Total Pageviews

Thursday, February 26, 2015

నాకొచ్చిన కల ............


''త్వరలో  సెజ్  లో  కాని ,సాగర హారం ,లో కానీ భాగం   కానున్న మా[వారి ] వారసత్వపు  భూములు .'

''నానీ  గ్రౌండ్  అంటే ఏమిటి ?'' అంటే  ఇదే నాన్నా   కాలితో  ఫ్లోర్  మీద  తడుతూ  చూపించాను
.'' ఉహు  కాదు ఇది   కాదు  ఇది మల్హోత్రా  అంకుల్   వాళ్ళ రూఫ్
మనం  వుండేది  99 ఫ్లోర్  మీ డాడి  కావాలని  ఇంత ఎత్తు లో  కొన్నాడు .
ఎన్ని ఫ్లోర్  లు దిగినా ,ఎన్ని ఫ్లోర్ లు  ఎక్కినా  ఎవరో  ఒకరి  రూఫ్ మాత్రమే  వస్తుంది .
 ''మరి మట్టి  అంటే '' మట్టా ? ఇవన్ని  ఎవరు చెప్తున్నారు నీకు ? ''మట్టి లో  మొక్కలు ఉంటాయట ,ఇంకా పూలు
పళ్ళు  వస్తాయట ? ఆశ్చర్యంగా  చూసాను  వాడి ముద్దు మోములో  బోలెడన్ని  సందేహాలు . అవన్నీ  గత
వైభవాలు , ఇపుడు  వాటి ఆనవాళ్ళు  కూడా లేవు . అవన్నీ ఎందుకు కాని  నువ్వు వెళ్లి  టి  వి  చూడు మమ్మీ
వచ్చే టైం ఐంది  వస్తూ  ఈరోజు ,బర్గర్ లు  తెస్తుంది  వీకెండ్ కదా .. ''ఓహ్  నానీ మర్చిపోయా  ఈరోజు  మనం
ఫుడ్  తింటాము  కదూ .. '' ఆనందం గా  గంతులేస్తూ  వెళ్ళాడు . ఈరోజు  శుక్రవారం  మా  కోడలు వస్తూ బర్గర్
తెస్తుంది ,అవి మేరీ  బిస్కెట్స్  లా  ఇంతే వుంటాయి , వాటిని  నీళ్ళు చల్లి  ఓవెన్  లో పెడితే  పెద్దగా వుబ్బుతాయి
అవే తింటాము ,అదీ వేడిగా ! రోజూ  మాత్రం మూడు పూటలా  మూడు ''స్టమక్ ఫుల్ '' మాత్రలేసుకుంటా ము  .
అవిచాల ఖరీదు తో కూడినవి  కనుక ఇప్పటి వాళ్ళంతా  పెద్దవాళ్ళని  దగ్గర పెట్టుకోవడం ,పిల్లలిని  కనడం
మానేసారు . ఏదో మా  కోడలు  మంచిది కనుక ,మా వారిని నన్ను వుండనిచ్చింది . మనవడు  కావాలంటే
కనిచ్చింది . కొన్నేళ్ళ ముందు  దేశాన్ని సింగపూర్ చేస్తామంటూ , పండే పొలాల్లో  సిమెంట్ పోసారు , బిల్డింగులు
కట్టి  ,మట్టనేదే లేకుండా చేసారు . గేసు తోడే క్రమం లో   సగం పొలాలు , క్రూ డాయిల్  లీకేజీ వల్ల  మరికొన్ని
పొలాలు ,సెజ్  లంటూ కొన్ని ,మిగతావి  ఔటర్ రింగ్ రోడ్డు లంటూ ,భూమాత కనుమరుగైంది . ఆకాశా హర్మ్యాలు
వెలిసాయి . కొత్తలో మేము  ఇదే బాగుందను కున్నాము . కాని వారమంతా బర్గేర్స్ ,ఆదివారం పిజాలు లేదా
చపాతీలు తినేవాళ్ళం . పండుగలకి అన్నం వండుకునే వాళ్ళం ,అవి  దిగుమతి చేసిన బియ్యం  కావడం  వల్ల
వెయ్యి రుపాయలనించి ,ఐదు వేలవరకూ   కిలో బియ్యం ధర వుంటుంది . కాని ఆకుకూరలు ,టమాటాలు
కూరగాయలు  లాంటివి దొరక్క పోవడం వల్ల  ఆ  అవసరం కూడా లేకపోయింది . కనీసం ఇళ్ళలో  పండించే
వీలు లేకుండా ,మట్టికుండీలు  కూడా  కనుమరుగయ్యాయి . మట్టి తో చెయ్యాలిగా . పోన్ చేస్తే  వచ్చే పిజాలు
బర్గర్ లు  తిని కూచుని  టి  వి లు  చూస్తూ  జనం  వింత రోగాల బారిన పడ్డారు ,జనాభా బాగా తగ్గింది  ఎక్కడో
మాలాగా ఒకటి అరా  తప్ప 40 ల్లొనే  ప్యాక్ అప్  చేసేసారు . 99 అంతస్తుల  మా అపార్ట్  మెంట్ లోనే  మా
వయసు వాళ్ళని వేళ్ళమీద  లెక్కపెట్టొచ్చు , పసివాళ్ళ నికుడా  అంతే .

నేను నెట్  ఆన్  చేసి  పంట పొలాల కోసం వెతికేను  అబ్బే  ' అయ్యో మీరు వెతికే  పేజ్  దొరకలేదు ' అని
వస్తోంది . మొక్కలు  కుండీలు ఇమేజ్ ల  కోసం వెతికేను ,ఉహు ... ఎక్కడ చూసినా  బిల్డింగులు ,సిమెంట్ .
మట్టి వాసనే లేదు .  చినుకులు పడుతుంటే  తడిసిన  మట్టి  నుంచి  వచ్చే  ఆ  కమ్మని వాసన పీల్చని
బ్రతుకెందుకు ? ఏ  పేజ్ వెతికినా  ఆన్  లైన్  లో  ''స్టమక్  ఫుల్ '' మాత్రలు కొనమనే  వస్తోంది ? .

చుర్రు మనేసరికి  ఉలికి పడి లేచా ''లే  ఇవాళ  లంచ్  బాక్స్  కట్టవా '' అన్నారు . జీవితమంతా  తిండి గోలే
 కలలో  లాగ  ఆ   ''స్టమక్ ఫుల్ ''   మాత్రలేప్పుడొ స్తాయో  ఏ మిటో .. ............

                                       ************************************

Friday, February 20, 2015

Thursday, February 12, 2015

ప్రేమికులరోజు


పువ్వులు ,చాక్లెట్ లు ,గ్రీటింగ్ కార్డ్స్ ,ప్రేమ సంకేతాల నిచ్చే  మరెన్నో బహుమతులు ,కొట్లలో వ్యాపారం  జరుగుతుందట  ఈ నెలలో . అంతేమరి యువతకి ప్రేమ తప్ప మరింకేం  కావాలి ? పదమూడేళ్ళ కె కథ లు
మొదలెట్టేస్తున్నారు . ఇంట్లో తెలుసో  తెలీదో ,తెలిసినా తెలీనట్లు వుంటారో ? అమ్మాయి  దగ్గ్గర  కొత్తగా  ఏ
వస్తువన్నా కనబడితే  ఇంట్లో  వాళ్ళు ఎక్కడిదని  అడగరా , ఖరీదైన సెల్ ఫోన్  వాడుతూ  'నా ఫ్రెండ్ ఇచ్చింది '
అంటే ఊరుకునే తల్లి తండ్రులున్నారు ,నమ్ముతారా ! ఇంట్లో  టీనేజ్  పిల్లలుంటే  ఇల్లోక సర్కుస్  లా  వుంటుంది .
కాని పిల్లలు తల్లి తండ్రులని  బఫున్లని  చెయ్యకుండుంటే  చాలు . పదేళ్ళక్రితం  అబ్బాయి తో మాట్లాడితే గొప్ప
ఇప్పుడా  ఎవరన్నా సరే 'ఒరీయ్ '  [మొగుడు  కూడా ,] ఒకరి వంక ఒకరు చుస్తే అదే ప్రేమ  కాని,మరి ముందుకు
వెళ్ళేది కాదు . ఇప్పుడలా  కాదు ,ఎవరిచేతిలో  చుసిన  సెల్ పోన్   అదే సగం నాశనం , అనుకుంటే  ఇప్పుడు
పేస్ బుక్  అదీ ఇదీ  అంటూ చాలానే వచ్చాయి . పిల్లలమద్య  పెద్దవాళ్ళు కని  పెట్టలేని ,ఆపలేని అనేక మార్గాలు
ఏ ర్పడ్డాయి . ప్రేమ స్తాయిని  దాటి ,ఎక్కడికో చేరిపోతున్నాయి . గౌరవం గా  బ్రతికే ఎన్నో కుటుంబాలు  వీధిన
పడుతున్నాయి . ప్రేమ వివాహాలు కుప్పలు  తెప్పలుగా జరుగుతున్నాయి . అందులో చాల వరకు కోర్ట్  మెట్లు
ఎక్కేస్తున్నాయి . పెద్ద వాళ్ళు చుస్తే మంచి చెడ్డలు విచారించి చేస్తారు . వీళ్ళు పోన్ లో  మాట్లాడి ఫేస్బుక్ లో
దగ్గరయ్యి పెళ్లి   చేసుకుంటే , కలిసి కాపురం మొదలు పెట్టగానే  అసలు రంగు బయట పడుతుంది . పొద్దున్న
లేచింది మొదలు ,పళ్ళు తోమే పేస్ట్ నించి  మొదలు పెడతారు . నేను మా ఇంట్లో  కోల్గేట్  వాడతాను ,ఈ సోప్
వాసనా  నాకు నచ్చదు లక్స్  కావాలి ,నేను టీ  తాగ ను , మా అమ్మ  కూరలో  అల్లం పేస్ట్  వెయ్యదు . ఇలాంటి
విషయాలు కూడా విడిపోవటానికి  కారణాలే . తప్పు మనదేనేమో  పిల్లల మీద ప్రేమతో వాళ్ళకి అన్ని సమకూర్చి
వాళ్ళు అవస్తలు పడకూడదని ,పెద్దవాళ్ళే  సర్దుకు పోతూ మనకే పదిమంది వున్నారుఅంతావాళ్ళ కోసమేగాఅంటూ
నెత్తిన  పెట్టుకుంటే  చివరికి ఇక్కడి దాక  వచ్చింది . అన్నయ్య  స్నేహితులు  ఆరుగురు  అన్నదమ్ములు  ఎవరికీ
పెళ్లి  కాకుండానే  ఆఖరి వాడు  ప్రేమించి పెళ్లి చేసుకు వచ్చాడు . ఏమనాలో తెలీక ,ఇంటికి వచ్చిన ఆడపిల్లని
పొమ్మన లేక ,పెద్దమ్మగారు హారతిచ్చి స్వగ తిచ్చారు . ఉదయం లేస్తే  పెరట్లో  కట్టెల పొయ్య వెలిగించి  వంట
మొదలు పెడితే  అలా వండుతూనే  ఉంటారా విడ . అందరూ  మగవాళ్ళే  పయ్ గా  కష్ట పడేవాళ్ళు ,ఎప్పుడూ
మాం సహరమే ,బెడ్ రూమ్  కిటికీ నించి చూసి  తలుపులు వేసుకు  కూర్చునేది . తన కోసం ప్రత్యేకం గా శాకాహారం
వండిన  తినేది కాదు . ఆ గరిటలు గిన్నెలు  తనకి నచ్చవనేది . బయటనించి  భోజనం తెమ్మనేది . గది విడిచి
వచ్చేది కాదు . పెద్దమ్మ గారు చాల  బాధ పడేవారు . ఇంట్లో పిల్లలా  కల్సి పోతుందని చాల ఎదురు చూసారు
కాని ఆమె ఆ  వాతావరణం లో   ఇమడలేక పోయింది . 3 నెలలు గడిచాయి  వెదుకుతూ తల్లితండ్రులు  వచ్చారు
''నేను ఇక్కడ ఉండలేను  వచ్చేసి తప్పు చేశాను  తీసుకు పొండి '' అని ఏ డ్చింది  అబ్బాయిని అడిగారు . విసిగి
పోయి వున్నాడేమో  ''తీసుకు పొండన్నాడు ''తీస్కెళ్ళి  పదిహేను రోజులు తిరగ కుండా  పెళ్లి చేసేసారు . చిత్రం గా
వుంది కదా ఈ  అద్భుత మైన ప్రేమ కధ . ఇప్పుడు అతనికి కుడా వరుస క్రమం లో పెళ్లి ఐంది . పెళ్ళికి ముందు
ప్రేమ  చాల పెద్ద గా  ఝుం ఝుం  మంటూ సబ్దిస్తుంది ,కాని పెళ్ళయ్యాక  నెమ్మదిస్తుంది . అంటే ప్రేమ లేదని
కాదు ,చాప క్రింద నీరులా  ఎల్లవేళలా  ప్రవహిస్తూనే వుంటుంది . ప్రేమ లేనిదే ఇన్ని కుటుంబాలు  ఇంత
సంతోషం గా ,ఐకమత్యం గా  వుండవు   ఉండలేవు . ఇంత  మంది  ఆడ  మగా ,కుటుంబాల  కోసం ఇంత
కష్ట పడరు . ప్రేమించండి  కాని  ఎక్కువగా  ఆ సించకండి , తర్వాత  తట్టుకోలేక పోతారు . అవతలి  వాళ్ళు
కూడా  మనుషులే ,బలాలు  బలహీనతలు  వున్నా మనుష్యులు . ఈ లోకంలో  అన్ని సవ్యం గా ఉన్నవారు
ఎవరుంటారు ? స్నేహితుల్లో బలహీనతలుంటే  పట్టించుకోము ,దగ్గర వారిలో వుంటే సర్దుకు పోతాము  కాని
జీవిత భాగస్వామి లో వుంటే సహించలెము  ,ప్రతి చిన్న విషయం భూతద్దం లో పెట్టి చూస్తాము . ఎవరెవరి
కుటుంబాల్లో  పరిస్తితులు  వాతావరణం వేరు వేరు గా  వుంటాయి  పెరిగిన వాతావరణ ప్రభావం మన మీద
చాల వుంటుంది . అలంటి ఇద్దరినీ కలిపేదే  వివాహ బంధం  ఆ బంధాన్ని గౌరవించడం ,అవతలి  వ్యక్తిని
ప్రేమించడం  మన బాద్యత ,అది ప్రేమ పెళ్లి కానివ్వండి  పెద్దలు కుదిర్చినది కానివ్వండి .మీకొక  విషయం
చెప్పనా ,మా  బంధువులలో   గల  ఒక  పెద్దాయనకి  ఆడవాళ్ళ బలహీనత  వుందని  తెలిసినప్పుడు నేను
బాధపడిన  మాట నిజం  కాని  చిత్రం గా  ఆ పెద్దాయన మీద గౌరవం  దారం పోగు అంతన్నా  తగ్గలేదు . నేను
చాల ఆలోచించాను  ఇంకా ఎందుకు అభిమానిస్తున్ననా  అని ,నేను  ఆయన  బలాలని ,తప్ప  బలహీనతలు
పట్టించుకోవట్లేదని   అర్ధం అయ్యింది . ఇంత పిసరు  నా మీద కూడా  నాకు  ఇష్టం పెరిగింది ,ఆ సంఘటన
తర్వాత . ఏ  చిన్న విషయం  ఆధారంగా  ఎవరిని  ద్వేషించ కండి  దయచేసి . అప్పుడే మనకు నలుగురు
మిగులుతారు .
                       
                        ********************************************

Thursday, February 5, 2015

ప్రకటనల పర్వం .


తెల్లవారుతూ నే  టైటాన్  వాచ్  లో టైం  చూసి ,స్లీప్ వెల్  పరుపు  మీంచి  లేచి కూర్చుంది ' తను' , శంకు మార్కు
లుంగీ , గోకుల్  బనియన్  తో  అటుతిరిగి  పడుకున్న 'మనూ ' కి  ఒకటి  అంటించింది తనూ , పూర్వం పాద
నమస్కారం  చేసే వారట లెండి . ''ఇప్పుడంత  టైమేక్కడిదండి ?'' . పారగన్  చెప్పులేసుకుని ,దగ్గరగా  రా  అనే
క్లోస్ అప్  తో పళ్ళు  తోముకుని ,లక్స్  తో  స్నానం  చేసి , పల్లవి  కాటన్  చీరతో  బయటికి  వచ్చింది . అప్పటికే
నిద్ర లేచిన  మనూ  7 o క్లాక్  తో  షేవ్  చేసుకుంటున్నాడు .  ఇద్దరూ   దొడ్ల పాలతో  సన్ రైస్  కాఫీ కలిపి తాగేరు .
మనూ తలకి  ట్రాఫిక్  వల్ల  కానీ  బాస్  వల్లకాని ఏ తలనొప్పి  రానివ్వని ,నవరత్న  ఆయిల్  రాసింది . లైఫ్ బాయ్
ఎక్కడ వుంటే  ఆరోగ్యం  అక్కడ వుంది  అనే సబ్బుతో  స్నానం చేసి ,మగవాళ్ళ చర్మానికి  సరిపడే ఫెయిర్ నెస్ క్రీం
రాసుకుని వచ్చాడు . తనూ  చేసిన ''డబుల్  హార్స్  మినప గుళ్ళు ''తో  చేసిన  ఇడ్లీ తిన్నారు . అబ్బా అవి' ఇనప '
గుళ్ళు కా దండీ  మినప  గుళ్ళే  , ఎంత ఇడ్లీ కాస్త  గట్టిగా  వుంటే మాత్రం  హన్నా ...   ఇంతలో  చంటాడు లేచాడు .
రాత్రంతా  హాయిగా  నిద్ర పోయే  డైపెర్  మార్చి ,డాక్టర్  తల్లి  కాక పొఇన  వాడికి జాన్సన్  సోప్ తో  లాలపోచి  ,
డైపెర్ , జుబ్బా  వేసింది . వాడు మళ్లీ  బట్టలు తడుపు కునే లోపే  మనూ  వాణ్ణి ఒకసారి ఎత్తుకుని ''ఒంటి నాన్న
ఒంచె త్తున్నలు '' అని పయ్ కేగరేసి  తనూ  కిచ్చేసాడు . తన  వి  కే  సి  ప్రెడ్  చెప్పులేసుకుని ,సామ్ సుంగ్
పోన్ తీసుకుని ,సిగ్నో వేరా  డబ్బా లో  భోజనం  తీసుకుని ,అబద్దం  చెప్పినా  పోన్ చేసి ఒప్పుకునే  కిన్లే వాటర్
బాటిల్ ,అసెర్  లాప్టాప్  తో  అమేజ్  కార్ లో  బయల్దేరాడు  ఆఫీస్  కి . ముందు బైక్  వుండేది  కానీ  ఇ  సి  జి
ప్రాబ్లం  వల్ల  అందరు పుష్ప రాజ్  అంటుంటే ,ఈ  మధ్యే  కార్  కొన్నాడు .

బాబు కి  దుర్గా  నెయ్యి తో  ఇడ్లి పెట్టి  , కెంట్  వాటర్  పట్టించి ,లయ్ జోల్  తో  తుడిచిన  గచ్చు  మీద  కూర్చో
పెట్టింది . విమ్  తో  గిన్నెలు  కడిగి ,పది  చేతులు అవసరం లేని సర్ఫ్  ఎక్సెల్  వేసి ,బట్టలన్నీ  ఐ  ఎఫ్  బి
వాషింగ్  మెషీన్  లో  వేసింది . బట్టలు తడుపు కున్న చంటాడికి  బట్టలు మార్చిపాలు  పట్టి  పడుకో బెట్టింది .
లలితా బ్రాండ్  బియ్యం తో చేసిన  అన్నం ,సన్ఫ్లవెర్ ఆయిల్  తో  చేసిన  కూర  తెచ్చుకుని ,టి వి  చూస్తూ
తింది . ఆ సీరియల్ కి  అమృతాంజన్ ఏ డ్  మరి  వాళ్ళకి ఎలా తెల్సో తప్పకుండా  తలనొప్పి  వస్తుందని .
వెంటనే  ఒంటరి గా  వున్నా బలహీనం  కాదు ,''ఇక  స్టూ హూల్  మీదే నిన్చోవాలను కుంటా 'అనే  మీరా
కొబ్బరి నూనె  రాసుకుంది . తనూ పెద్ద అందగత్తె  కాక  పోఇన ' డవ్ ' మోడల్  లా  మాత్రం  వుండదు .
తెలుగు  షాది . కామ్  లో [తెలుగు లో'''షాది ''ఏమిటో ]చూసి మనూ  వాళ్ళు ఆమె ని ఇష్టపడి  వచ్చారు .
తనూ  వాళ్ళింట్లో  అంబికా  అగరబత్తి  వెలిగించి  వుండడం  తో  వెంటనే  పెళ్లి  చే సే సుకున్నారు? . చంటాడి
ఆ లా పన తో  వాడ్ని తెచ్చి లైట్  గా  వుండు లైట్  గా తిను  అనే  మేరీ  బిస్కెట్  తినిపించింది . తను మాత్రం
''అన్  హేల్డి  చిరుతిళ్ళు హాబిట్ ''  మన్పించే   3 రోజ్ ఎస్  టీ  తాగింది . పిల్స్  బరి ఆటా  తో  చపాతీ ,చేసి
బిగ్  బజార్  వారి బుధవారం మార్కెట్  లో  కొన్న ఆలు తో  కూర చేసింది . మమ్మీ అంటే నమ్మలేని సోప్
సంతూర్ , చిక్ షాంపూ  తోనూ స్నానం  చేసింది . గోద్రెజ్  బీరువా లోంచి , కళామందిర్  శారి  తీసి కట్టుకుంది .
పెళ్ళికి  మూడేళ్ళు  టైం అడిగే  క్రీమ్ [పెళ్లి అయ్యాక రాసు  కోవచ్చా ] రాసుకుంది . మనూ  వచ్చి 'కాకర కాయ
కూర ,కాకరకాయ  వేపుడు  ఈ  వారం లో ఇది నాల్గో సారి  అని విసుక్కోకుండా  ఉండేందుకు  జెట్  మాట్
వెలిగించింది . బాబుని ఎత్తుకుని ,ఏ షియన్  పెయింట్  వేసిన  తమ ప్రకృతి   విల్లా ముందు నించుంది .
తన  నోకియా  పోన్  లో ,డొక్కో  పో  సారీ  డొకో మో  సిమ్ వేసి  ఫ్రెండ్  తో కబుర్లు  చెపుతోంది . దూరంగా
తమ  అమేజ్ కార్  వస్తూ  కన్పించింది . మురిసి పోతూ బాబు కు చూపెట్టింది . మనూ  రాగానే ముగ్గురూ
లోపలికి   వచ్చారు . క్విక్కర్ లో కొన్న  సోఫా లో కూర్చున్నారు .పండుగ  సీజన్  కాబట్టి టి వి  లో వస్తున్న
ముద్దుల  పోటీలు  చ చ  అచ్చుతప్పు ,ముగ్గుల పోటీలు  చూస్తూ కూర్చున్నారు . ఆ  తర్వాతేమో .....
రాత్రి భోజనం  చేసి ,బాబుని  బజ్జో పెట్టింది . బోంబే డైయింగ్  బెడ్ షీట్  వేసి ,యంగేజ్  స్ప్రే  చేసింది .
 హబ్బా ఇంకా  ఏమిటి చూస్తున్నారు ? ఇంకేమి రాస్తాం ? టుయ్  .......... టుయ్..   సెన్సార్ . బై ..........



ఏమిటో   భయంగా  వుంది  ఈ  కధ  చదివి అందరూ  , నన్ను  పిచ్చి  తిట్లు  తిట్టరు  కదా !!!!!!!!!!!!!
 [ఎందుకన్నా మంచిది ] కేవలం సరదా  కే నండోయ్ ............

                                      **********************************