పిల్లలిని కొడతారా ! అని ఆశ్చర్య పోయాను ఆమెని చూసి , వెనకింటి ఆమె వాళ్ళ అమ్మాయిని చెంపలు
వాయిస్తోంది ,అదికూడా వాకిట్లో ,అందులోనూ అమ్మాయి చిన్నది కాదు ,ఇంటరు చదివే అమ్మాయి .
తల్లికూతురు ఒకేలా వుంటారు బొద్దుగా ,అక్కాచెల్లెళ్ళ లా వుంటారు మోకాళ్ళ వరకూ వుండే జీన్స్ లూస్
గా వుండే '' పేద్ద టాప్ '' వేరే డ్రెస్ లో చూడలేదు నేను వాళ్ళని . ఎదిగిన పిల్లని కొట్టడమే జీర్ణించు కోలేదు .
నెట్టేసి గేటు వేసేసి లోపలి వెళ్ళిపోయింది . మేడమీద నించున్న నాకు ఒకటే కంగారు ,ఎటన్నా వేల్లిపోతుందేమో
అని కోపం లో ఏమన్నా చేసుకుంటే ఏమిటి దారి ? అసలే ఇవాళ రేపు పిల్లలు చాలా సున్నితం గా
వుంటున్నారు . అమ్మకోడితే ,పెద్దవాళ్ళు చేరతీసేవాళ్ళు ,ఇప్పుడె వరున్నారు స్నేహితులతో ఇలాంటివి చెప్పడం
వాళ్ళ కి అవమానం . వాళ్ళు అవమానం గా భావించేలా మనం ఉండ చ్చా ?! విదేశాల్లో ఐతే ముందు గ
ఒక ఫోన్ నెంబర్ పిల్లలికి నేర్పిస్తారు . అమ్మ నాన్న కొడితే కాల్ చెయ్యమని .కొన్ని ఇళ్ళలో అమ్మానాన్న లే
కాదు ఐన వాళ్ళు కూడా కొట్టేస్తుంటారు పిల్లల్ని . టీచర్లు బంధువులు ఎవరన్నసరే పిల్లల మీద చెయ్యి
ఎత్తడానికి భయపడేలా చట్టం వస్తే బావుండును .
వాళ్ళకి ఏదీ చెప్పి నేర్పించలేము ,మనం ఎలావుంటే ,వాళ్ళు అలా వుంటారు . ఇంకా చెప్పాలంటే మనల్ని
అనుకరిస్తారు ఎంత అంటే చాలా ... వాళ్ళముందు ఒకలా వెనుక ఒకలా మనం నటించడం మొదలు పెడితే
మనం 'అపరిచితు'[ డు ]లమైపోతాము . మీరెప్పుడూ కొట్టలేదా అంటే కొట్టాను చిన్న క్లాస్ చదివే టపుడు
చిన్న చిన్న దెబ్బలు పడేవి , తొడపాసం పెట్టేదాన్ని [దీనినే కొన్నిచోట్ల సొంటి పిక్కలందురు] అదికూడా మా వజ్రానికి మాత్రమే ,పాప కిప్పటివరకు అవసరం రాలేదు ,రాలేదు అనేకంటే తనే రానివ్వలేదు అంటే సరిపోతుంది .
వాళ్ళు స్కూల్ నించి రాగానే తినడానికి పెట్టి వాళ్ళు చెప్పే దంతా వింటాను అస్సలు విసుక్కోను ,విసుక్కుంటే
మళ్లీ జీవితం లో మనతో ఏమి చెప్పరు . ఇలా ఎందుకు చేసావు ,అలా చేసుండాల్సింది ,అంటూ మధ్యలో
సలహాలిస్తూ వుంటాను . అంత వరకే , తర్వాత ఒక బుక్ తీసుకుని కుచుంటాను చదువు కుంటూ .. వాళ్లకి
అర్ధమై పోతుంది .చదువుకునే టైం అని ,నేను చెప్పకుండానే బుక్స్ తెచ్చుకుని వర్క్స్ చేసేసు కుంటారు .
పిల్లలిని ఎప్పుడూ ఐన వాళ్ళ దగ్గర వుంచి చదివించ కూడదు . మన దగ్గరే వుంచుకోవాలి ఎంత ఇద్దరూ వుద్యోగస్తులైన సరే . వీలైనంత ఎక్కువ టైం కేటాయించాలి , డబ్బు కాదు ,చాలామంది ఎక్కువసేపు
ఒంటరి గా వుంటున్నారు కదా అని డబ్బిచ్చేస్తూ వుంటారు . ఏదో ఒకటి కొని తింటారు అని ,కాని
చెడు అలవాట్లకి ,మంచి అలవాట్లకి మధ్య దూరం చాల తక్కువ . ఒకవేళ డబ్బిచ్చినా ఆరా తీస్తున్నట్లు
కాక సహజం గా అడుగుతున్నట్లు అడిగి తెలుసు కోవాలి . వాళ్ళ స్నేహితులందరి తో మనకి కూడా
పరిచయం వుండడం ముఖ్యం . చిన్న చిన్న పార్టీలు పెట్టి వచ్చిన వాళ్ళను గమనిస్తుండాలి .
ఇక హాస్టల్ లో పిల్లలను ఉంచడానికి నేను పూర్తి వ్యతిరేకిని . అక్కడ వుంచడం వల్ల వీళ్ళను మించిన
వాళ్ళు పరిచయం అవుతారు ,చాలా మారి పోతారు . మానసికంగా పెద్దవాళ్ళకు దూరం అవుతారు .
మేం ఒంటరిగా ఉంటున్నాం పెద్దవాళ్ళ మయ్యాము అనే భావం వచ్చేస్తుంది . 24 గంటలు చదివి
రాంకులు కొట్టడం , ఉద్యోగాలు పట్టడమే కాదు ,తల్లితద్రులు ,కుటుంబం , విలువలు ఇలాంటివన్నీ
ముఖ్యమే కదా ! అంతే కాదు బాల్యం ,ఆటపాటలకు దూరం గా పెరిగితే ,వాళ్ళ జ్ఞాపకాల్లో ఏమి
మిగులుతుంది . పిల్లలు పిల్లలే వాళ్ళు రేపటి మన డబ్బు మెషీన్లు కారు . ఆట పాటలకీ దూరంగా
చీకటి గదుల్లో బంధించి చదివించే హక్కు మనకు లేదు . బాగా బ్రతకడమే కాదు బ్రతికుండడం కూడా
ముఖ్యమేకదా !
నేను మాత్రం వాళ్ళని అది చెయ్యి , ఇది చెయ్యకు , అని ఎప్పుడూ అధికారం చెయ్యను . ఏది చేసినా
దానివల్ల వచ్చే మంచి చెడు మాత్రం వివరం గా చెప్పేస్తాను . నిర్ణయాధికారం వాళ్ళదే ,పిల్లలు నా
బానిసలు కాదు ,నా ఫ్రెండ్స్ అంతే ........
***********************************
> పిల్లలిని కొడతారా ??!!!!!!!
ReplyDeleteమీ రేమీ అనుకోనంటే ఒక చిన్న సవరణ. పిల్లలిని అనటం తెలుగునుడికారం కాదు. వ్యావహారికంలోనే వ్రాస్తున్నారు కాబట్టి పిల్లల్ని అనండి. గ్రాంధికంలో ఐతే పిల్లలను అనవలసి ఉంటుంది.
మీ టపాలో " వేల్లిపోతుందేమో" అన్నది సరికాదు "వెళ్ళిపోతుందేమో" అనాలి కదా. "ముందు గ
ఒక ఫోన్ నెంబర్ పిల్లలికి నేర్పిస్తారు " అన్న వాక్యంలో "ముందుగా" అనీ "పిల్లలకి" అనీ ఉండాలి. ఇలాంటి కొంచెం ప్రచురించేముందు సరిచూసుకుంటె బాగుంటుందని నా అభిప్రాయం. కేవలం మీకు ఉపకరించే అవకాశం ఉంటుందేమో అని ఈ మాటలు వ్రాసాను. మీకు నా అభిప్రాయాలూ సలహాలూ నచ్చకపోతే మన్నించండి.
నమస్తే శ్యామలీయం గారు .. టైపింగ్ లో కొంచెం వీకే నిజమే తప్పులు '' దొర్లుతున్నాయి ''.
ReplyDeleteనేను ఎక్కడా నేర్చుకోక పోవడం [కంప్యూటర్ ,టైపింగ్ ] వల్ల వచ్చిన ఇబ్బంది . మీ సలహా
పాటిస్తాను . మీలాంటి పెద్దవాళ్ళు చదువు తున్నారు అన్నప్పుడు భయం గా వుంటుంది .
కళ్ళు మూసుకుని ,దేవుడా దేవుడా ! అనుకుంటూ పబ్లిష్ నోక్కేస్తుంటాను అన్నట్లు టపా
ఎలావుందో చెప్పనే లేదు మీరు . ఫరవాలేదా , అందర్నీ ఇబ్బంది పెడుతున్ననో ఏమిటో ..
పోస్ట్ చాలా బాగుంది.మా ఇంట్లోనూ అంతే - చిన్నప్పుడు తప్పు తెలియడానికి ఒకటీ అరా తప్ప కసిగా యెప్పుడూ కొట్టలేదు.అదీ తను కొడితే నేనూ నేను కొడితే తనూ బుజ్జగిస్తూనే "నువ్వు తప్పు చేశావు కదా అందుకే అలా జరిగింది,ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యకేం" అని తనకి వివరించి చెప్పేవాళ్ళం.
ReplyDeleteఒంచెం పెద్దయ్యాక యేదయినా తను అడిగింది కొనలేకపోతే మా పరిస్థితి గురించి చెప్పేవాళ్ళం.ముఖ్యంగా అలాంటి విషయాలు పిల్లలకి చెప్పి తీరాలి!
అందుకే మా చిన్న బంగారం బుధ్ధిమంతురాలిగా తయారయింది!
నిజమే నండి ,మన ఆర్ధిక పరిస్తితి కూడా పిల్లలకు తెలియడం ముఖ్యం .ధన్యవాదాలు .
ReplyDelete