Total Pageviews

Thursday, March 26, 2015

నిశివర్ణోదకం ... [కాఫీ ]!!!!!!!!!!!!!!.


                                                 జంద్యాల గారి భాష లో  కాఫీ పేరు  నిశివర్ణోదకం . 

నాకు  కాఫీ  అంటే  చాల  ఇష్టం . అదికూడా ఉదయాన్నే  లేవగానే  తాగే కాఫీ . అందులో ఏమి టి  ప్రత్యేకం ?
అనుకుంటున్నారా !చాలా ప్రత్యేకతలువున్నాయి . అప్పుడే  పాలు కాచి కలుపుతాం  కదా ఓ ..  ఓహ్  మ్మ్ 
ఆ రుచే  వేరు . అన్నట్టు  కాఫీ  ఎప్పుడూ ' కాచ 'కూడదు , 'టీ 'కాచాలి ,టీ ఎంత మరిగితే  అంతరుచి . మరి 
కాఫీ  అలాకాదు , కాఫీ  ని'' కలపాలంతే'' ,అప్పుడు ఆ  రుచే వేరు . అసలు పొద్దున్నే  ఇల్లంతా  అలముకునే 
ఆ  సువాసన  హబ్బా ... దానికోసమే  నేను నిద్ర లేస్తాను  అంటే  అతిశయోక్తి  కాదేమో !  అలాగని   నేను 
పొద్దున్న లేస్తే  కాఫీ  పీతలా  తాగుతూ వుంటా  ననుకుంటే ,  పప్పులో  కాలేసారే ... ఒకరోజు  కి ఒక కాఫీ 
పధకం నాది . అంతే  కాదు  లేవగానే  ఎవరన్నా  కాఫీ  కప్ తో ఎదురొచ్చి  ఇస్తే ఎంత  బాగుంటుంది  అని 
నా కోరిక కూడా !    అసలే  నా మనసులో  ఏదన్నా  అన్పిస్తే   అనేసేయ్యాలి  ,ఒక శుభ ముహూర్తం  లో 
కేన్ ఉయ్యాలలో  కూర్చుని  కమ్మని కాఫీ  సేవిస్తూ .  .'' నాకు ఉదయాన్నే  ఎవరన్నా కాఫీ తెచ్చి  ఇస్తే ,
ఎంతిష్టమో ..'' అన్నాను  నోరు జారి , హాయ్ గా  ప్రకృతిని  వీక్షిస్తున్న  మా  వారు  నావేపు  చూస్తూ .. 
బోలెడంత  సిగ్గుపడుతూ ..'' నీకభ్యంతరం  లేక పొతే  నాకు లేదు''  అన్నారు . పంచ్  మన మేయ్యడమే ,
కాని  వేరేవాళ్ళు  వేస్తే  ''ఇలాగుంట దని '' నాకప్పుడే  తెలిసింది . ఆతర్వాత  ఏమిజరిగుంట దో  మీకు 
నేను చెప్పక్కర లేదనుకుంటా ?. సరే మరి మన కాఫీ విషయానికి  వద్దాం . తాత గారు ,నాన్న  గారు 
ఇద్దరూ  అడవుల్లోనే  పనిచేయడం వల్ల  కాఫీ  గింజలు  ఎవరోఒకరు  తెచ్చి ఇస్తుండే  వారు . వాటి 
పరిమళం  ఇల్లంతా  వ్యాపించి వుండేది . అది ఎందుకో తెలీదు కాని  నాకు బాగా నచ్చేది . ఆవిధంగా 
చిన్నప్పుడే  నాకు కాఫీ  చాల ప్రియ మైనది   ఐంది . దానికి తోడూ  మా తాత  గారు తరచూ  మద్రాస్ 
వెళ్తూ వుండేవారు . అక్కడి కాఫీ  కలిపే విధానం తెచ్చి  మాకు అలవాటు చేసారు . మీకు  తెలుసుగా 
చెన్నై కాఫీ గురించి ? .   కాఫీ గింజలు  సన్నని  మంటమీద వేయించి [అంటే  గిన్నేలోనే  లెండి ]మిషన్లో 




  


తిప్పుతూ  పొడిచేసే వారు . [ఎవర్ని  పోడవలేదండి  'గుండ ' అంటారు కదా ఆపొడి  అన్నమాట ]ఆ పొడి తో 
కాఫీ చేస్తే ఉంటదీ .. సరే సరే  అర్ధమయ్యింది   ఇంతకీ  నేనెలా  కలుపుతానో  చేప్పేడవ మంటారు ,అంతే  కదా !
రెండు కప్  ల నీళ్ళు  బాగా మరిగించాలి ,పెద్ద చెంచా  కాఫీ పొడి  ఒక గిన్నెలో  వేసి  అందులో  మరిగిన  నీళ్ళు 
పొయ్యాలి ,  బాగా స్పూనుతో కలిపి  మూత  పెట్టాలి  .  పక్కనే  పాలు  మరిగిస్తూ  వుండాలి అప్పుడు కాచిన 
పాలు అయితేనే  నురుగు తో వుంటాయి కదా ,ఆరుచే వేరు  అవి గిన్నేలోని  డికాషన్  లో  పొయ్యాలి  పోస్తూ 
రంగు చూడండి  మీకు స్ట్రాంగ్  గా  కావాలి  అనుకుంటే ,పాలు తక్కువ ,లేదు సమంగా  చాలు  అనుకుంటే 
రంగుచూసి  ఆపేయండి . రెండు కప్పు ల్లోకి  తీసుకుని  పంచదార  ఎంతకావాలో  కలపండి . రుచి చూడండి . 
పోలా  అదిరి పోలా ... మీరు హడావిడిగా  కలుపుకు తాగే  ఇన్స్ టెంట్  కన్నా ఓ కొత్తరుచి తెల్సుకుంటారు . 
పైగా పొడి  దగ్గుకుడా  కూడా వస్తుంది  ఆ  ఇన్స్ టెంట్  వల్ల . రాత్రి  పనితో  అలసి పోయి ఫిల్టర్  లో  డికాషన్ 
వెయ్యడం మర్చిపోతే ,ఉదయం బాధపడక్కర్లా మంచి కాఫీ సేవించొచ్చు . నాకైతే  పాలు కూడా అక్కర్లేదు 
బ్లాక్  కాఫీ కూడా ఇష్టమే ,కాకపోతే  పౌడర్  తక్కువ వెయ్యాలి అంతే 



పాలు బాగా కాచి ,ఫ్రిజ్ లో  పెట్టాలి ,చల్లారాక  తీసి ,ఐస్ ముక్కలు .పంచదార ,ఇన్స్ టెంట్ కాఫీ  పొడి వేసి 
మిక్సి లో తిప్పాలి గాజు గ్లాస్  లో చాక్లెట్  టాపింగ్  వేసి  ఈ మిశ్రమం వేసి ,పైన  ఐస్ క్రిం వేసి ఇస్తే ....... 
నాకు కూడా చాల ఇష్టం . ఇదంతా కాదు  అనుకుంటే  కాఫీ డే   లో   ,రకరకాలు దొరుకుతాయి . కాకపోతే 
మొదటి వారం లోనే వెళ్ళాలి . గోల్డెన్ వీక్  కదా ,రెండో వారం  సిల్వర్ వీక్ ,మూడోది  '' జర్మన్ సిల్వర్''కాకుండా 
చూసుకోండి మరి .  వాళ్ళు రకరకాల  పేర్లు పెట్టి ,అమ్మి ..... స్తారు  భయ్యో య్..... 


                           ******************************************************

Saturday, March 21, 2015

ఉగాది శుభాకాంక్షలు .

కొత్త సంత్సరం లో  మీ కలలు  ఆశలు  కోరికలు  అన్ని నెరవేరాలని  అందరికి  మంచి  జరగాలని  కోరుకుంటున్నాను . 










   
                                         *****************************************

Thursday, March 19, 2015

మన చిట్కాలు .

ఆరోగ్యం గా , అందం గా  వుండాలని  ,ఎవరికీ వుండదు  చెప్పండి ? కొంతమందికి  ఎంతవయసు  వచ్చినా అసలు
తెలియనే  తెలియరు . మరికొంతమంది  చిన్నవయసు లోనే  ముదురుల్లా  అన్పిస్తారు . మనజీన్స్  ఎలాంటివైనా
కొన్ని జాగ్రత్తలతో , అందాన్ని  ఆరోగ్యాన్ని   కాపాడుకోవచ్చు . మన ఆడవాళ్లకు  జుట్టు  అంటే ఎంత ప్రేమో  ,                            
1   పెరుగులో  మెంతి పిండి  వేసి రాత్రంతా వుంచి  తలకు పెట్టేది .
     ఇది జుట్టు మెత్తగా  అవడానికి  పనికి వస్తుంది .



2   గోరింటాకు  తలకు పెట్టె వాళ్ళు ,టీ  డికాషన్ లో  కలపకూడదు .
     పెరుగులో  మాత్రం  కలపాలి . రాత్రి కలిపి వుంచి  పొద్దున తలకు
     పెట్టుకుని  నీళ్ళతో  మాత్రమే  కడగాలి .'' తర్వాత రోజు ,కొబ్బరి నూనె
     రాసి  ఒకగంట ఆగి  షాంపూ చెయ్యాలి'' . తలలో చుండ్రు  ఉన్నట్లయితే
     బీట్ రూట్  రసం తో గోరింటాకు కలిపితే ,చుండ్రు వదిలి పోతుంది . రంగు
     వద్దు  కేవలం  మెత్తదనం కోసం  అనుకుంటే ,కొబ్బరి నూనె రాసి ,గోరింట
       ఆకు పెట్టుకోవాలి .



3    కలిపే విధానం తెలుసు గా ,ఒక  కప్  గోరింట పొడి ,గుంటగల గరాకు  పొడి  ఒకస్పూన్ ,ఉసిరి పొడి
      సగం స్పూన్ , నాలుగు చుక్కల యూక్ లిప్ట స్  ఆయిల్ , నాలుగు చుక్కల  నిమ్మరసం ,నీళ్ళతో
      కలిపి  రెండు స్పూన్ల  పెరుగు వెయ్యాలి , లేదా  పైన చెప్పినట్లు  బీట్ రూట్  రసం  తో మొత్తం
      కలుపుకోవచ్చు .వాసన నచ్చకపోతే  జుట్టు కడిగేటప్పుడు నిమ్మచేక్క పిండి న  నీళ్లు పోసుకోవాలి .


4    మొహానికి , తురిమిన  ఆలుగడ్డ [బంగాళదుంప] లో నిమ్మరసం  వేసి  మొహమంతా మృదువు గా
      రాయాలి . మిగిలిన మిశ్రమం  కళ్ళ మీదవుంచి పా వుగంట  తర్వాత  చల్లని నీళ్ళతో  కడగాలి .
       మీరిక కెమికల్  బ్లీచ్ వాడే అవసరం  రాదు .



       మచ్చలు  ముడతలతో పాటు ,చెడు అలవాట్ల వల్ల  కళ్ళకింద  వచ్చిన  ముడతలు  పోతాయి .
        అన్నట్లు  వట్టినిమ్మచేక్కరాసినా  బ్లీచ్  అవుతుంది  కాని ఎండలోకి  వెళ్ళకూడదు  మొహం
         నల్లబడుతుంది .

5   '' టమాట  మధ్యకి  కట్ చేసి ,రెండుచేతుల  పట్టుకుని  చెంపల మీద  పైకి తిప్పుతూ  మొహం
      అంతా రాయాలి ,20 నిముషాలు ఆగి  కడిగేస్తే  ఎండవల్ల  వచ్చిన ''టాన్ '' పోతుంది . స్కిన్
      లో కూడా చాల మార్పు  గమనించవచ్చు  వారానికి  రెండుసార్లు  చేస్తే చాలు ''.



6     మగవాళ్ళకి  ఎండలో తిరగడం  వల్ల  వచ్చే నల్లని  మచ్చలు  వలయాలు ,పోవాలంటే ,అలోవేర
       [కలబంద ] గుజ్జులో నిమ్మ రసం  నాలుగు చుక్కలు  వేసి  మచ్చలమీద  రాసి ఆరాక  కడిగేయాలి .
      '' ఏన్ని  మందులు వాడినా  తగ్గని  మచ్చలు ,ఇలా వారానికి   నాలుగు సార్లు చేస్తే  పోతాయి'' .


7     మీది పొడి  చర్మమా , తేనే  రాసి చుడండి , కాస్త బొంబాయి  రవ్వలో  తేనే  నీరు  వేసి ముద్దలా
       చేసి  మోహము  మెడ  రాసి  కాస్తాగి కడగాలి  మృదువైన  చర్మం మీసొంతం .అలాగే  పొడిచర్మం
       ముడతలికి  అవకాసం  ఎక్కువ  కనుక  ,నూనె  మసాజ్  వారానికి  ఒకసారన్నా అవసరం .


8     గుడ్డులోని  తెల్ల సోన  లో  కాస్త  పసుపు ,ముల్తాని మిట్టి  కలిపి ,రాస్తే  ముడతలు  తగ్గుతాయి .
        తెల్లసొన  ఎలాంటి  వాసనా  వుండదు , కనుక  నిరభ్యంతరంగా  వాడచ్చు . ఇదే  తెల్లసొన
         కండిషనింగ్  కొసమ్ జుట్టుకి  వాడితే , కడగడానికి  చల్లని  నీరుమత్రమే  వాడాలి .


9     మోచేతులు నల్లగా  ఉన్నాయా  ఐతే  వాడేసిన  నిమ్మచేక్కలో కొంచెం  సాల్ట్ వేసి  రుద్దితే
       నలుపు విరిగి పోతుంది . మేడలో గొలుసువల్ల  వచ్చిన నలుపు కూడా పోతుంది .


10    ముఖ్యమైన  విషయం ఏమిటంటే , చెప్పాను  కదా అని  అన్ని కలిపి చెయ్యవద్దు . మీకు ఏది
         అందుబాటులో   వుందో తరచూ అంటే  వారానికి  కనీసం మూడు సార్లన్న  చెయ్యగలి గినది
         ఎంచుకుని  అది   మాత్రం  చెయ్యండి .


11     చెప్పినవన్నీ  మొహం తో పాటు మెడకు కూడా చేసే అలవాటు చేసుకోండి . అప్పుడే బావుంటుంది .
         వీటిలో  ఏ విధమైన  హానికర పదార్ధాలు  లేవు  అన్ని  వంటింటి  లోని ఉపయోగించే పదార్దాలే
         కనుక  ఎటువంటి  హాని  జరగదు .


12     జలుబు  వున్నప్పుడు  విక్స్  కాని  బామ్  కాని ,వేడినీళ్ళలో  వేసి  ఆవిరి పట్టండి . అదే బాగా
       ''  గొంతు నొప్పిగా ఉందనుకోండి  గ్లాస్ నీళ్ళలో స్పూన్ జీలకర్ర చిటికెడు  పసుపు  ఉప్పు  వేసి
         మరిగించి ,వడపోసి  తాగి చూడండి''   ,ఎంత త్వరగా    ఉపసమనం  వుంటుందో .


13     రాత్రిపూట  మజ్జిగ  మానేస్తే  పొట్ట రాదట , పెరుగుకన్నా ,చిలికిన మజ్జిగ మంచిదట .


14     పడుకునే ముందు పాలలో  పటిక  బెల్లం పొడి వేసుకుని  తాగితే నిద్ర బాగా  పడుతుంది .


16     ఎలర్జీ  వల్లబాధపడే  వాళ్ళు,  తుమ్ముల తో  ఆస్తమా  తో ఇబ్బంది పడేవాళ్ళు  రోజూ  తాగే
        ''  నీళ్ళు వేడిచేసుకుని  తాగడం అలవాటుచేసుకోవాలి '',  ప్రతిరోజూ గోరువెచ్చగా  నీరు త్రాగడం
         వల్ల  ఎన్నో వుపయగాలు  వున్నాయి ,పొట్టకు మంచిది , మొహానికి  ముడతలుకుడా రావట .




17      ప్రొద్దున్నే  చెక్క నిమ్మ  రసంలో   స్పూన్ తేనే కలిపి తాగితే , వళ్ళు తగ్గుతుంది  తెల్సుగా
          అలాగే కళ్ళలో వయసు వల్ల   మెరుపు తగ్గడం  వుండదు . తుమ్ములు  అలర్జీ  కూడా
           తగ్గుతుంది .  తగ్గలేదంటే ,పడలేదేమో చూసి  తేనే   మానే సేయ్యండి .


18      గ్ర్రెన్ టీ  తాగడం వల్ల  షుగర్ వచ్చే అవకాశాలు ,మోహంలో  ముడతలు  వచ్చే  అవకాశాలు
         తగ్గడం  తో  పాటు ,పోట్టకుడా  తగ్గుతుంది .  వాడేసిన  టీ  బాగ్స్  కళ్ళమీద  పెట్టుకుంటే
         రిలాక్సేషన్  తో బాటు , దిగులుగా వుండే  కళ్ళకు  మెరుపు వస్తుంది .

19      ఏ మచ్చలు  లేని మంచి రంగు , చర్మం  ఉన్నాయా , ఐతే  మీరు నెలకి  ఒకసారన్నా ఈ ప్యాక్
          వేసుకోవాలి ఇక మీదట కూడా  ఏ  ఇబ్బందులు  రాకుండా ,సెనగ పిండి [బేసన్ ] లో ఒక చెక్క
          నిమ్మరసం  , ఒకపెద్దస్పూను పెరుగు ,చిటికెడు పసుపు ,వేసి కలిపి ,మొహానికి  మెడకి ,
           అవసరం అనుకుంటే చేతులకి  వేసుకుని , ఆరాక కడిగెయ్యాలి . ఇద    మచ్చలు , ముడతలు ,
            రాకుండా  చర్మం  నునుపుగా  ఉండటానికి  పనికొస్తుంది .
                                               ****************************

     
                                       


Thursday, March 12, 2015

సరిగమల , పదనిసల , ప్రయాణం ...........


'' ఏమిటి  పెళ్ళికి  ట్రైన్  లోనా ! హబ్బా  బోర్ ! కార్  లో వెల్లిపోదాం ''
 ''వద్దు  ఎందుకు  రిస్క్ ,అక్కడకి వెళ్లాకే కార్  ఎంగేజ్  చేస్కుందాం ''
''ఏంటీ  జన్మ భూమి లోనా  నో  మీరు రెండు  రకాల  పేపర్లు  కొని
చదువు కుంటూ  కూచుంటారు ,పిల్లలేమో  ఒకరు తిండి మిల్
ఒకరు  సెల్ లో గేమ్స్  ఆడుతూ  కూచుంటారు ,నేను మిగతా
ప్రయాణికుల్ని చూస్తూ  మధ్య  మధ్య  కునుకు' పాట్లు'  పడాలి
ఇదొక  ప్రయాణమా !'గౌతమి ' లో  ఐతే శుభ్రంగా పడుకుని
పొద్దునే లేవచ్చు ,ప్రెష్  గా  వుంటుంది . '' ఇలా  అనేక చర్చోప చర్చలు  జరిగాక , ప్రయాణం  నిర్ణయించాము.
మధ్యా నమనగా  క్యాబ్  కి  పోన్ చేస్తే  వెతుకుతూ ,పోన్లో  మమ్మల్ని సంప్రదిస్తూ ,ఎట్ట కేలకు చిట్ట  చివరకు,అర్ధ గంట ఉందనగా  వచ్చాడు .  ఎంత వేగం గా  తీసుకొచ్చాడ ంటే , స్టేషన్ కి  వచ్చేసరి కి  గుండె  రైలు శబ్దం లా కొట్టు
కుంటోంది . ఎలాగో పరిగెత్తించి  రైల్ ఎక్కించారు . ఒక గంటవరకు  ప్రాణం గూట్లో పడలేదనుకోండి .





బాగా  అలసి పోయాం [పరిగెట్టడం  వల్ల ] ఏదో ఇంత  తినిబెర్త్   వాలుద్దమనుకునే  సరికి  మొదలయ్యింది అసలు
కధ . ఎక్క గలిగిన వారికీ  ఎక్కలేని వారికీ , లోయర్  బెర్త్  మాత్రమే  కావాలి  అసలు లోయెర్  కావాలని  రిజర్వ్
చేసుకున్న నా  అభిప్రాయం  అక్కడ  ఎవరికీ  అక్కరలేదు . అదో ప్రహసనం  , తరచూ ప్రయాణం  చేసే వారికీ
ఇదంతా అనుభవమే కాబట్టి  దానిగురించి  రాయట్లేదు . ఇక నిద్రపోదాం  అనుకునే  సరికి  ఎవరిదో పోన్ రింగ్
'అంతేనా... ఇంకేం కావాలి ... కుదిరితే కప్పు కాఫీ  వీలయితే  ...  నాలుగు  మాటలు ... ఇలా రెండు సార్లు వచ్చాక
తీసాడయన ,మాటల్ని  బట్టి  కొడుకుతో మాట్లాడుతున్నాడు ,కూతురి  పెళ్లి శుభలేఖ  షిర్డీ  లో  సాయినాధుని
పాదాల వద్దవుంచి  హైదరాబాద్  లో వున్న మరో కూతురిని అల్లుడిని పెళ్ళికి  పిలిచి తిరిగి వెళ్తున్నాడు . అదొక
అర్ధగంట  మీటింగ్  అయ్యాక ముగించాడు . హమ్మయ్య అనుకుని నిద్ర కుపక్రమించాను , ''గాల్లో తేలినట్టుందే ..
గాల్లో  తేలి .. గాల్లో  తేలి ....మరెవరిదో  మిస్ కాల్ ?...మరొకా యన కాల్  బ్యాక్ చేసాడు , పొద్దిన కల్లవచ్చేస్తానని
స్టేసన్ కి  బండి తేవాలని  మరి మరీ  చెప్పి  పెట్టేసాడు . ఎలాగో  ముసుగేసి నిద్దరోదామని ట్రై  చేస్తున్నా , ఇంతలో
పెద్దసబ్దం ,ఎవరో చిన్నపిల్ల  పయ్ బెర్త్  మీదనించి కిందడింది , పెద్ద హడావిడి ,అదిముగిసి ఏడుపు మనేసరికి
మరో పావుగంట . ఆ మహాతల్లికి పసిదాన్ని  అవతలి పక్క పడుకో బెట్టుకోవాలని  తెలీదా ! ఎవరెవరికో మరిన్ని
పోన్  లు  వచ్చాక అప్పుడు ప్రశాంత మయ్యింది . ఒక పెద్దాయన  విమానం స్టార్ట్ [గురక ] చేసాడు . అది మెల్లిగా
పెరుగుతూ  హెలికాఫ్టర్  గా  మారి  పావురాల గుట్టమీదుగా  స్తిరంగా  ఎగురసాగింది . వారి  శ్రీమతి ని తలుచు
కొని  పుట్టెడు  జాలేసింది . దేవుడా  ఇంత  డబ్బు పోసి  రిజర్వేషన్  చేసుకుంది  పడుకోవడానికి  కాదా !
ఇంతలో కాళ్ళదగ్గర   మెత్తగా .. ఉలికి పడి  ముసుగు తీసా , ఎవరో కుర్చునున్నాడు . ''హలో ఇక్కడనించి
లేస్తారా  ''అన్నాను  అంతే  గబ గబా వెళ్ళిపోయాడు . పెళ్లి కదా అని  వస్తువులన్నీ  సర్దేసాను , ఆ  బాగ్ కి
చైన్  వేసారో లేదో ? తలకింద  పెట్టు కుంటా ఇమ్మని చెప్పా .. వినేరకమా  ఏమన్నానా , ఆ  పెట్టె తీసుకు
దిగిపోతాడో  ఏమో ?, నిద్రపట్టలేదింక . పెళ్ళంటే  నగలు చీరలు  ప్రదర్శన , అవిలేకుండా  వెళ్తే[  ఈగో ]కత్తి
ఖంగు మంటూ  కింద డి పోద్ది . పక్కింటి పేరంటానికి  కూడా  పట్టుచీర  కట్టనిదే లోపలి కూడా రమ్మనరు .
మా ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలో ఎలాచేబితే అర్ధమౌతున్ది ,చెప్పండి , అసలే నా  పుత్రుడు  అడిగాడు ' మళ్ళీ  తెచ్చావా  టిష్యు  పేపర్లు ' అని . అదేంటి  బోలెడు ఖరీదు పెట్టి పట్టు చీరెలు కొనుక్కొస్తే  టిష్యు  పేపర్లంటావా !
 అంటే ' అంతే  కదా  ఒకసారి  అందరూ  చుసేరంటే  నోటేడ్  అయిపోతాయి  కదా మళ్లీ  కట్టుకోవుగా  ' '
 నా బంగారు కొండకన్నీ  నా బుద్దులే  వచ్చాయి ....

అర్ధరాత్రి కావచ్చింది   ఎవరో టీ  అమ్మేవాడిని  పిలిచి ఏ  స్టేషన్  అని అడిగారు ,టీ  కావాలా  అన్నాడు ,
వద్దు నిద్ర దిగిపొద్ది  అనగానే  ఆ టీ  వాడు 'రైల్ స్టేషన్ ' అని వెళ్ళిపోయాడు . హబ్బో  గోదారి గాలి మొదలై
నట్టుంది అందుకే  వెటకారం మొదలైపోయింది  . తెలంగాణా  నించి ఆంధ్రప్రదేశ్ గా   మారేక ఇదేరావడ0 చాల
ఆనందం కలిగింది . విజయవాడ దాటింది  ,ఏ లూరు  లో  రావాల్సిన  ''దోసు  దొసూ '' అనే  శబ్దం  రాలేదేమిటో
లయబద్దం  గ  చప్పుడు చేస్తూ  బ్రిడ్జ్ మీద  ట్రైన్ వెళ్తోంది . గోదావరిని ఆ మసక  వెలుగులో చూస్తేనే  సంతోషం
చుట్టుముట్టేసింది . వంశీ ''వెన్నెల్లో గోదారి అందం .. పాట  ఇళయరాజా  సంగీతం , జానకమ్మ ,గళం ..ఒహ్ ..
అన్నట్లు  రాజమండ్రి  విద్యార్ధులు  శ్రీ మాన్ చంద్రగారు [మా వారే ] లేచి గోదారిని దర్శించ నే లేదు . వారు
చిన్న సైజ్  a  c   బస్  నడిపిస్తున్నారు  అదేనండి  సౌండ్ తక్కువుండే , [గురక ] గరుడ బస్  అన్నమాట .
తెల తెల వారుతోంది  రైస్ మిల్  పచ్చని పొలాలు ,సాయిబాబా  గుడి  అన్ని వరుసలో  నన్ను  పలుక రిస్తూ ..
వెళ్తున్నాయి ,ఈ పచ్చని అందాలూ చూడని కన్నులేందుకు ,అన్పిస్తుంది  కాని  ఒక రోజే ,మళ్లీ  ఊరికి
ఎప్పుడు వేల్లిపోతమా  అన్పిస్తుంది . సికింద్రాబాద్ స్టేషన్  లో రైలు  దిగ్గానే  హమ్మయ్యా  అన్పిస్తుంది .
అక్కడ  పెళ్లింట్లో  మా  వాళ్ళు  నాకోసం  ఎదురు చూస్తూ వుంటారు . మొదట  పలకరింపులు ,తర్వాత కౌంటర్లు
ఎన్కౌంటర్లు , టైర్లు  సెటైర్లు  మొదలైపోతాయి . మనం మాత్రం  మళ్లీ ఇదే  టైంకి,  ఇదే  చోటులో  వచ్చేవారం
  హైదరాబాద్ లో కలుద్దాం  ................... !

                                                   **********************************

Thursday, March 5, 2015

ఎక్కడో చదివాను . .............




ఎక్కడో చదివాను .... కోకిల  కి  గూడు  వుండదట .  కాకి గూటి లోనే  గుడ్లు  పెడుతుందట .
కాకి    తెలియక తన గుడ్ల తో పాటు  ,  పొదిగి పిల్లలిని చేసి   ఆహరం  తెచ్చి పెంచుతుందట .
 కూత మొదలుపెట్టగానే 'కా కా ' బదులు 'కూ  కూ ' వినగానే  కొయిల ని  గూటిలోంచి పడేస్తుందట .
కాకి గూటి లోంచి  వచ్చింది   కనుక  కొయిల  పెంచదు ,కొయిల పిల్ల   కనుక  కాకి చేర
నివ్వదు . ఎంత హృదయ విదారకం . కమ్మని పాటల   కొయిల కు ఎంత కష్టం , కేవలం
మావిచిగురు తిని ,మన  మనసులు  రంజింప చేసే  కొయిల కు  కూడా  విషా దమేనా ?
ఇందులో ఎమన్నా తప్పులుండవచ్చు ,  నెనుమరచిపొఇ  ఉండవచ్చు తెలిసిన వారు
సరిదిద్దండి .







ఎక్కడో చదివాను ...  ఏనుగు చిన్న  పిల్లగా  వున్నప్పుడు   పెద్ద గొలుసు తో బందిస్తారట .
పెద్దయ్యాక  సన్నని తాడుతో  కడతారట ,ఎందుకలా  అంటే ,చిన్నప్పటి  నించి ఆ బంధనాన్ని
తెంచుకోవాలని  ప్రయత్నించి, ప్రయత్నించి  విసిగి పోతుందట ,ఇకనావల్లకాదు  అని ఓటమి
ఒప్పుకుని ,ప్రయత్నం విరమించు కుంటుందట . అప్పుడు  గోలుసుతీసి  తాడు వేస్తారు ,
కాని అప్పటికే  ఇక  ప్రయత్నిచడం  మానేసిన ఏనుగు ఆ విషయం  పట్టించు కొదు .
అంత పెద్ద తలకా యవున్న,  తెలివికదా  ముఖ్యం . మనం కూడా ఒకోసారి  కొన్ని విషయాలు
దాటావేస్తుంటా ము [ఓవర్ లుక్ ] దానిఫలితం కూడా మనదే అనుకోండి . అన్నట్టు ఏనుగు
బంధించే గోలుసుపేరు ''  శృంఖలాలు   '' అంటారట .




ఎక్కడో  చదివాను ...  గోమాత  గొప్పదనం  గురించి  మనకితెలుసు కదా  దేవాలయం లో పూజ
చేస్తాము . ఇంటికొస్తే  అరటిపండో  కడిగిన బియ్యంలో  కొబ్బరి బెల్లం  కలిపి  పెడతాము ,కాళ్ళకి
నమస్కరించి  ఎంతో  తృప్తి పడతాము . ఆవుపాలతో  పోషకాలే  కాదు,  యజమాని  దగ్గరకి
వచ్చి గంగ డోలు  దువ్వి  ముద్దు చేసినప్పుడు ,అతని శ్వాస ద్వారా ,అనారోగ్యాన్ని  పసికట్టి
ఆ  వ్యాధి కి విరుగుడు గా  పనిచేసే ఆకులు ,తీగెలు వెతికి తిని  వచ్చి  యజమానికి ఔషధ
గుణము కలిగిన పాలనిస్తుందట  . ఎంత ఆశ్చర్యం .. అందుకేనేమో ''గోమాత '' అన్నారు
మనపెద్దవాళ్ళు ఏదీ  ఉరికే  పెట్టలేదండి  ప్రతి నియమం  వెనుక కొండంత అర్ధముంటుంది .
అందుకే  ఇంట  గోవును పెంచాలన్నారు .



ఎక్కడో చదివాను ... గ్రద్ద డెబ్భై ఏళ్ల  పయ్  బడి జీవిస్తుందట , కానీ సగం జీవితం గడిచేసరికే
దాని రెక్కలు దానికే  బరువై తయట ,ముక్కు వాడి తగ్గి పోతుందట ,గోర్లు పదును పోతుందట
అప్పుడు గ్రద్ద  ఒక కొండ శిఖరం  పైన కూర్చుని ,తన రెక్కలకున్న ఈకలన్నీ పీకేస్తుందట ,
గోర్లన్ని  వాడియైన ముక్కుతో ,పెకలించి వేస్తుందట  , ముక్కును శిఖరం  అంచుతో రుద్ది మళ్లీ
మొలిచేవరకు  ఎదురు చూస్తుంది . అలా కొన్ని నెలలు ఆహారం  లేకుండా  ఎంతో శ్రమ తో
భాదతో కూడిన వ్యయ ప్రయాసల కోర్చి , కొత్త  జీవితాన్ని మొదలుపెట్టి ,మిగతా జీవితాన్ని
సంతోషంగా  గడిపేస్తుంది . ఆ  సంకల్పబలాన్ని భగవంతుడు మనకి కూడా  ఇచ్చాడు కాని
ఎంతవరకు  సద్వినియోగం  చేస్తున్నామో మనకే  తెలియాలి .

                                            ****************************