Total Pageviews

Thursday, August 6, 2015

వయసంటే ఎందుకో అంత భయం ?

                                 


                                     



చాల మందికి వయసు  పెరుగుతోంది  అంటే  తలనెరుస్తుంది ,ఇప్పుడు కాలేజ్  పిల్లలకి  కూడా  కాలుష్యం వల్ల 
మెరిసి పోతోంది ,అదివేరే సంగతి అనుకోండి . ఇక మన విషయానికి వస్తే జుట్టు మెరవగానే  రంగు వేసుకోడం ,
మనం మాములుగా చూసే విషయం ,కాని  ఇప్పుడు  వేలకు వేలు పోసి ,పేస్ లిఫ్టింగ్ అని ,బొటక్స్ ఇంజక్షన్స్ 
తీసుకోడం అని ,మన బ్లడ్ తీసి మళ్లీ  మనకే మొహం లో ఎక్కిస్తారట ,అందువల్ల ముడతలు కనపడవట . 
ఇవన్నీ సినిమా వాళ్ళు  చేస్తే ఓకే ,కాని ఇప్పుడు  మాములు జనాలు కూడా ఇవన్ని చేయించుకుంటున్నారు . 
ఇంట్లో పెద్దవాళ్ళకు  కళ్ళజోడు వచ్చినప్పుడు ,పంచాంగం చూసేటప్పుడో ,బియ్యం ఏరే ట ప్పుడో  పెట్టుకుంటే ,
చూస్తే  ముచ్చటేసేది  మనమెప్పుడు  పెద్దవాళ్ల మౌతమా  అన్పించేలా  కళ్ళకి ఇంపుగా వుండే వారు . అదే 
ఇప్పుడైతే అదొక నేరం లా వుంది . వయసు పెరిగితే హుందాగా ఆ విషయం  అంగీకరిస్తేనే బావుంటుందేమో !
పాత నీరు  కొట్టుకు  పొతే నే గా  ,కొత్తనీరు ప్రవహించేది ? పెద్దావిడ  ప్యాంటు షర్టు  వేసుకుంటే ఏమి బావుంటుంది 
కాని నేనుచూ సాను . చూడ చక్కగా వున్నారు ఆవిడ ,కాని ... అదే ఒకబెంగాలి కాటన్  శారీ వేసుకుని చిన్న 
వేలు ముడి వేసుకుంటే  దణ్ణం పెట్టకుండా ముందుకు కదలలేము ,కాని ఆమె సౌకర్యం ఆమెది కదా!!!!!!!!!!!!

                                                                                                                                                                






అందరం కూర్చుని  కబుర్లు చెప్పుకునే వేళలో  మా నాన్న ,అమ్మను బాగా ఆడించేవారు ఏదో ఒక విధం గా
వయసు ప్రసక్తి  తెచ్చి '' మీ ఇంటికి బట్టలు తెచ్చి అమ్ముతాడే  మీ సూర్రావు  అన్నయ్య , నీ ఈడువాడే  కదూ'' 
అంటే చాలు  అమ్మకి  తిక్క రేగేది '' మీరు మరీనూ ,  మేము బడికి వెళ్ళే రోజుల్లోనే ..  అతనికి పెళ్లి అయ్యింది . 
ఇప్పటి లాగా  '''ఆంటి '' అంకుల్ '' అని పిలుపులు  అప్పుడు లేవు కనుక  అన్నయ్య అంటున్నాము , 
అతనే నాటివాడు ?'' అనేది  నవ్వులతో ఇల్లు హోరేత్తేది . నాన్న వదలకుండా  మరి మీ చుట్టాలతను వున్నాడు 
చూడు  బాబు రావు ,అతను  నువ్వు ఒక తోటి వాళ్ళేనా  ,అని మళ్లీ  ఉడికించే వారు . బావుంది అతను  మా 
 నాన్న  దగ్గర  పన్చేస్తాడు  . మాకన్నా చాల పెద్దోడు ''అతనే  నాటివాడు 'అనేది .  అందరూ  నవ్వుతుంటే నాకు మాత్రం ' వయసంటే ఎందుకో  అంత భయం ' పెద్ద ఐతే  నేను ఇలాగేనా' అనుకునే దాన్ని . తర్వాత ఆ విషయం  మర్చిపోయినా   ఈమధ్య  బాగా గుర్తు  వస్తోంది  .





షాపింగ్  కని  కోఠీ  వెళ్ళాము , తీసుకు వెళ్లి  తను మాత్రం కార్ లో  కూర్చుని  మీరెళ్ళి వచ్చేయండి  అంటారు . 
సరే అని  కోఠీ  లో ప్రవేసిస్తాను  ఒక ఇరుకు మార్గం లో  అటూ  ఇటూ  వున్న దుకాణాల మధ్య , బండి మీద ,
అందం గ అమర్చిన చెక్కల మీద  చిట్టి పొట్టి బట్టలు ప్లాస్టిక్ సామాలు ,ఇంట్లోకి పనికివచ్చే  కాఫీ  ఫిల్టర్ లు 
ప్లాస్టిక్ పువ్వులు, బాగ్ లు ,క్లిప్పులు , బిందీలు , కప్పు లు, దుప్పట్లు దివాన్ కవర్లు ,ఏమి ఉండవని అడగండి . 
ఊరికే వెళ్ళినా  కూడా కొనాల్సినవి  చాలా  కన్పిస్తాయి . చిన్న సైజ్  ఎగ్జిబి షన్  లాంటిది . ఇదికాక  వచ్చే పోయే 
ఆటో లు  బైక్  లు  , జన సందోహాన్ని చేదించు  కుంటూ  వెళ్తూ వస్తు వుంటాయి . అంత చిన్న దారి లో ఇవన్ని 
ఎందుకు  నడవనిస్తారో తెలీదు . ఏమాత్రం అప్రమత్తం గా  లేక పోయినా కాళ్ళు పచ్చడే ,సరే ఇక  విషయానికి  వస్తే 
ఐస్ క్రీమ్  కొనివ్వగానే తినేసి ,మా అమ్మాయి  నా చెయ్యి విడిపించుకుని  డాడి  దగ్గరుంటా  అంటూ జారుకుంది . 
ఎడాపెడా  పనికొచ్చేవి పనికి రానివి కొనేసి ,''ఏమిటో ..  వీటికోసం  ఇంతదూరమోస్తామా  మళ్లీ , పెట్రోలు దండుగ 
కదూ!  అనుకుని నేను చేసిన మంచి పనికి నా భుజాలు నేనే చరుచుకుని  ఆనందం గా మోసుకొచ్చి కార్  లో 
పెడుతుంటే  హాయిగా దర్జాగా సీట్ లో పడుకుని  పాటలు వింటూ ,నన్నుచూసి  లేస్తూ , బాగ్ లు  వెనకాల పెట్టు అంటూ సలహా ఒకటి ..' నీళ్ళలోనే  వుంటారు కాని  తడి అంటదు  అదృష్ట వంతులు  అనుకుంటూ ,అన్ని పెట్టేసి 
కూర్చున్నా ,కుస్  కుస్  అంటూ  నవ్వులు  విన్పిస్తుంటే  ఏమిటి అన్నాను . ఏమిలేదు అనడం  మళ్లీ అదే నవ్వు ,  
ఏమిటో చెప్పచ్చు గా  అన్నా , శారీ పిన్స్ కొన్నావా  అనడిగేరు  , నాకు అర్ధమయ్యింది .  కొన్నాను అన్నాను . 
మరి ముందు ఒకతను వచ్చి కొనమంటే ఎందుకు కొనలేదు  అన్నారు . మళ్లీ  కుస్ కుస్ లు ఎక్కువయ్యాయి . 
''అదా  ముందు కొనమన్నవాడు ' ఆంటి ' శారీ పిన్స్  కావాలా అన్నాడు . '' నేనేమన్నా నీకు  అత్తనా ,పిన్నినా 
ఆంటీ  అంటున్నావు ,తెలియని వాళ్ళని ''మేడం''అనాలని తేలీదా  అన్నాను . అంతేకాదు శారీ  పిన్స్ వద్దన్నా 
''మరి ఎవరి దగ్గర కొన్నావు '' అక్కడజరిగిందంతా  వచ్చి చెవిలో వుదేసిందన్నమాట ,అందుకేనా ఆ నవ్వులూ ?
ఎవరిదగ్గర కొన్నావు చెప్పు .. వదిలేటట్టు లేరు ,చెప్తుంటే నాకే నవ్వు వచ్చేసింది ''అక్కా శారీ  పిన్స్ తీస్కొఅక్కా ''
అన్నాడు వాడి దగ్గర  కొన్నాను . ఎంతకీ నవ్వాగడం లేదు పాపం . వెళ్తూ కూడా నవ్వుకోవచ్చు  కార్ తీస్తారా 
ఇంటికెళ్ళి వంట చేస్కోవాలి  మళ్లీ  అన్నాను . దాన్లో ఏముంది  నువ్వు ' ఊ  'అనాలి కాని  దార్లో  మంచి హోటల్ 
లో భోంచేసి వెళ్దాము అన్నారు .ఐతే ఇంకేం  నాకసలే చాల  ఆకలి వేస్తోంది  బాగా షాపింగ్ చేసి అలసి పోయాను
రెండు ఏనుగులు ,ఒక గుర్రం  ఐతే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడున్న ఆకలికి  అన్నాను . వెళ్తున్నాం కదా ఏమాత్రం తిని వుద్దరిస్తావో  చూస్తాను  అన్నారు . సరే దేనికైనా ముందు  బయల్దేరాలి కదా అన్నాను సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ..

ఇప్పుడు తెల్సిందా  మీకు , మా అమ్మ  వయసు కధ  నాకు  ఎందుకు  గుర్తు కొచ్చిందో ............ 

                              *************************************

6 comments:


  1. వయసంటే ఎందుకో అంత భయం ?

    ఊరికి తిరిగి ఇవ్వకపోతే ఒళ్ళు వస్తుందని :)

    జిలేబి

    ReplyDelete
  2. హహా మా బాగా చెప్పారు ,ధన్యవాదాలు .

    ReplyDelete
  3. మీకూనా! హ హ ..

    ReplyDelete
  4. ధన్యవాదాలండి

    ReplyDelete