తమిళనాడు లోని వెల్లూరు లోని '' శ్రీపురం " లో మహాలక్ష్మి అమ్మవారి గోల్డెన్ టెంపుల్ .
శ్రీపురం వెళ్ళాలని ఎప్పటి నించో అనుకోవడం ,తిరుపతి మాత్రం వెళ్లి హడావిడి గా తిరిగి రావడం ,జరుగుతోంది .
ఈసారి అలా కాకూడదు అనుకుని ముందుగానే పక్కా ప్రణాళికతో వెళ్ళాము . తిరుమల లో స్వామి దర్శనం చేసుకుని , శ్రీపురం వెళ్లాము . నక్షత్ర ఆకారం లో ఉన్న క్యూ లైన్ ద్వారా నడుస్తూ ,మంద్రమైన మంత్రోచ్చారణ వింటూ నెమ్మదిగాకదిలే లైనులో వెళ్తూ తెలుగు ,తమిళ్ ,మలయాళీ భాషల్లో మైక్ లో దేవాలయం వారుచేసే సూచనల ప్రకారం దర్శనం చేసుకున్నాము . అమ్మవారు పూర్తి గా బంగారం తో చేసిన దేవాలయం మధ్యలో
ఎత్తైన ప్రదేశం లో కొలువై వున్నారు . దర్శనం కాగానే , లైనులోనే కుంకుమ వాళ్ళే పెడతారు ,తరువాత ప్రసాదం .
ఇక విశాలమైన గుడి ప్రాంగణం లో చక్కగా పెంచిన పూలమొక్కలు , కొలను ఆహ్లాద భరితమైన వాతావరణం .
చాల బావుంది . ఎప్పటిలాగే కెమెరాలు , బేగ్ లు ,చెప్పులు ,అన్నిటికి లాకర్లే . అందువల్లనే ఫోటోలు తీసే వీలు
లేకపోయింది ,ఇవన్నీ గూగుల్ లోనివి.
********************************
No comments:
Post a Comment