ట్రైన్ పట్టాలమీద పరుగులు పెడుతోంది ,భోగి ఏ సి ,కావడంతో చప్పుడు అంతగా లేదు . వంటరిగా ప్రయాణం
చెయ్యడం కష్ట మన్పించింది . ప్రతిసారి పిల్లలూ ఆయన కూడా వుంటారు . ఇప్పుడు కొత్తగా ఏ మిటోగా వుంది .
ప్రొద్దుటే జన్మభూమి లో ప్రయాణం . రెండు రోజుల ముందే తను వెళ్తూ వెంట రమ్మన్నారు . నేనే ఈరోజు వస్తా
అని చెప్పేను . సాయంత్రం అన్నవరం లో నేను దిగే సరికి వైజాగ్ నుంచి తను అన్నవరం వచ్చేస్తారు. రేపు
ఉదయమే దర్శ నం ,వ్రతం ,సాయంత్రం తిరుగు ప్రయాణం . చిరుజల్లు కాస్తా పెద్ద దయింది . అదే ఇంట్లో వుంటే
పోర్టికో లో ఉయ్యాల ఊగుతూ వర్షం ఎంజాయ్ చేస్తాను . బయిటికొస్తే వర్షం చికాకే ! ప్రతి చిన్నవిషయాన్ని ఎంతో
ఆస్వాదించే నాకు ,ఈరోజు ఎందుకో అంత గా మనసు బాలేదు . కేవలం పిల్లలు వెంట లేకపోవడం వల్ల వచ్చిన
చిరాకనుకుని పెద్దగా పట్టించుకోలేదు . కాని ఈరోజు నేను చూడ బోయే ప్రత్యక్ష నరకానికి , సూచన అని నాకు
అప్పుడు తెలీదు . సాధారణం గా మూడ్ బాగోక పొతే ,దాని మూల కారణం వెతికే నేను ,ఒంటరి ప్రయాణం అలవాటు లేక అయ్యుంటుంది లే అని సర్దేసాను .
పక్క సీట్ లో దంపతులు వారి బాబుకు తల తుడిచి ,కేప్ సాక్స్ వేసారు . కొంచెం నీళ్ళు తాగించారు ,వాడితో
ఆడుతున్నారు . ముద్దు లోలికే ఆబాబును చుస్తే మావాడు గుర్తు వచ్చాడు . చిన్నపిల్లలు రాజభోగం జరిపించు
కుంటారు . కాని పదేళ్ళు వయసప్పుడు సేవకుల్లా ,ఇరవై లోస్నేహితుల్లా,మసలుకోవాలట .తల్లితండ్రు లి ఇద్దరికీ
ఉద్యోగాలు కనుక పిల్లల్ని మొదట కేర్ సెంటర్ , తర్వాత ప్లే స్కూల్ ,హాస్టల్ అంటూ ,మన పిల్లల్ని మనమే దూరం చేసుకుంటున్నాము . వయసైనాక వాళ్ళు మనల్ని పట్టించు కోవడం లేదు'' ఇంతచేసాము '' అని తిట్టుకుంటాం .
ఎక్కడో ఎవరిదగ్గరొ పెరిగిన వారికి తల్లితడ్రుల మీద ప్రేమ ఎలావుంటుంది. కుటుంబ విలువలూ ,నైతిక విలువలూ
ఎలా తెలుస్తాయి .
వర్షం అంతకంతకు పెరుగు తూ చికాకు పరుస్తోంది . ఇంటి నించి ఫోన్ వస్తే మాట్లాడేను . తెనాలి వచ్చినట్లుంది ,
బాబు ,వాళ్ళు దిగిపోయారు . నేను బాగ్ లోంచి లంచ్ తీసి తిన్నాను . ఏదో ఘాబరాగా అన్పిస్తోంది . కొంచెం సేపు
నిద్రపోయాను . కాఫీ కూడా రాలేదు సామర్లకోట దాటింది కాని ట్రైన్ లేట్ అను కుంట , వాతావరణం వల్ల కూడా
అయ్యుంటుంది , బయట బాగా చీకటి గా వుంది . మావారు ఫోన్ చేసారు తను అన్నవరం వచ్చానని ,స్టేషన్ లో
వున్నానని ,సరిగా సిగ్నల్ లేక ఏమి విన్పించడం లేదు . ఆ కాస్త మాట్లాడే లోగా రెండు సార్లు కట్ అయింది .
ఫోన్ పక్కనుంచి, లంచ్ తిన్న బాక్స్ బాగ్ లో వుంచాను ,టికెట్ చూసుకున్నాను ,అన్ని ఒకసారి చూసుకుని ,
అన్నవరం రాగానే దిగిపోయాను . ఎటుచూసినా ఆ చీకట్లో ఈయన నాకు ఎక్కడ కనపడలేదు . నాతొ పాటు
దిగిన వాళ్ళు దేవస్తానం బస్ వచ్చిందంటూ అటు వెళ్ళడం చూసి చీకట్లో ఇక్కడ వుండే కన్నా వారితో వెళ్ళడం
నాయమనిపించి బస్ ఎక్కేసాను . బస్ ఫ్రీ అట బస్ బయల్దేరగానే ఫోన్ కోసం బాగ్ మొత్తం వెతికాను ,ఎక్కడా
లేదు . హ్యాండ్ బాగ్ , బట్టల బాగ్ ఎందులోనూ లేదు . ఒక్కసారి నా గుండాగినంత పనయ్యింది . పెద్దఖరీదై న
ఫోన్ అని కాదు ఈమధ్య ఫోన్ నంబర్లు గుర్తు పెట్టు కోవడం మానేసాను బద్ధకం ఎక్కువై . కాని బుక్ లో
రాసి హ్యాండ్ బాగ్ లో పెట్టుకునే అలవాటుంది . ఆబుక్ చూసి అక్కడ దిగినాక చెయ్యలి . అందరూ కొండ పైకి
వెళ్తుంటే నేను మాత్రం క్రింద దిగేసాను .బస్ కొండంపైకి వెళ్ళే మార్గం దగ్గర వేసున్న కుర్చిలల్లో కూర్చున్నా .
అంతే కరెంట్ పోయింది . హతవిధీ ఏ మిటీ పరీక్ష అనుకుంటూ కూర్చున్నాను . ఫోన్ లేదు ,కరెంట్ లేదు .
టెన్షన్ లో ఫోన్ నంబర్ గుర్తు రావట్లేదు ,వర్షం చిమ్మచీకటి . వంటరి తనం ,గుండెల్లో గుబులు .
ఇంటికి ఫోన్ చేస్తే పిల్లలు కంగారు పడతారేమో , మా అన్నయ్యకు చేస్తే నలభై నిముషాల్లో వస్తాడు ,కాని
నా పరిస్తితి చూసి మావారిని ఏదోకటి అనేస్తాడు . ఎలామరి బస్సు మరో సారి పైకి వెళ్లి వచ్చింది . కాస్త
నల్లగా వున్నవ్యక్తి బస్ లోంచి నన్ను పరీక్షగా చూసాడు . నాకు చాల భయం వేసింది . మళ్ళీ బస్ వచ్చింది .
అతను నావేపు వస్తూ 'కొండమీదకు రారా అ ని అడిగాడు నీకెందుకు నువ్వెళ్ళు అనా లన్పించింది . కాని
నేనున్నపరిస్తి తి లో ఎవరితో గొడవ పడాలని లేదు ఫోన్ వుంటే ఇవ్వండి మావాళ్ళు రావాలి ఒక ఫోన్
చేసుకుంటా అన్నాను . వెంటనే తీసిచ్చాడు ,బుక్ కోసం చుస్తే లేదు . ఆయన నంబర్ గుర్తురావట్లేదు .
వేరే హ్యాండ్ బాగ్ లో నంబర్లు వున్న బుక్ వుం డి పో యింది . ఇంటికి చేశా ,పిల్లలు వాళ్ళ డాడి నంబర్
చెప్పారు . చిత్రం అది నాకు బాగా తెలిసిన నంబరే , నోట్లో నానుతుంది ఇంతసేపు గుర్తు రాలేదు . వెంటనే
ఆయనకు చేశాను . ''నిన్ను పోలిస్ స్టేషన్ దగ్గర వుండమన్నాను కదా అన్నారు . నాకేమో స్టేషన్లో మీరు
వుంటాను అన్నట్లు వినిపించింది అని చెప్పాను . ఈవర్షం లో అక్కడి వరకు ఎందుకని అలాచేప్పెను .
అన్నారు . సరే ఇప్పుడు ఎక్కడవున్నావు అన్నారు చెప్పెను ఐదు నిముషాల్లో వచ్చారు . నాకు సెల్
ఫోన్ విలువేంటో తెలిసొచ్చింది . ఆనల్లని వ్యక్తి'' చాలసేపట్నుంచి ఇక్కడే కూర్చున్నారు . పాపం బాగా
భయ పడ్డారు '' అన్నాడు . అదే బస్ లో కొండమీదికి బయల్దేరాం . రూమ్ తీసుకున్నాం . తను స్నానానికి
వెళ్ళారు . నాకు వొక్కసారిగా చాల ఎడుపోచ్చేసింది . ఒక నాలుగు గంటలు ఇంటికి దూరంగా ,ఒంటరిగా
నరకంలో ,ఎంత హింస పడ్డానో ఆలోచిస్తే చాల భయం వేసింది . అంతే కాదు బ్రతకడానికి ఎంత ధైర్యం
కావాలో అర్ధం అయ్యింది .జీవితం అంటే ఇంట్లో కుర్చుని కదలు రాసుకోడం కాదని ఏ టికి ఎదురీదడం
అని తెలిసొచ్చింది . పాపం సెల్ పోయిన్దని ఏమీ అనలేదు కూడా ..........
తను స్నానం చేసొచ్చి ఎందుకేడుస్తున్నావు అంటూ సారీరా సరిగా వినపడలేదు అన్నారు .చాలవుడుకు
మొత్తనం వచ్చింది ,ఏడ్చే సేను గడ్డం పట్టి పైకి లేపి ఇక్కడ పోలీసులు లేరు చూసావా అన్నారు . మాభాష
లో పోలీసులు అంటే మా పిల్లలు ,అనుమానాస్పదం గా చూస్తూ అక్కడక్కడే తిరుగుతుంటారని వాళ్ళకి
ఆపేరు పెట్టేము . నాకు బోల్డంత నవ్వొచ్చింది ,గంపెడంత సిగ్గేసింది .
************************************
లంచ్ బాక్స్ లోపల పెట్టి ఫోన్ బైట వదిలేసారన్నమాట! నిజంగానే వస్తువులమీద చాలా ఆధారపడిపోతున్నాం మనం. అనుభవాల్ని బాగా వ్యక్తపరిచారు,బావుందండీ! 'పోలీసులు' హ!హ! బాగుంది .వా ళ్ళకు తెలుసా ?
ReplyDeleteలంచ్ బాక్స్ లోపల పెట్టి ఫోన్ బైట వదిలేసారన్నమాట! నిజంగానే వస్తువులమీద చాలా ఆధారపడిపోతున్నాం మనం. అనుభవాల్ని బాగా వ్యక్తపరిచారు,బావుందండీ! 'పోలీసులు' హ!హ! బాగుంది .వా ళ్ళకు తెలుసా ?
ReplyDeleteనాగరాణి గారూ ధన్యవాదాలండి ,బహుకాల దర్శనం మీరు నా మొదటి అతిధి .
ReplyDeleteనేను మర్చిపోలేదండి . మాపిల్లలకు తెలీదండి ,అది మా ఇద్దరి కోడ్ భాష .