ఉదయం లేవడమే , ఫోన్ అందుకుని వాట్సాప్ లో గుడ్మార్నింగ్ ఇమేజ్ లు పంపించి చాలా గొప్పపని చేసేసిన ఫీలింగుతో ,నా పనుల్లో పడ్డాను . పదకొండు అయ్యేసరికి అందరూ వెళ్లడం తో ఖాళీ దొరికింది ,మళ్ళీ వాట్సాప్ ఆన్ చేశాను . ఏవో జోక్స్ , కామెడీ వీడియోస్ చూసి ,అటు దీటు ఇటు దటు పంపించి ,నిన్న సగంలో వదిలేసిన పని అందుకున్నాను . ఫోన్ వచ్చింది . అది మాట్లాడి నీరసించి పోయాను .
''మాధవి ఆత్మ హత్య చేసుకుంది '' అదీ సారాంశం . చిన్ననాటి స్నేహితురాలు . పెళ్లి అయినాక ఎక్కడివాళ్ళం అక్కడికి వెళ్ళిపోయినా ,పుట్టిల్లు ఒక్కవూరే కనుక కలిసేవాళ్ళం .ఈమధ్య అదీ లేదు ,ఫోన్ లో నంబర్ ఉండడం వల్ల వాట్సాప్ లో వుంది . ఏవో ఇమేజ్ లు జోకులు పంపడం తప్ప ఎప్పుడు మాట్లాడింది లేదు . మరోస్నేహితురాలు రమ అదేఊర్లో ఉంటుంది . తనకి వుద్యోగం కనుక తీరిక ఉండదు . తను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది . మాధవి కి పిల్లలు లేక చాల బాధపడుతుందట . అత్తా తోటి కోడలు ఎక్కువ మాట్లాడరట . బయటి వాళ్ళతో కూడా మాట్లాడ నివ్వరట ,పుట్టింటికి వెళ్లందుకు అన్నగారు పిలవడట. తనకి చిన్నప్పుడే తల్లి పోయింది . ఆమధ్య వాళ్ళ నాన్నగారుకూడా .. అన్న రమ్మనే ఆశే లేదు . ఎన్నోసార్లు రమ కి ఫోన్ చేస్తే ,తను ఆఫీస్ పనిలో ఉండి ,తర్వాత మాట్లాడతాను అన్నదట కానీ కుదరలేదు . ''కనీసం నువ్వన్నా ఎప్పుడన్నా మాట్లాడి ఉంటే నా బాధ విని ఉంటే నేను బ్రతికే దాన్నేమో '' ఇది మాధవి నించి రమకి వచ్చిన ఆఖరి మెసేజ్. ఇంకా విషాద గాథ చాలా వుంది ,మీ మనసు పాడు చేయడం ఇష్టం లేక ప్రస్తావించడం లేదు. నాకు ఎవరన్నా నవ్వుతూ ఉంటేనే బావుంటుంది . అది అవసరం కూడా !
నేను వాళ్లకి అంత క్లోజ్ కాక పోవచ్చు ,కానీ మాట్లాడి ఉండుంటే ఎంతో కొంత ధైర్యం చెప్పివుంటే ఈరోజు ఇలా జరిగుండేది కాదు . ఎవరికన్నా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోతేనే ఎంతో బాధ పడతాము . అలాంటిది ఏనాటికి ఎవరూ మాట్లాడకపోతే ఏమి చేస్తుంది పాపం ??
నాకెందుకో అసలు మనమేం చేస్తున్నాం ? అన్పిస్తోంది ,ఒక్కసారన్నా వాట్స్ అప్ మెసెజ్ పక్కన పెట్టి ఎలావున్నారు అని ఎవరినైనా పలకరిస్తున్నామా అన్పిస్తోంది. సరే అని, అన్ని నంబర్స్ తీసి అందరికీ ఫోన్ చేశాను చిత్రం ఏంటంటే ,ఒకరి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి సీట్ వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళింది . వేరే వాళ్ళ ఇంట్లో పాప పుట్టింది, మరోఇంట్లో వాళ్ళ నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది . ఇంకొకరు వూరే మారిపోయారు . వీళ్లంతా వాట్సాప్ లో ఉన్నవాళ్లే .. రోజూ మెసేజ్ లు ,ఇమేజ్ లు పంపించుకుంటున్న వాళ్ళమే ,నేను మెసెజ్ చేసేటైముకి వాళ్ళు ఆఫ్ లైన్ వెళ్లడంబిజీ గా ఉన్నారేమో అని నేను ఊరుకోవడం ,ఒకవేళ చాట్ చేసినా తిన్నారా ఏమి స్పెషల్అంతవరకే .. కనీసం ఎప్పుడన్నా నోరువిప్పి కాల్ చేసి మాట్లాడింది లేదు. రోజూ టచ్ లోనే వున్నాంగా అనే నిర్లక్ష్యం , అవసరమైన విషయాలు మాట్లాడిందే లేదు .కొంతమంది ఉదయం సాయంత్రం ఉంటారు . కొందరు వారం అయినా అడ్రస్ ఉండరు .చాట్ చేసే
సమయంలో కాస్త ఓపిక తో ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి , టైప్ చేసే ఓపిక లేక పొతే
అదేసమయం లో ఫోన్ చేసి మాట్లాడే సెయ్యాలి , చాట్ చేసి' బై ' చెప్పి వెళ్ళాలి అని నాకనిపిస్తుంది ,మాట్లాడుతూ మధ్యలో ఆఫ్ లైన్ వెళ్ళిపోతే మనకేమి అర్ధమౌతుంది ?
ఉండాలా ,వెళ్లాలా ఏమిటో మరి !
కొందరు ఎప్పుడూ ఆన్లైన్ వుంటారు ,ఎవరి అవసరం వాళ్ళది ,కానీ ఎదుటి వాళ్ళు కూడామనుషులే ,''స్టేటస్ తో సంబంధం లేనిదే స్నేహం ,''అవసరానికి ఆదుకునేదే మానవత్వం .ఈమధ్య ఒక వీడియో వచ్చింది వాట్సాప్ లోనే లెండి :) ఒక పులి జింక ను
నోట కరచు కుంటే ,కోతులన్నీ కలిసి పులిని తరిమి కొట్టాయి ,ప్రాణాలతో బయట పడిన
జింక బ్రతుకు జీవుడా అంటూ పరుగందుకుంది . మనుషులమై ఉండి పక్కన ఏమి జరుగుతుందో పట్టించుకోము ,సరే ఫర్లేదు పట్టించు కొక పోతే పోయే ,మనుషులమై ఉండి
సాటి మనుషుల్ని చంపుకునే స్థితికిదిగజారాము . ఆడవాళ్ళ భద్రత గురించి ఐతే నోరు విప్పలేము ,చెప్పలేము అంత అడవిమృగాల్లా సారీ .. మృగాలని అవమానించకూడదు ,వాటికున్న విలువని ఇందాకే గా మెచ్చుకున్నాము . ''మాట్లాడటం ,నవ్వడం ,ఆలోచించడం మనుషులకి మాత్రమే దేవుడిచ్చినవరం ''అది గ్రహించ కుండా ఎదుటి వాళ్ళని
నొప్పించడానికే నోరు , గేలి చేసేందుకే నవ్వు ,సున్నితమైన మనసున్నవాళ్లను బాధ పెట్టేందుకే ఆలోచన వాడతారు . కొంచెమన్నా ఆలోచించి పద్దతి మార్చుకుంటే ఎంత బావుంటుంది , చిన్న మార్పుతో పెద్ద ప్రయోజనంపొందవచ్చు ,మనమంతా కలిసి మెలిసి బ్రతకొచ్చు ,ఏమో పాతరోజుల్లో లాగా పక్కింటి వాళ్ళు కూడా సొంత వాళ్ళలా ప్రేమించే రోజులు వస్తాయేమో .(ఆశ పడటం లో తప్పు లేదుగా :)).
సంధర్భం వచ్చింది కనుక చెప్పాలని పిస్తోంది . నేను ఈమధ్య గమనించిన విషయం ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి పగబడుతున్నారు ,అయినదానికీ కానీ దానికి'' నా ''
అన్న వాళ్ళు అని కూడా చూడకుండా పాగ సాధిస్తున్నారు అది కూడా చిన్న విషయాలకి.
ప్రయోజనం ఉన్నవైపు మరలి పోతూ రక్త సంబంధం కూడా వదిలించు కుంటున్నారు .
ఏ తప్పు చేయక పోయినా ఎవరి సహాయం ఆర్ధించ కుండా పైకి రావడం ,ఒక హోదాలో
హుందాగా జీవించడం కూడా నేరమేనట , ఎందుకు దూరం పెడుతున్నావు అని నేనడిగిన
ప్రశ్నకి నాకు దొరికిన సమాధానమది !!!!!!!!!!!!! ?????????????
కమ్యూనికేషన్ పెరిగిందా ,తరిగిందా అన్నది మన మనసులకే తెలియాలి ...
ఒక్కసారి నోరు విప్పితే కదా , అపార్ధాలు తొలిగి మనసులు దగ్గరవుతాయి ......
ఎవరన్నా ఏదన్నా చెపితే నేను, వాళ్ళు నా గురించి ఇలా అంటారా అని
ఆలోచిస్తాను . కానీ నాకు తెలిసిన వాళ్ళు ,చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న
వాళ్ళు కూడా ఎవరేది చెప్తే అది నమ్మేయడమే చూసాను వేరే ఆలోచన
కూడా చేయరు ,కనీసం మాట్లాడి తెలుసుకోరు . ఏమో వాళ్ళల్లో ఏమి లోపముందో
అప్పుడే గా ఇలా దాపరికం గా వుంటారు . లేదా ఇగో ఈగలా రొద పెడుతుందేమో
నాకు ఈగో వుంది కానీ నా ఈగో నాకంట్రోల్ లో ఉంటుంది ,నేను దాని కంట్రోల్
ఉండను ,ఎక్కడ అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతాను .
మన మనసుకు మంచి చెడు చాల చక్కగా తెలుసు అదిచెప్పేది వింటే చాలు.
మనసుకు సమాధానం చెప్పుకోవాలి ,మనసు ముందు తప్పుచేసి తలవంచుకోను
అని నియమం పెట్టుకుంటే చాలు ,మనప్రవర్తన ఎంతో బావుంటుంది .
******************************************************************************
**
Good, very good
ReplyDelete