూడా త్వరలో సిలికాన్ వి వస్తాయట . ఇన్ని
అనారోగ్య కారకాలని భోంచేస్తూ ,ఇవి చాలవన్నట్లు మన అలవాట్లు ఒకటి ,కావలసినంత కడుపులోకి
పుచ్చుకుంటారు కాని పిల్లలకి తినడానికి ఇంటికి తీసుకు వెళ్ళేవాళ్ళు చాల తక్కువ . ఏషాపు దగ్గరా
లేనంత రద్దీ ''ఆ'' షాపు దగ్గర , ఇక అదికూడా విషమని ఎప్పుడో తెలియడం కాదు వెంటనే తెలిసిందిగా
మొన్న . ఇక నములుతారు చూడూ .. పక్కనించి వెళ్తేనే కళ్ళు మండి పోతాయి ఆ వాసనకి ,మరి అది
కడుపులో ఎలా పనిచేస్తుందో వాళ్లకి తెలీదా ? ఆ నమిలే వాళ్ళంతా ఒక్కసారిగా అనుకుని ఊసారంటే ..
నగరం కొట్టుకు పోతుంది . ఆఖరికి దేవాలయం క్యూ లో కూడా అవే మరకలు . శుభ్రత పాటించండి
అని బోర్డు పెట్టగలరు కాని ,మూతిమీద వాత పెట్టలేరుగా ! మనకుండాలి ఎక్కడ వున్నాం ,ఎం చేస్తున్నాం
అని . వూదేవి ఉండనే వున్నాయి .
వీటన్నిటిని మించి భయంకర మైనది ,బాధ కలిగించేది ఒక విషయం రాయక తప్పడం లేదు . మా ఇంటి
దగ్గరలో ఒక పెద్దబావి వుంది . అందులోనించి నీరు టాంకర్ ల ద్వారా హోటళ్ళకి ,అపార్ట్ మెంట్లకి వెళ్తుంది
కాని అందులో ఒకతను పడి మరణించాడు . అతనిని వాళ్ళ వాళ్లకి అప్పగించే ప్రక్రియ కొనసాగుతూనే
వుంది ... మరో ప్రక్క అదే బావినించి నీరు తీసుకుని టాంకర్ లు వెళ్తూనే వున్నాయి !!!!!??????????.
**************************************************
No comments:
Post a Comment