Total Pageviews

Sunday, May 14, 2017

సినిమా



మొదటి మూడు రోజుల్లో గా ,సినిమా చూడక పోతే అవమానంగా  భావించే వాళ్ళని చూసినవ్వుకునే దాన్ని ,కానీ బాహుబలి 2 సినిమాకి  నేనుకూడా మా పిల్లలతోపాటు టికెట్స్ కోసం తొందర చేసేను ,మొత్తానికి నాలుగోరోజు దొరికాయి . అనుకున్నట్లే అన్ని సమపాళ్లలో  కుదిరి రెప్పలార్పకుండా చూసేలా తీశారు . రాజప్రాసాదాలు ,కోటలు, ప్రాంగణాలు ప్రాకారాలు  కళ్ళముందు ఆవిష్కరించారు . చిన్నతనంలో  అమ్మమ్మ పక్కలో పడుకొని
సారంగధర ,బాలనాగమ్మ కధలు విన్నప్పుడు  దేవాతావస్త్రం ,ఒంటిస్తంభం మేడ ఊహించుకోడానికి బుర్రచించుకునేదాన్ని , కళ్ళముందు ఇంత గొప్పగా కధనడుస్తుంటే ఊహలు నిజాలవుతుంటే రెప్పలార్పడం మర్చిపోడంలో  ఆశ్చర్యమేముంది ?
                                     
తనమనసులో ఏముందో బొమ్మలు వేసి చూపి , సెట్లువేసి ,గ్రాఫిక్స్ చేయించి ,జనాన్ని ఆనంద సినిమా సాగరంలో ముంచెత్తడం ఒక ఎత్తయితే ,అంతఖర్చు పెట్టడానికి వెనుకాడని నిర్మాతలు దొరకడం మరొక  ఎత్తయితే ,రాజకుమారుడి ఆహార్యం తో ఏలోపములేని రూపముకలిగి ఉండి, అన్ని సంత్సరాలు కేటాయించి ధైర్యం తో నమ్మకంతో ఈసినిమాకు పనిచేయడం, రాజకుమారుడంటే ఇలాగేవుంటాడా అనిపించేలా  వున్నాడు ప్రభాస్ . సినిమాకి అవార్డులు  మాటాఏమోకాని ,చుసిన ప్రతి ప్రేక్షకుడూ సాహోరెబాహుబలి అనుకోకుండా బయటికిరావడం లేదు ,అంతకన్నా అవార్డు అక్కరలేదనుకుంటా !. అందరికి అన్ని సినిమాలు నచ్చాలని లేదు ,నూటికి తొంబై మందికి నచ్చి పదిమందికి నచ్చక పోవచ్చు ,కానీ ఆ పదిమందిలో ఉన్నవాళ్ళు , జురాసిక్ పార్క్ ,టైటానిక్ ,అవతార్ సినిమాలని మెచ్చుకున్నవాళ్ళు ఐతే మాత్రం ఆలోచించాలి. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత గుర్తు  చేసుకోవాలి .
                                                 
మన సినిమాలు సందేశాలు ,సామాజికస్పృహలు ఇచ్చే రేంజ్ ఎప్పుడో దాటేశాయి,మానాన్నగారి  చిన్నప్పుడు నాగేశ్వరరావు ,రామారావు గారు లాంటి హీరోలతో  సిగెరెట్ కల్పించాలంటే  దర్శకులు ఆలోచించేవారంట ,హీరో నే తప్పుగా చూపిస్తే  యూత్ చెడిపోతారని వాళ్ళ ఆలోచనట . తర్వాతికాలంలో  అదేహీరోలు సిగెరెట్లూ కాల్చేవాళ్ళు డాన్సులు వేసేవారు . ఇక మా వరకు  వచ్చేసరికి బ్రేక్, షేక్ డాన్సులు వచ్చేసాయి ,ఆ హీరో ఐతే డాన్స్ చేస్తూనే జేబురులోనించి రుమాలు తీసి మొహం తుడుచుకుంటే అబ్బో .. ఎంచేసేడు ? (ఏంచేసేడు ?) అనుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడు డాన్సులు పోయి  జిమ్నాస్టిక్స్ వచ్చేసాయి  తల క్రిందికి కాళ్ళుపైకి  పెట్టి, మోకాళ్ళమీద దేకుతూవాళ్ళ  అవస్థలు చూస్తుంటే నాకైతే కాళ్ళు లాగేస్తుంటాయి .అరవైఐదుసంత్సరాలహీరో,ముప్పైఐదుఏళ్ల అతని కొడుకు కలిసి ,ఒక యువతీ లాంటి ప్రౌఢ తో ( ముప్పయ్యారు ఇంచీలు నడుముకి అరమీటరు గుడ్డ ,పైన రిబ్బను
ముక్కకట్టుకుని ) డాన్సులేస్తుంటే  చూసి అలవాటు పడ్డవాళ్ళం ,మనకు ఎలాంటి సినిమాలైనా  నచ్చుతాయి .

పోలీస్ ఆఫీసర్ ఐన  హీరో లంచాలు తీసుకుంటాడు చివరాఖర్న మారిపోయినట్లు చుపిస్తారులెండి ,చెల్లెలి కాపురం కోసం  వాళ్ళ కుటుంబాన్ని ,వాళ్ళఇంట్లో పనివాళ్లని నరికేస్తాడు హీరో, కానీ ఒక్క పోలీసు కూడారాడు ఎంచక్కా అందరూ  వేరే వూరువెళ్లిపోయి హాయిగా  వుంటారు. ఇవన్నీ సినిమాలనుకుని చుసినవాళ్ళం  బాహుబలి చూసేక  మళ్లీ మాములుగా ఎప్పటి లాగే సినిమాకి వెళ్లాలంటే కొంత ధైర్యం కావాలి .

**************************************************************************

4 comments:

  1. మీ బాహుబలి మరో కోణం బావుంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ , అన్యగామిగారూ .

    ReplyDelete
  3. ‘జురాసిక్ పార్క్ ,టైటానిక్ ,అవతార్ సినిమాలని మెచ్చుకున్నవాళ్ళు ‘ - బాగా చెప్పారు . కథ సంగతి పక్కన ‘పెడితే అంతే. కొన్ని చోట్ల తప్ప ఈ రోజుల్లో పిల్లలు చూడదగినట్లే ఉంది అన్పించింది

    ReplyDelete
  4. అవునండి , మనతెలుగు వాళ్ళని మనమే మెచ్చుకోకపోతే ఎలా
    ధన్యవాదాలు చంద్రికగారు .

    ReplyDelete