రొయ్యలు ఎప్పుడు పొట్టు వలిచి శుభ్రం చేసినవే తెచ్చుకోవాలి . తెచ్చిన వాటిని గిన్నెలో వేసి
నీళ్లతో రెండు మూడు సార్లు కడిగి పసుపు ,చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద ఉంచాలి , చాలా నీరు వస్తుంది ,మొత్తము నీరు ఆవిరై రొయ్యలు మాత్రం మిగిలే వరకు ఉంచి తర్వాతస్టవ్ కట్టేయాలి .
ఇప్పడు చల్లారేక ఫ్రిజ్ లో ఉంచితే నాలుగు రోజులు ఉంటాయి . లేదా అప్పుడే వండాలన్నా
కూడా నీరు మొత్తం పోయేవరకు స్టవ్ పైన ఉంచడం మాత్రం ముఖ్యం .
జీడి పప్పు ,రొయ్యలు సమానం గా తీసుకోవాలి ,కట్ చేసిన ఉల్లిపాయముక్కలు , అల్లం
వెల్లుల్లి పేస్ట్ , పసుపు ,ఉప్పు ,రెండు స్పూన్ల కారం ,గరం మసాలా పొడి ,కరివేపాకు ,పచ్చి
మిర్చి ముక్కలు . నూనె, కొత్తిమీర .
చేసే విధానం :
నూనె వవేడెక్కగానే ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి . పచ్చిమిర్చి ,కరేపాకు వేసి వేయించాలి .
అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి జీడిపప్పు వేయాలి . వేగాక రొయ్యలు (పై విధంగా నీళ్లు తీసేసినవి) వెయ్యాలి . తర్వాత ఉప్పూ ,పసుపూ ,కారం ,గరం మసాలాలు వేస్తూ వేయించాలి బాగా
వేయిస్తూ మంచి రంగు రాగానే ,కొత్తి మీర చల్లి దించేయాలి . అన్నం కోసం వెయిట్
చేయక్కర లేదు , స్పూన్ వేసుకు ని లాగించేయొచ్చు .. అంతబావుంటుంది తప్పకుండ
ట్రై చెయ్యండి .. .....
*****************************************************************************
No comments:
Post a Comment