1. ఉన్నట్టుండి మనకి మెయిల్ వస్తుంది ,మూడు వందల కి ఫోన్ అని . ఓపెన్ చేసి చూస్తాం . మనసులో ఏమూలో ఉంటుంది సందేహం ,ఫోనా ,ఫోన్ కవరా అని ? ఫోన్ మూడు వందలు కానీ డెలివరీ ఛార్జ్ తొమ్మిది
వేలు ఉంటుంది . లేదా ఫేక్ [తప్పుడు ] వెబ్ సైట్ అయి ఉంటుంది .లేదా ఆ మెయిల్ ఓపన్ చెయ్యడం
వల్ల వైరెస్ అన్నా వచ్చి వుంటుంది .
2. బుధవారం నాడు సస్తా బజార్ అని పెడతారు . మనం పరుగు లు పెడతాం . కిలో చక్కరకి మూడు రూపాయిలు
తగ్గింపు ,చటాక్ పంచదార మాయం .దగ్గర దగ్గర 50 గ్రాములు తక్కువుంటుంది తూకానికి . దీనికోసంపోయి
బండి దొర్లించుకుంటూ అక్కర లేని వన్నికొనుక్కొ స్తాము . కావాలంటే మీరే చెక్ చేసి చూడండి . మన లిస్టు మించి పది వస్తువులన్నా ఎక్కువుంటాయి .
3. ఇంతోటి మొహానికి వీసీ యాబలం పసుపు అని సామెత , వాళ్ళ షాపు పేరు ముద్రించి వున్న కవర్ మనం
డబ్బులు ఇచ్చి కొనడం? . బాస్మతి అయితే ముక్క వాసన ....!! మన పెట్టుబడి అంతా వృధా ....
4. మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది . వందకి రీఛార్జి చేయండి ,నూటపది రూపాయిలు పొందండి . ముందు వంద వస్తుంది తరువాత పది రూపాయిలు మెల్లగా వస్తుంది అని . నా బొంద వస్తుంది . ఆ పది కోసం పది సార్లు కాల్ చేసి ఇరవై రూపాయిలు వదల కోట్టుకునేవారు ఉన్నారు .
5. ఎవరో ఫోన్ చేసి నాకు క్లబ్ లో మెంబెర్షిప్ కార్డు ఫ్రీ అని , మరెవరో చేసి స్థలం అతి తక్కువలో ఎలాట్ అయిందని మిగతా డబ్బులు తెచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు . నాకు వొళ్ళు మండి , నా బ్రదర్ ఫలాన ఛానల్ లో పని చేస్తున్నాడని , తనతో మాట్లాడి ఇద్దరం కలిసి వస్తామని చెప్పాను . అంతే చుప్ .మళ్లీ ఫోన్ రాలా ...
6. ఒక పూజారి మీకు ఇ ప్పుడు కష్టకాలం నడుస్తుంది , మీరు ఒక పని చేయండి , గుడిలో ఒక యజ్ఞం చేస్తాను పలానా కర్రల తో పందిరి వేస్తారు . నాలుగు పక్కల నలుగురు కూర్చొని దిక్కులకి పూజ చేస్తాము . మన శని వదిలివెళ్లి పోతుందిఅంటాడు . సరే ఎంతయ్యా ఖర్చు అంటే పాతిక వేలు మాత్రమే అంటాడు . అసలే గడ్డుకాలం అంటే అంత డబ్బు ఎలా తెస్తారు? . దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు .
7. పలానా టకటకా బ్యాంకు నించి మాట్లాడుతున్నాం అంటూ మధ్యాన్నం పూట ఫోన్ చేసి మీ డబ్బు మా బ్యాంకు లో నే దాచాలి వడ్డీ ఎక్కువ అంటూ విసిగిస్తారు . కొన్ని సార్లు చూసి మీ బ్యాంకు లో నే ఉంది మా ఎకౌంటు అని చెప్పి వదిలించుకున్నా...............[ఏదో మతలబు లేనిదే ఫోన్ చేసి మరీ అడుక్కుంటారంటారా ]
8. కూరగాయల ధరలు పేపరు లో ఒక ధరలు వేస్తారు , రైతు బజార్ లో ఒక ధర ఉంటుంది .ఎవరిని అడగాలి ?
9. అమ్మ సెంటిమెంట్ తో మనల్ని సబ్సిడీ సిలిండర్ వదులు కోమంటారు , సెలబ్రిటీస్ కి కూడా సబ్సిడీ సిలిండర్ సప్లై చేస్తారు . పాపం వాళ్ళు మనకన్నా బీదవాళ్ళు కదా మరి ...........
10. సిగిరెట్ నిషేధించారని ఆరు బయట కాలిస్తే జరిమానా అన్నారు ,ఎవరు వేస్తున్నారు ? ఎవరికీ వేస్తున్నారు .
జరిమానా ? యధా ప్రకారం స్వేచ్చగా ఊదుతూ వెళ్తున్నారు .
11. ఒక షాంపూ ప్రకటన లో ఎనిమిది వారాలు నాకివ్వు ,ఎనిమిది సెంటిమీటర్లు జుట్టు నీకిస్తా అంటారు .
నాకు తెలిసి బ్రతికున్న వాళ్ళ కెవరికన్నా ,ఏమి వాడినా వాడకున్నా ,ఎనిమిది సెంటిమీటర్లు జుత్తు
పెరుగుతుంది . వాళ్ళిచ్చేదేమిటో ...........
12. మరొక తలనూనె ప్రకటనలో నూనె రాసుకున్నాక చేతులు శుభ్ర పరచుకోండి లేకపోతే చేతులకు
జుట్టు వచ్చే ప్రమాద ముంది అనివేస్తారు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు .
13. మరొక షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు వత్తు గా పెరుగుతుందట ,మహావుంటే షాంపూ మన తల మీద
రెండు నిముషాలు వుంటుంది . అంతదానికే ఎలా పెరుగుతుందబ్బా ??????????????
14. ఇక అందరికీ తెలిసిన దే పిల్లలున్నా కాలేజ్ఏజ్ లా కనపడే సబ్బు , రాస్తే పెళ్లి కుదిరి పోయే క్రీము,
ఆ ట్యూబ్ లో వచ్చే క్రీమ్ రాసుకుంటే తెల్లగా మారిపోవడం ,నాఫ్రెండ్ చెప్తుంది ఒక లారి ట్యూబ్స్ వాడి వుంటాను ఏ మార్పు లేదు అని ??!!!!!
ఇవన్నీ మచ్చుకి కొన్ని మాత్రమే , ఇంకా మన దృష్టికి రాని వెన్నో , వచ్చినా ''' రాయలేనివెన్నో ...''.
**********************************
No comments:
Post a Comment