పేరంటం లో పాటించవలసినవి కొన్ని పద్దతులు ఉంటాయని నేను అనుకుంటున్నాను . పూజలు ,వ్రతాలూ
లాంటివి నాకుచాలా ఇష్టం . చక్కగా ఆచరిస్తుంటాను . ఆ అనుభవం తో కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చుఅనుకుంటున్నాను . ముఖ్యం గా ఇలాంటివి వ్రతాలు చేస్తున్నపుడు ముందురోజే అందరిని పిలుచు కోవడం మంచిది . అంతేకాదు ఇంటి పనులు కూడా ముందురోజు ముగించి , విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం .
పూజ ముగిసిన తర్వాత ,మధ్యానమే వచ్చిన వారికి ఇవ్వ వలసిన తాంబూలం [పసుపు బొట్టు ]సిద్దం
చేసుకోవాలి అంతే కాని వచ్చిన వాళ్ళని కూర్చో బెట్టి ,ఆ గదిలో తమల పాకులు ఈ గదిలో వక్కపొడి ,
పసుపు కుంకుమ పేకేట్స్ ,అంటూ తిరుగుతూ వచ్చిన వాళ్ళ సమయం వృధా చేయడం సరికాదు ,ముందే
అన్నీ సిద్దం చేసి పెట్టుకోవాలి . అన్నీ సిద్దం గా వుంటే చక చకా అందించేయొచ్చు . పేరంటం అనేది కేవలం
వాయనాలు ఇచ్చి పుచ్చు కోవడాని కే తప్ప , వేరేఅనవసర విషయాలు చెప్పుకునే సందర్భం కాదని గుర్తించాలి .
వాళ్ళూ కొంతమంది ని పిలుచుకొని వుంటారు . త్వరగా వెళ్ళవలసి వుంటుంది . లేదా మనం కొందరిని పిలిచిన
విషయం మర్చి పోయి , వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే కబుర్లాడుతూ కూచోడం సరికాదు . ఇంటికి వచ్చిన వాళ్ళు , ఎంతసేపు ఎదురు చూస్తుంటారు ? ''నేను వేరే వాళ్ళ ఇంట్లో వున్నానండి టైం పడుతుంది మా అమ్మాయి ఇస్తుంది ,
లేదా పనమ్మాయి ఇస్తుంది , అని సెల్ పోన్ లో చెప్పడం మర్యాద కాదు . అంతగా తరగని కబుర్లు వుంటే తీరికగా
మరోసారి వెళ్ళాలి . కొంత మంది సమయం చెప్పరు , ఉదయమా , సాయంత్రమా , అన్నది వివరంగా చెప్పాలి .
పిలవాడనికని ఒకరింటికి వెళ్తే ,వాచిన కళ్ళతో లేచివచ్చింది . ఏమైంది అంటే వ్రతం చేసుకోవడానికి భర్త
బంగారం కొనివ్వలేదట . చేసేదే వాళ్లక్షేమం కోసం . కొనివ్వకుండా ఉంటారా ! భార్య నగలేసుకుని పక్కన
నించుంటే వాళ్ళకే గా గౌరవం ? అలాంటప్పుడు ఏమాత్రం వీలు కుదిరినా కొనిస్తారు . దానికోసం ఏడ్వాల్సిన
పనిలేదు . సంతోషం గా భర్త ఆరోగ్యం , సౌభాగ్యం కోసం చేసే పూజ ఇది . ఎవరిని పీడించకుండా ,ఉన్న దాంట్లో తృప్తిగాచేసుకుంటే చాలు . చెయ్యకపోయినా ఫర్వాలేదు కాని ,శ్రావణ శుక్రవారం మంచానికి అడ్డం పడి
ఏడవకుండావుంటే చాలు , మగవాళ్లకి అదే పదివేలు .
కావలసిన వాటికంటే ఐదు ఆరు వాయనాలు ఎక్కువే తాయారు చేసుకోవాలి . పిలవకున్నా పక్కవారి తో
వచ్చే వాళ్ళుంటారు . కాదనకుండా సంతోషం గా ఇచ్చే అలవాటు చేసుకోవాలి . ఇవన్నీ ఎవరికీ తెలియనివి
కాదు కాని , మరోసారి మాట్లాడుకోవడం లో తప్పు లేదుగా ! పైగా కొత్తగా చేసే వారికి ఉపయోగం .పూర్వం
నోము నోచుకుని వాయనాలు ఒక బుట్టలో సర్దుకుని సాయంత్ర ఇంటికి వెళ్లి మరీ ఇచ్చి వచ్చే వారట, అదీ
వారి శాఖ లోనే అయ్యి వుండాలి ,నోము తీర్చుకున్న వాళ్ళు అయి వుండాలి . అంటే పెళ్ళైన కొత్తలోనే
నోము పట్టి ఐదు సంత్సరాలు ఏ ఆటంకము లేకుండా తీర్చుకున్న వాళ్లకు ఇవ్వాలట అలాంటి వారికోసం
వెదికి మరీ ఇచ్చి వచ్చే వారు . ఇప్పుడు ప్రేమ వివాహాల పుణ్యమా అని లోకమంతా వసుధైక కుటుంబం
అయింది . ఇక నోములకి , వాయనాలకి ఓపిక తీరిక ఎవరికీ లేదు . గట్టిగా అడిగితె ఆరోజుల్లో స్త్రీలకి
ఇదే కాలక్షేపం కనుక '' కమ్యునికేషన్ ''కోసం చేసేవారు అంటున్నారు . ఇప్పటి వారికి ఆ అవసరం లేదట ?!
*****************************
No comments:
Post a Comment