Total Pageviews

Thursday, January 29, 2015

' లై' సెన్స్ .


నమస్తే , నేను వనిష  . ఈ మధ్య ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను . నాన్న గారు నా ర్యాంకు చూసి ముచ్చటపడి  స్కూటీ కొని ఇచ్చారు . మొన్నటి వరుకు దగ్గరలోని హై స్కూల్ కు  సైకిల్ ఫై వెళ్ళడం వల్లనా బండి నడపడం వెంటనే వచ్చింది . కాలేజీ కి కూడా తీసుకుని వెళ్ళాను . కాని నాకు L.L.R లేదని ఆన్ లైన్ లో 475 రూపాయిలు కట్టి R.T.O లో exam రాసి  తెచ్చు కున్నను . ఆరు నెలలు లోపల టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలని మూడు నెలల  లోపే కాలేజీ మానుకుని మా నాన్న  గారి తో వెళ్ళాను . రెండు గంటలు నించుని నించుని ....  ఉంటె అప్పుడు పిలిచి నీ license లో 50 c.c లోపు అని ఉంది అని నాకు" చావు కబురు చల్లగా చెప్పి" వెళ్లి 50 c.c బండి తెమ్మని నన్ను పంపించాడు(అంటే బయిటికి పోమని కసురు కున్నారు లేండి ...!) . 50 c.c అంటే "లూనా" బండి తెసురాలెం  కదండీ ..... ! అందుక అది అలా  పోయింది . అంతటి తో పొయిందా  అంటే లేదు !అక్కడ టెస్ట్ ఇవ్వడం కోసం ఫీజు కట్టేను  అంటే మల్లి 475 రూపాయిలు . మొంతం కలిప్తే మొత్తం 1000 రూపాయిలు పొయింది . దానికి అదనంగా టెస్ట్ ఫెయిల్ అని  ముద్ర కూడా వేసారు . ఇక లాభం లేదని  ఒక డ్రైవింగ్ స్కూల్ ద్వార 2000 రూపాయిలు కి ఒప్పించాడు . దాంతో మేము ఒప్పుకుని L.L.R కోసం వెళ్ళాము . న అల్లవాటు ప్రకారం ఎలాగు ఎక్షమ్ రాయాలని వెళ్ళితే అతను అవసరం లేదని నన్ను లోపల కూర్చో పెట్టి నా ఫోటో తీసుకుని చేతిలో L.L.R  పెట్టి వెల్లమనాడు . మరి ఎక్షమ్ అంటే అదేమీ అవసరం లేదని నా వైపు నవ్వుతు చెప్పాడు . అప్పుడు అనుకున్న "డబ్బులు ఉంటె ఎన్ని పని లేని పనులో అని " అనుకుంటూ ఇంటికి వెళ్ళాను . నా  టెస్ట్ డ్రైవ్ సమయం రాణే వచ్చింది . ముందు జాగ్రత్త గ అతని దగ్గరుకు వెళ్లి ఎం తెసుకేలాలి అని అడిగ్తే 'ఏమి  అవసరం లేదు L.L.R చాలు అని అన్నడు' . ఎందుకైనా మంచి దాని నా ఫోటో , ఆధార కార్డు xerox తెసుకుని వెళ్ళాను . నా టెస్ట్ నేను ఇచ్చె సాను . ఇన్స్పెక్టర్ నను పిలిచి నా పాస్ స్లిప్ తేసుకోమన్నాడు . నేను ఆనందంగా వెళ్ళాను . అతను నా thumb  impression అడిగాడు . నేను ఆ మెషిన్ పైన వెలు పెట్టాను . కానీ అది  detect  అవ్వలేదు . దానితో నా ఆధర్ కార్డు అడిగాడు . నేను నా ఆధర్ కార్డు xerox ఇచ్చను . అత ను ఇది పనికి రాదు అని అన్నాడు . నాకు ఒరిజినల్ కావాలని కసురు కున్నారు . అతని mood పొద్దున్న నించి బాగా లేదంట ......!ఎందుకంటే అతని బండి ని ఎవ్వరో బైక్ వాడు accident  చేసాడని అతను  నన్ను కసురు కున్నదు. మేము చాల దూరం నుంచి వచ్చాం  అని xerox  తెసుకోమని బతిమ లాడం కానీ విన లేదు . దానితో మా నాన్న మాళ్లి ఇంటికి  బైలుదేరారు .మా ఇంటికి ఇంకా ఇక్కడికి 3 గంటల సమయం పడు తుంది .  వెళ్లి  నేను అక్కడే కూర్చుని ఉన్నాను . అప్పుడు ఒక పిల్ల వాళ్ళ నానగారి తో వచ్చింది . తను  టెస్ట్ ఫెయిల్ అయింది . ఇంకోసారి అవకాసం ఇచ్చాడు . ఆమె మల్లి ఫెయిల్ అయింది . ఆమె బయిటికి వెళ్లి 10 సమోసాలు తెచ్చి ఇచింది . అంటే టెస్ట్ ఇంకోసారి ఇవ్వకుండానే లైసెన్స్ ఆమె చేతికి ఇచ్చాడు . దాని తో కంగు తిన్నాను . ఇంతలోకి అతని డ్రైవర్ నాతో మాట్లదాడు . అతని బండిని ఒక్కడు accident  చేసాడని అనుకే mood  బాగాలేక అల ప్రవర్తిసునదని లేకుంటే ఆధర్ కార్డు xerox తీసుకుంటాడని చెప్పు కొచ్చాడు .  నాకు చాల కోపం వచ్చింది . ఇంతలోకి మా నాన్న గారు వచ్చారు . ఆ ఆధర్ కార్డు అతనికి చుపిదామని వెళితే అక్కడ ఒక మనిషి (అదే ఆ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్) 'పోనీ లెండి sir  పాపం ఆ అమాయి పొద్దున్న నించి కూర్చుంది అని చెప్పు కొచ్చాడు '. అంటేఅతను ను స్టాంప్ వేసి ఇచ్చాడు . వాడి మూడ్ బాగాలేదని మా నాన్న గారి ని వెన కి పంపించి మరి ఆధర్ కార్డు తెమన్నాడు కానీ దాన్ని వైపు కనీసం చూడను కూడా లేదు . దాని కోసం నాకు మా నాన్న గారికి నాకు  తిండి లేదు . దానికి అదనంగా సమయం వృధా అయింది . మొతానికి నా లైసెన్స్ చేతికి వచ్చింది . అక్కడ ఏ  రూల్స్  లేవు , వారి మూడ్  మాత్రమే ,ఇంకో ఆమె
వస్తే  కార్ లో  ఆమె భర్తని  కూడా  వెళ్ళనిచ్చాడు  టెస్ట్ ఇవ్వడానికి  నాకు  చాల బాధ  అన్పిచ్చింది . స్టూడెంట్
ఒకతను వస్తే 'ఏరా'  నీకు  ఇంకా april  వరకు వుంది కదా  పోయి మల్లి రా  అంటూ మర్యాద లేకుండా  మాట్లాడి
వెళ్ళ  గొట్టాడు . అతను  చిన్న బుచ్చుకుని వెళ్లి పోయాడు . వాళ్ళు ఏమి చెబితే అదే నడుస్తుంది అక్కడ .
                                                                                                                                  *************

ప్రమాదాలు  జరిగి నప్పుడు ,హడావిడి చెయ్యడం , తర్వాత మళ్లీ  మాములే , అది కూడా  సెలబ్రిటి  లైతే నే
అసలు మన వ్యవస్థ లోనే  ఎన్నో అవస్తలున్నాయి ,ఇదంతా మారాలంటే  చిన్నప్పుడు  మా అమ్మమ్మ
చెప్పిన కధలో లాగా  రాజకుమారుడు  గుర్రం మీద  రావాలి ,కాదు కాదు ,రాజకుమరున్ని  ఎన్నో
ఇబ్బందులు పెట్టె మాంత్రికుడు  రావాలి ,అప్పుడే  ''ఓమ్  హ్రీం  హాం ఫట్ ''అంటూ చిత్రంగా  మన కష్టాలు
మాయం చేసేస్తాడు . మాంత్రికు డినే  ఎందు కడిగానంటే ,మన ''ఒకే ఒక్కళ్ళు ''చాలామందే చెతులెత్తె సారుగా .

ఆ రోజు  డ్రైవర్ ఉండుంటే  అతను  బ్రతికే వాడు అనుకునే  వున్నత  స్తాయి కి  ఎదిగి పోయాము . మరి
డ్రైవర్  పొతే  ? పేదవాడు,    పేదవాడే గా ,     పేదవాడి  ప్రాణం   గడ్డి పోచతో సమానం  మనకి . లైసెన్స్
ఇచ్చే చోట  సక్రమం గా  వుంటే ,చాల వరకు ప్రమాదాలు  తగ్గుతాయని  ఆలోచించ రెందుకో  మరి ,
నడపడం వచ్చినవారికి ,ఖచ్చి తంగా '' నియమాలు'' ,తెలియ పరిస్తే ,చాల ప్రాణాలు కాపాడవచ్చు .


                                          ****************************************

No comments:

Post a Comment