Total Pageviews

Thursday, December 10, 2015

పాత కధలే .......



అత్యాశ ,దురాశ ,ఈర్ష్య ,అసూయ పేరేదైనా  మనిషిని దహించడం లో  ఈ లక్షణాలు  వేటికవే సాటి . చదివినవే ఐనా
మరొక్కసారి !   ఒక రాజుగారు  పౌరులందరికీ భూమి ఇవ్వాలనుకుంటారు . ఇంతని కాకుండా ప్రొద్దు గుంకేలోగా
ఎవరెంత దూరం  వెళ్లి ,తానున్న చోటికి తిరిగి వస్తారో ,అంతమేరా భూమి వారికిస్తానంటారు . ఒక దురాశా పరుడు
మాత్రం ,పరుగు పెడుతూనే వుంటాడు . ఎంత అంటే తిరిగి రాలేనంత ,తిరిగివచ్చే ఓపికలేక  శోష వచ్చి అక్కడే
పడిపోతాడు . భూమి పోయే ...  ప్రాణం పోయే ....


మరొక కధలో రాజు గారు  బొగ్గుల వ్యాపారిని  చూసి జాలి పడతారు . మంత్రిగారి తో  తమ పండ్లతోటని ఆ వ్యాపారికి
రాసి ఇవ్వాల్సిందని  చెప్తారు . కాని మంత్రిగారు ఒకటే అంటారు ,' కష్టపడకుండా వచ్చిన దానిని  సద్వినియోగం
చెయ్యరు ప్రభూ కావాలంటే నిరూపిస్తాను ' అని  ఆ బొగ్గుల వ్యాపారిని పిలిచి 'ఈ తోటనంతా  నీకు దానంగా ఇస్తే
ఏమిచేస్తావు' అని అడిగితే  అపుడా వ్యాపారి  మంత్రి గారితో  తన వ్యాపారధోరణి లో [కాచే పూచే ]తోటని తగులబెట్టి
బొగ్గుల వ్యాపారం చేస్తానంటాడు . రాజుగారికి జ్ఞానోదయం అవుతుంది . మనకుంది కదా అని అపాత్రదానం చెయ్య
కూడదని తెలుసుకుంటారు .




ఉదయాన్నే ఒకరోజు భక్తీ ఛానల్ లో ఒక కధ చెప్తున్నారు ,ఒక బెల్లం వ్యాపారి నలుగురు సాధువులను పిలిచి
భోజనం పెడతాడు . భోజనానంతరం నలుగురికి  నాలుగు బెల్లం కుందులను ఇస్తాడు . ముగ్గురు సాధువులు
తృప్తిగా వెళ్ళిపోతారు .  ఒక సాధువు బెల్లం మాత్రం కుక్క ఎత్తుకేళ్తుంది  . దాంతో విచారంగా అక్కడే కూచుని
ఉంటాడు . బెల్లంవ్యాపారి విషయం తెల్సుకుని ,మరో బెల్లం కుందు ఇస్తాడు . ఐనా సాధువు అలాగే ఉంటాడు .
వ్యాపారి అడుగగా  మీరిచ్చిన కుందుతో పాటు మొదటిది కూడా వుంటే బాగుండేది అంటాడు . [అది పోవడం
వల్లనే కదా ఇదివచ్చింది ?] సరే అని వ్యాపారి  మరోటి ఇస్తాడు . ఐనా అతనలాగే ఉంటాడు . మరో యాభై
ఇచ్చినా అతను తృప్తి పడడెమో ! తృప్తి అనేది మనసుకు సంబందించినది . మనకన్నా తక్కువ వాళ్ళని
చూస్తే మనకేమి వున్నాయో తెలుస్తుంది ఆనందం కలుగుతుంది . అదిమానేసి లేనిదానికోసం ఏడుస్తూ,
కూచుంటే ఉన్న మనశ్శాన్తి  పోతుంది




 ఒకసారి గాంధీజీ  వద్దకు ఒకాయన  ఒకఅబ్బాయిని తీసుకుని వస్తాడు . 'మావాడు వేయించిన పల్లీలు
[వేరుసేనగలు ] బెల్లం కలిపి తింటున్నాడు ,అదికూడా చాల ఎక్కువగా ,మీరే అతనికి నచ్చచెప్పాలి అంటాడు .
గాంధీజీ  ఆ  అబ్బాయిని  వారం తర్వాత తీసుకు రమ్మని చెప్పారు . వారం తర్వాత అతను అబ్బాయి తో సహా
మళ్లీ వస్తాడు . అపుడుగాంధీజీ   ఆ  అబ్బాయి తో పల్లీలు బెల్లం కలిపితినవద్దని  అది ఆరోగ్యానికి  అంత మంచిది
కాదని చెప్తారు . అబ్బాయి వెంట వచ్చిన వ్యక్తి  మాత్రం  మొదటిసారి వచ్చినప్పుడే చెప్పివుండచ్చు కదా అని
అడుగుతాడు ,అప్పుడు గాంధీజీ  చెప్పారట ''నేనూ అదేపనిగా బెల్లం పల్లీలు కలిపితింటాను  నేనుతింటూ
అతనికి వద్దని ఎలాచెప్పగలను ?ఈ వారం రోజులుగా ఈ అలవాటు వదులుకోవడం వల్లే అతనికి చెప్పగలిగేను ''
అన్నారట . నిజమే ఏదో సలహా అంటే ''పడేస్తాంఉచితంగా ''అంతే  కాని  మనం పాటించే  చెప్పాలంటే కష్టం కదా !.


                                                     ******************************


No comments:

Post a Comment