Total Pageviews

Thursday, March 26, 2015

నిశివర్ణోదకం ... [కాఫీ ]!!!!!!!!!!!!!!.


                                                 జంద్యాల గారి భాష లో  కాఫీ పేరు  నిశివర్ణోదకం . 

నాకు  కాఫీ  అంటే  చాల  ఇష్టం . అదికూడా ఉదయాన్నే  లేవగానే  తాగే కాఫీ . అందులో ఏమి టి  ప్రత్యేకం ?
అనుకుంటున్నారా !చాలా ప్రత్యేకతలువున్నాయి . అప్పుడే  పాలు కాచి కలుపుతాం  కదా ఓ ..  ఓహ్  మ్మ్ 
ఆ రుచే  వేరు . అన్నట్టు  కాఫీ  ఎప్పుడూ ' కాచ 'కూడదు , 'టీ 'కాచాలి ,టీ ఎంత మరిగితే  అంతరుచి . మరి 
కాఫీ  అలాకాదు , కాఫీ  ని'' కలపాలంతే'' ,అప్పుడు ఆ  రుచే వేరు . అసలు పొద్దున్నే  ఇల్లంతా  అలముకునే 
ఆ  సువాసన  హబ్బా ... దానికోసమే  నేను నిద్ర లేస్తాను  అంటే  అతిశయోక్తి  కాదేమో !  అలాగని   నేను 
పొద్దున్న లేస్తే  కాఫీ  పీతలా  తాగుతూ వుంటా  ననుకుంటే ,  పప్పులో  కాలేసారే ... ఒకరోజు  కి ఒక కాఫీ 
పధకం నాది . అంతే  కాదు  లేవగానే  ఎవరన్నా  కాఫీ  కప్ తో ఎదురొచ్చి  ఇస్తే ఎంత  బాగుంటుంది  అని 
నా కోరిక కూడా !    అసలే  నా మనసులో  ఏదన్నా  అన్పిస్తే   అనేసేయ్యాలి  ,ఒక శుభ ముహూర్తం  లో 
కేన్ ఉయ్యాలలో  కూర్చుని  కమ్మని కాఫీ  సేవిస్తూ .  .'' నాకు ఉదయాన్నే  ఎవరన్నా కాఫీ తెచ్చి  ఇస్తే ,
ఎంతిష్టమో ..'' అన్నాను  నోరు జారి , హాయ్ గా  ప్రకృతిని  వీక్షిస్తున్న  మా  వారు  నావేపు  చూస్తూ .. 
బోలెడంత  సిగ్గుపడుతూ ..'' నీకభ్యంతరం  లేక పొతే  నాకు లేదు''  అన్నారు . పంచ్  మన మేయ్యడమే ,
కాని  వేరేవాళ్ళు  వేస్తే  ''ఇలాగుంట దని '' నాకప్పుడే  తెలిసింది . ఆతర్వాత  ఏమిజరిగుంట దో  మీకు 
నేను చెప్పక్కర లేదనుకుంటా ?. సరే మరి మన కాఫీ విషయానికి  వద్దాం . తాత గారు ,నాన్న  గారు 
ఇద్దరూ  అడవుల్లోనే  పనిచేయడం వల్ల  కాఫీ  గింజలు  ఎవరోఒకరు  తెచ్చి ఇస్తుండే  వారు . వాటి 
పరిమళం  ఇల్లంతా  వ్యాపించి వుండేది . అది ఎందుకో తెలీదు కాని  నాకు బాగా నచ్చేది . ఆవిధంగా 
చిన్నప్పుడే  నాకు కాఫీ  చాల ప్రియ మైనది   ఐంది . దానికి తోడూ  మా తాత  గారు తరచూ  మద్రాస్ 
వెళ్తూ వుండేవారు . అక్కడి కాఫీ  కలిపే విధానం తెచ్చి  మాకు అలవాటు చేసారు . మీకు  తెలుసుగా 
చెన్నై కాఫీ గురించి ? .   కాఫీ గింజలు  సన్నని  మంటమీద వేయించి [అంటే  గిన్నేలోనే  లెండి ]మిషన్లో 




  


తిప్పుతూ  పొడిచేసే వారు . [ఎవర్ని  పోడవలేదండి  'గుండ ' అంటారు కదా ఆపొడి  అన్నమాట ]ఆ పొడి తో 
కాఫీ చేస్తే ఉంటదీ .. సరే సరే  అర్ధమయ్యింది   ఇంతకీ  నేనెలా  కలుపుతానో  చేప్పేడవ మంటారు ,అంతే  కదా !
రెండు కప్  ల నీళ్ళు  బాగా మరిగించాలి ,పెద్ద చెంచా  కాఫీ పొడి  ఒక గిన్నెలో  వేసి  అందులో  మరిగిన  నీళ్ళు 
పొయ్యాలి ,  బాగా స్పూనుతో కలిపి  మూత  పెట్టాలి  .  పక్కనే  పాలు  మరిగిస్తూ  వుండాలి అప్పుడు కాచిన 
పాలు అయితేనే  నురుగు తో వుంటాయి కదా ,ఆరుచే వేరు  అవి గిన్నేలోని  డికాషన్  లో  పొయ్యాలి  పోస్తూ 
రంగు చూడండి  మీకు స్ట్రాంగ్  గా  కావాలి  అనుకుంటే ,పాలు తక్కువ ,లేదు సమంగా  చాలు  అనుకుంటే 
రంగుచూసి  ఆపేయండి . రెండు కప్పు ల్లోకి  తీసుకుని  పంచదార  ఎంతకావాలో  కలపండి . రుచి చూడండి . 
పోలా  అదిరి పోలా ... మీరు హడావిడిగా  కలుపుకు తాగే  ఇన్స్ టెంట్  కన్నా ఓ కొత్తరుచి తెల్సుకుంటారు . 
పైగా పొడి  దగ్గుకుడా  కూడా వస్తుంది  ఆ  ఇన్స్ టెంట్  వల్ల . రాత్రి  పనితో  అలసి పోయి ఫిల్టర్  లో  డికాషన్ 
వెయ్యడం మర్చిపోతే ,ఉదయం బాధపడక్కర్లా మంచి కాఫీ సేవించొచ్చు . నాకైతే  పాలు కూడా అక్కర్లేదు 
బ్లాక్  కాఫీ కూడా ఇష్టమే ,కాకపోతే  పౌడర్  తక్కువ వెయ్యాలి అంతే 



పాలు బాగా కాచి ,ఫ్రిజ్ లో  పెట్టాలి ,చల్లారాక  తీసి ,ఐస్ ముక్కలు .పంచదార ,ఇన్స్ టెంట్ కాఫీ  పొడి వేసి 
మిక్సి లో తిప్పాలి గాజు గ్లాస్  లో చాక్లెట్  టాపింగ్  వేసి  ఈ మిశ్రమం వేసి ,పైన  ఐస్ క్రిం వేసి ఇస్తే ....... 
నాకు కూడా చాల ఇష్టం . ఇదంతా కాదు  అనుకుంటే  కాఫీ డే   లో   ,రకరకాలు దొరుకుతాయి . కాకపోతే 
మొదటి వారం లోనే వెళ్ళాలి . గోల్డెన్ వీక్  కదా ,రెండో వారం  సిల్వర్ వీక్ ,మూడోది  '' జర్మన్ సిల్వర్''కాకుండా 
చూసుకోండి మరి .  వాళ్ళు రకరకాల  పేర్లు పెట్టి ,అమ్మి ..... స్తారు  భయ్యో య్..... 


                           ******************************************************

6 comments:

  1. కాఫీ త్రాగటం అలవాటు లేని నాకు మీ కాఫీ గురించి చదివాక అర్జంట్ గా కాఫీ చేసుకుని తాగాలనిపించిందండీ.

    ReplyDelete
  2. అది "నిశివర్ణోష్ణోదకం" అండీ.

    ReplyDelete
  3. thanq soomuch. raveendra garu.

    ReplyDelete
  4. మహి గారు ఐతే ఇక మీరు కాఫీ ప్రియులన్నమాట , ధన్యవాదాలు .

    ReplyDelete
  5. అంటే ఎక్కడో మర్చిపోయాను . కోల్డ్ కాఫీ గురించి రాసాను కదా !
    ఉష్ణో దకం వదిలేసి నందుకు మన్నించేయండి .................

    ReplyDelete