Total Pageviews

Thursday, January 29, 2015

' లై' సెన్స్ .


నమస్తే , నేను వనిష  . ఈ మధ్య ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను . నాన్న గారు నా ర్యాంకు చూసి ముచ్చటపడి  స్కూటీ కొని ఇచ్చారు . మొన్నటి వరుకు దగ్గరలోని హై స్కూల్ కు  సైకిల్ ఫై వెళ్ళడం వల్లనా బండి నడపడం వెంటనే వచ్చింది . కాలేజీ కి కూడా తీసుకుని వెళ్ళాను . కాని నాకు L.L.R లేదని ఆన్ లైన్ లో 475 రూపాయిలు కట్టి R.T.O లో exam రాసి  తెచ్చు కున్నను . ఆరు నెలలు లోపల టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలని మూడు నెలల  లోపే కాలేజీ మానుకుని మా నాన్న  గారి తో వెళ్ళాను . రెండు గంటలు నించుని నించుని ....  ఉంటె అప్పుడు పిలిచి నీ license లో 50 c.c లోపు అని ఉంది అని నాకు" చావు కబురు చల్లగా చెప్పి" వెళ్లి 50 c.c బండి తెమ్మని నన్ను పంపించాడు(అంటే బయిటికి పోమని కసురు కున్నారు లేండి ...!) . 50 c.c అంటే "లూనా" బండి తెసురాలెం  కదండీ ..... ! అందుక అది అలా  పోయింది . అంతటి తో పొయిందా  అంటే లేదు !అక్కడ టెస్ట్ ఇవ్వడం కోసం ఫీజు కట్టేను  అంటే మల్లి 475 రూపాయిలు . మొంతం కలిప్తే మొత్తం 1000 రూపాయిలు పొయింది . దానికి అదనంగా టెస్ట్ ఫెయిల్ అని  ముద్ర కూడా వేసారు . ఇక లాభం లేదని  ఒక డ్రైవింగ్ స్కూల్ ద్వార 2000 రూపాయిలు కి ఒప్పించాడు . దాంతో మేము ఒప్పుకుని L.L.R కోసం వెళ్ళాము . న అల్లవాటు ప్రకారం ఎలాగు ఎక్షమ్ రాయాలని వెళ్ళితే అతను అవసరం లేదని నన్ను లోపల కూర్చో పెట్టి నా ఫోటో తీసుకుని చేతిలో L.L.R  పెట్టి వెల్లమనాడు . మరి ఎక్షమ్ అంటే అదేమీ అవసరం లేదని నా వైపు నవ్వుతు చెప్పాడు . అప్పుడు అనుకున్న "డబ్బులు ఉంటె ఎన్ని పని లేని పనులో అని " అనుకుంటూ ఇంటికి వెళ్ళాను . నా  టెస్ట్ డ్రైవ్ సమయం రాణే వచ్చింది . ముందు జాగ్రత్త గ అతని దగ్గరుకు వెళ్లి ఎం తెసుకేలాలి అని అడిగ్తే 'ఏమి  అవసరం లేదు L.L.R చాలు అని అన్నడు' . ఎందుకైనా మంచి దాని నా ఫోటో , ఆధార కార్డు xerox తెసుకుని వెళ్ళాను . నా టెస్ట్ నేను ఇచ్చె సాను . ఇన్స్పెక్టర్ నను పిలిచి నా పాస్ స్లిప్ తేసుకోమన్నాడు . నేను ఆనందంగా వెళ్ళాను . అతను నా thumb  impression అడిగాడు . నేను ఆ మెషిన్ పైన వెలు పెట్టాను . కానీ అది  detect  అవ్వలేదు . దానితో నా ఆధర్ కార్డు అడిగాడు . నేను నా ఆధర్ కార్డు xerox ఇచ్చను . అత ను ఇది పనికి రాదు అని అన్నాడు . నాకు ఒరిజినల్ కావాలని కసురు కున్నారు . అతని mood పొద్దున్న నించి బాగా లేదంట ......!ఎందుకంటే అతని బండి ని ఎవ్వరో బైక్ వాడు accident  చేసాడని అతను  నన్ను కసురు కున్నదు. మేము చాల దూరం నుంచి వచ్చాం  అని xerox  తెసుకోమని బతిమ లాడం కానీ విన లేదు . దానితో మా నాన్న మాళ్లి ఇంటికి  బైలుదేరారు .మా ఇంటికి ఇంకా ఇక్కడికి 3 గంటల సమయం పడు తుంది .  వెళ్లి  నేను అక్కడే కూర్చుని ఉన్నాను . అప్పుడు ఒక పిల్ల వాళ్ళ నానగారి తో వచ్చింది . తను  టెస్ట్ ఫెయిల్ అయింది . ఇంకోసారి అవకాసం ఇచ్చాడు . ఆమె మల్లి ఫెయిల్ అయింది . ఆమె బయిటికి వెళ్లి 10 సమోసాలు తెచ్చి ఇచింది . అంటే టెస్ట్ ఇంకోసారి ఇవ్వకుండానే లైసెన్స్ ఆమె చేతికి ఇచ్చాడు . దాని తో కంగు తిన్నాను . ఇంతలోకి అతని డ్రైవర్ నాతో మాట్లదాడు . అతని బండిని ఒక్కడు accident  చేసాడని అనుకే mood  బాగాలేక అల ప్రవర్తిసునదని లేకుంటే ఆధర్ కార్డు xerox తీసుకుంటాడని చెప్పు కొచ్చాడు .  నాకు చాల కోపం వచ్చింది . ఇంతలోకి మా నాన్న గారు వచ్చారు . ఆ ఆధర్ కార్డు అతనికి చుపిదామని వెళితే అక్కడ ఒక మనిషి (అదే ఆ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్) 'పోనీ లెండి sir  పాపం ఆ అమాయి పొద్దున్న నించి కూర్చుంది అని చెప్పు కొచ్చాడు '. అంటేఅతను ను స్టాంప్ వేసి ఇచ్చాడు . వాడి మూడ్ బాగాలేదని మా నాన్న గారి ని వెన కి పంపించి మరి ఆధర్ కార్డు తెమన్నాడు కానీ దాన్ని వైపు కనీసం చూడను కూడా లేదు . దాని కోసం నాకు మా నాన్న గారికి నాకు  తిండి లేదు . దానికి అదనంగా సమయం వృధా అయింది . మొతానికి నా లైసెన్స్ చేతికి వచ్చింది . అక్కడ ఏ  రూల్స్  లేవు , వారి మూడ్  మాత్రమే ,ఇంకో ఆమె
వస్తే  కార్ లో  ఆమె భర్తని  కూడా  వెళ్ళనిచ్చాడు  టెస్ట్ ఇవ్వడానికి  నాకు  చాల బాధ  అన్పిచ్చింది . స్టూడెంట్
ఒకతను వస్తే 'ఏరా'  నీకు  ఇంకా april  వరకు వుంది కదా  పోయి మల్లి రా  అంటూ మర్యాద లేకుండా  మాట్లాడి
వెళ్ళ  గొట్టాడు . అతను  చిన్న బుచ్చుకుని వెళ్లి పోయాడు . వాళ్ళు ఏమి చెబితే అదే నడుస్తుంది అక్కడ .
                                                                                                                                  *************

ప్రమాదాలు  జరిగి నప్పుడు ,హడావిడి చెయ్యడం , తర్వాత మళ్లీ  మాములే , అది కూడా  సెలబ్రిటి  లైతే నే
అసలు మన వ్యవస్థ లోనే  ఎన్నో అవస్తలున్నాయి ,ఇదంతా మారాలంటే  చిన్నప్పుడు  మా అమ్మమ్మ
చెప్పిన కధలో లాగా  రాజకుమారుడు  గుర్రం మీద  రావాలి ,కాదు కాదు ,రాజకుమరున్ని  ఎన్నో
ఇబ్బందులు పెట్టె మాంత్రికుడు  రావాలి ,అప్పుడే  ''ఓమ్  హ్రీం  హాం ఫట్ ''అంటూ చిత్రంగా  మన కష్టాలు
మాయం చేసేస్తాడు . మాంత్రికు డినే  ఎందు కడిగానంటే ,మన ''ఒకే ఒక్కళ్ళు ''చాలామందే చెతులెత్తె సారుగా .

ఆ రోజు  డ్రైవర్ ఉండుంటే  అతను  బ్రతికే వాడు అనుకునే  వున్నత  స్తాయి కి  ఎదిగి పోయాము . మరి
డ్రైవర్  పొతే  ? పేదవాడు,    పేదవాడే గా ,     పేదవాడి  ప్రాణం   గడ్డి పోచతో సమానం  మనకి . లైసెన్స్
ఇచ్చే చోట  సక్రమం గా  వుంటే ,చాల వరకు ప్రమాదాలు  తగ్గుతాయని  ఆలోచించ రెందుకో  మరి ,
నడపడం వచ్చినవారికి ,ఖచ్చి తంగా '' నియమాలు'' ,తెలియ పరిస్తే ,చాల ప్రాణాలు కాపాడవచ్చు .


                                          ****************************************

Thursday, January 22, 2015

ప్రయాణం చేస్తున్నారా ...



భయపడే వారు ,వ్యక్తిగతం గ  తీసుకునేవారు  ఈ టపా  చదవద్దని  మనవి .
మీరు  ఎక్కడికన్నా  వెళ్ళాలను కుంటున్నారా ,అదే ప్రయాణం చెయ్యాలను  కుంటున్నారా ,మీ తల్లి తండ్రులను కాని ,అక్క చెల్లెళ్ళను ,అన్నాదమ్ము ళ్ళను ,చూసి రావాలను కుంటున్నారా అని ? ఐతే ఒకపని  చెయ్యండి . మీరు
వెళ్ళే దారి పొడవునా ,కొండలు ,లోయలున్నాయా ,ఘాట్ రోడ్ వుందా , చెరువులు  అడవులున్నాయా ,అని ముందు గా  తెలుసు కొండి . తర్వాత  మీ డబ్బంతా  వెచ్చించి , వాటర్ ప్రూఫ్ ,ఫైర్ ప్రూఫ్ ,బాంబు  ప్రూఫ్ ,అంటే
బాంబు లు పేలితే  నట్లు మేకులు  గుచ్చు కోకుండా  అన్నమాట . తలనించి కాలి బొటన వేలిదాక ఒక డ్రెస్ కొనండి .
వ్యోమ గామి  లాగన్నమాట . మీ ఆదార్ కార్డు కూడా  కాస్త పెద్ద గా పోటో ఫ్రేం కట్టించి  మీదగ్గర  పెట్టుకోండి ,ముఖ్య
గమనిక ఏమిటంటే  అది తడవకూడదు ,కాలకూడదు ,అదన్నమాట . ''తర్వాత '' మన గుర్తింపు  కార్డు అదే మరి.
వెళ్ళే ముందు  భీమా  చేయించండి ,విల్లు వ్రాసి పెట్టండి . ఏమో తిరిగోస్తామో  లేదో ? బస్సెక్కితే  లోయలో పడి
పోవచ్చు ,డ్రైవర్ తాగి వుంటే అసలే పోవచ్చు . రైలు ఎక్కితే  నీళ్ళలో పడచ్చు ,నిప్పు అంటుకోవచ్చు . కారు ఐతే
అంతే సంగతులు ,అదే తగలడి  పోవచ్చు . విమానమా ! ఇంకే   అడ్రస్  గల్లంతన్నమాట . చచ్చామని తెలిస్తే
ఏడుస్తారు ,బ్రతికున్నామని  తెలిస్తే ఎదురు చూస్తారు . ఏమయ్యమో  తెలియక పొతే ,అదొక త్రిశంకు స్వర్గం
ఇక్కడ త్రిశంకు నరకం అనాలేమో !

 మీ అదృష్టం  బాగుండి  క్షేమంగా  వూరు చేరినా ,మీరేక్కిన ఆటో  ని  అదుపు తప్పిన  కారు  గుద్దేయ్యొచ్చు .
మీరు రైలు  ఎక్కినట్లయితే  తస్మాత్ జాగ్రత్త , ఏ  హిజ్రాలో  వచ్చి ,ఏదడిగితే అది ఇచ్చెయ్యండి [సీంగిల్ మీనింగే ]  లేక పొతే రైల్ లోనించి  తోసేసినా  తోసేస్తారు .  ప్రాణాలకే  ముప్పు రావచ్చు .బెర్తు మీద  వాలే టప్పుడు  మీ
విలువైన వస్తువులు  చేత్తో పట్టుక్కు చోండి ,అర్ధ రాత్రి  దొంగలు వచ్చి భోగి  అంతా  దోచేస్తుంటే ,తన్నులు తినక
ముందే సమర్పించేయండి . ఎక్కడా  ఫిర్యాదు చెయ్యకండి . ఫలితం  వుండదు . ఇంత జరిగి  మీ సహస  యాత్ర
ముగిసి  మీరు మీ వాళ్ళని కలిసి క్షేమం   వెళ్లి లాభం గా తిరిగొచ్చార ? ఇకనేం  మీరు '' నిజ జీవిత  విజేతలు ''
 మళ్లీ ఇప్పట్లో ప్రయాణం పెట్టుకోకండి ,పోన్ లో మాట్లాడండి ,స్క్యప్  లో  కళ్లారా మీ  వాళ్ళను   చూసుకోండి .

ఒక  గృహిణి గా బయటికి  వెళ్ళిన  భర్త ,పిల్లల కోసం నేను పడే ఆందోళన మాత్రమే  మరోటి కాదని  సవినయం
 గ మనవి  చేస్తున్నాను . ఎవరినైనా నొప్పించి నట్లయితే  ,మన్నించండి .
                                     *************************************``

Friday, January 16, 2015

అందరూ ఊరెళ్ళి పోయారు .









       
     
                                           
 పతంగుల సరదా ..........
ఏమో  ఎందుకన్నా  మంచిది . 



                                   


ఎన్టీఆర్  గార్డెన్ 




లుంబిని పార్క్  

నిలబడి ,నిలబడి  కాళ్ళు  లాగేస్తున్నాయి ,ఎవరూ భోజనానికైన పిలవరు? 

పిల్లల  సరదా  కూడా  ముఖ్య మే కదా .........

********************************************************************************

Thursday, January 15, 2015

సక్రాంతి శుభాకాంక్షలు .



                                     
                                            రత్నాలయం  ...దేవాలయం లో .........

మా ఇంట్లో ...... 




పూర్వం బియ్యం పిండితో  వేసే వారట ,చీమలకి ఆహరం గా ,తర్వాత  ముగ్గు పిండితో ,ఇప్పుడు  నేను రాళ్ళ
ఉప్పుతో వేసాను . రంగు పీల్చి ,వాకిలి  కళ  కళ  లాడుతోంది . పాపం  చీమలు  కదండీ .....

ఇవి నేను ఇంట్లో చేసిన  బాద్ షా  లు , అయ్యో  భయపడకండి ,చాల బాగా  వచ్చాయి ,ఎవరికన్నా  కావాలంటే
ఎలా  చెయ్యాలో చెప్తాను . అదే రాస్తాను . హబ్బా.. ధైర్యంగా చేసుకోవచ్చు ,నాది  హామీ ,మీకన్నిటికి  భయమే .


ఇక్కడ చూడండి , పూర్ణాలే  చేశాను [బూరెలు ]  మరి ఇప్పుడన్నా  నమ్ముతారా !




****************************************************************************

Wednesday, January 14, 2015

భోగి శుభాకాంక్షలు

అందరూ  ఐక మత్యం గా  వుండాలని,   పండుగ సంతోషం గా జరుపుకోవాలని  ఆశిస్తూ ............. 

భోగి శుభాకాంక్షలు .                                  








***************************

Thursday, January 8, 2015

నేను ఇలా కొన్నాను మరి ,


నేను ఏప్రిల్  నెల నించి ,ప్రణాళిక తో  వున్నాను ,ధర తగ్గింది  కనుక  బంగారం  కొందాం అని . ఎంత కొన్నాను ఏమి
కొన్నాను ,అనేది  పక్కన  పెట్టేస్తే ,బంగారం కొనే  చోట  ఎలా వుంది  అనేది మీకు  చెప్పాలని ,ఎవరికన్నా ఉపయోగ
పడచ్చని పించి ఇది  రాస్తున్నా ...  మొదటిగా  రొజూ ధర  ఎంతవుంది  అనేది  చుస్తున్దేదాన్ని ,నేను అనుకున్న ధర
ఒకరోజు  వచ్చింది . ఆరోజు ' k ' తో మొదలయ్యే  ఒక  షాప్ కి  వెళ్ళాము . రద్దీ బాగానే వుంది  ఒకామె వచ్చి  ఏమి
కొంటమో  అడిగి అక్కడ ఉన్న  సోఫాలో  కూర్చో మని చెప్పింది . అక్కడ చాల మందే  వున్నారు ,ఐనా  పావు గంట
లో  వచ్చి  మమ్మల్ని  పిలిచింది . బహుశా చిన్నది కొంటే ,తర్వాత పిలిచేదేమో ! నేను నాకు కావలసిన  వస్తువు
బరువు ,పొడవు  చెప్పేను . ఆపొడవు  లేవని డిజైన్ నచ్చితే  రింగ్స్  పెడతామని చెప్పేరు . సరే అన్నాను .
ఏవి నాకు నచ్చలేదు అనే కన్నా ,అస్సలు డిజైన్స్  లేవు  అంటే బావుంటుందేమో ! వాళ్ళు  నాకు నచ్చచెప్పడం
మొదలు  పెట్టారు ,నచ్చక పొఇన  కొనడానికి  అది  తక్కువ ధర కాదుగా ,మళ్లీ  మార్చామా ,సగానికి  మాసి
పోతాము . ధర తగ్గి పోవడం తో  వాళ్ళు బాగా బాధలో ఉన్నట్లున్నారు ,కొత్త గా ఏమి లేవు . నేను  లేచేసెను .
దగ్గరలోనే ఉన్న  మరో 'k ' కి  వెళ్ళాము . అబ్బే .. వాళ్ళు అంతే ,నాకర్ధమయ్యింది , బయటపడ్డాము  వాళ్ళు
వెంట పడుతున్నా  వినలేదు . విదేశాల్లో శాఖ లున్న మరో షాప్ అదీ  శ్రీ  కే' నే ,అక్కడ ' ఈగలు' ఏమి చేస్తాం .
అని  వాళ్ళని కూడా వదిలించు కుని , ఒక 'n ' కి వెళ్ళాము ,హబ్బబ్బో  ఎన్ని డిజైన్సో ,ఎంత రద్దీ ,వాళ్ళు పావుగంట
ఎదురు చూసాక ,నగలు చూపించడం  మొదలు పెట్టారు . మొదటి ''వాయ'' లోనే వాళ్ళకి నా అభిరుచి తెలిసి
నాకు నచ్చేవే చూపించారు . చాల త్వరగా ఎంచు కున్నాను .

ఇక అప్పుడు మొదలైంది ,అసలు కధ .  మజూరి  గ్రాముకి ,150,  తరుగు తులా నికి  ఎంతో  తెలుసా  మనం
నాలుగు తులాలు  కొంటే ,ఒక తులం ధర వాళకి  ఇచ్చేసి రావాలి . నేను  మజూరి కాని ,తరుగు  కాని ఒకటే
ఇస్తానని చెప్పాను . [టి  వి  తెలివి ] అందుకతను  వెంటనే ఒప్పుకున్నాడు . మజూరి [మేకింగ్ చార్జ్ ]తీసేసాడు.
వెళ్లి ఓనర్ ని  తీసుకు  వచ్చాడు ,ఆయనతో  బేరం మొదలైంది . కొంచం మాట్లాడేక ,దిగి వచ్చాడు . ఏదో చీరల
షాప్ లా  ఈ బేరలేమి టో  నాకు అర్ధం కాలా !అదే అడిగాను ,మెత్తగా  మాట్లాడడం మొదలు పెట్టాడు తరుగు  బయట వేరే  షాప్ లో అంతలేదన్నాను . మీరు ఎంత చెబితే అంతే  వేస్తానన్నాడు [?] సరే అని పదకొండు
శాతం  అన్నాను . అతను కాసేపు  చర్చలు జరిపేడు ,నేను అప్పటికే ఎక్కువ చెప్పానా ,అనుకుని ,బిగిసి
పోయా ,నేను చెప్పిన ధరకి ఇస్తే  ఇవ్వండి ,లేకపోతె ఫరవాలేదన్నట్లు  మొహం పెట్టాను . మనసులో మాత్రం
నాకది బాగా నచ్చేసింది . ఇంతే కాక  తొమ్మిది ముత్యలకి 5 వేలు ,4 అన్ కట్  కి మరో ధర వేసి  చూపాడు
సి జేడ్స్  వేరే ధర ,వెరసి  తులం ముప్పై వేలు ఐంది .  ఏతా  వాతా  బాగానే  వడ్డించారు 24వేలకి కొనాలని          వెళ్తే  ,ఇలావుంది  మరి ముప్పైఅప్పుడు కొంటే  ఏమిటి పరిస్తితి ?. వస్తువు చేతిలో పెడుతూ  తరచూ  మా
షాప్ కె రావలన్నాడు . అదేమన్నా కూరల  కొట్టా  ,మళ్లి  మళ్లీ  రావడానికి ? నవ్వాపుకుంటూ  అటు వైపు
తిరిగి పోయాను  మా వారి మొహం చూసే  ధైర్యం  లేదు మరి ?................

                                   ***************************************

Thursday, January 1, 2015

కొత్త గా వచ్చిన రెక్కలు [ హ్యాపీ న్యూ ఇయర్ ].










 మాంచి  ఐ  టి వుద్యోగం ,ఐదు  అంకెల  జీతం , కాలేజ్  విడిచేసి ,రెక్కలు విప్పుకుని ,విశాల ప్రపంచం లోకి 
హాయిగా  స్వేచ్చ గా  అడుగు పెట్టి ,సంపాదన  భారం  తో ,కాంపస్  సెలక్షన్  ఇచ్చిన  ఆత్మా విశ్వాసం కొండొకచో 
గర్వం కూడా , డ్యూటీ  చేసి  రావడం  అంటే ఏదో  సాధించేసాం ,అనే భావం . అదే  నాన్న పాతికేళ్ళు గా సాధించి 
అలసి పోయారని  మర్చి పోయే  క్షణాలు ,వాటిగురించి ఆలోచించే టైం లేని ,స్నేహితులు . గజి బిజీ ఎంజాయ్ 
మెంట్ ,ఓహో లైఫ్  అంటే ఇదేరా ! అంటూ కాలం దొర్లించేసే  రోజులు . ఇక్కడే కొంచెం ,చెప్పాలి ,వింటానంటే ........

ఒకో కంపెనీ  రూల్  ఒకో లా  వుంటాయి . ఒకనెల  ఫోర్మెల్స్ ,ఒక నెల  కేసుఅల్స్  అంటూ  డ్రెస్ కోడ్ . కాబ్  కి , 
పోట్ లక్  కి , నైట్  డ్యూటీ లో  తినడానికిఖర్చు,  ఖరీదైన  షూ లు  , చెప్పులు  ,ఓ  నాలుగు  జతలైన  వుండాలి  . 
ఇవి కాక  నెల నెలా ,కంపెనీ తరపున  ,పళ్ళ  డాక్టరో , కళ్ళ  డాక్టరో , జుట్టుకి  కూడా ట్రై కాలజిస్ట్  వస్తారు . 
వచ్చి చెక్  చేసి ,మందులు ,మాకులు  రాస్తారు . పళ్ళకి  క్లిప్ ,లేదా వైటనింగ్ , స్కిన్ కి  టాన్  ఐంది , 
సన్ స్క్రీన్  లోషన్ ,  జుట్టుకి షాంపూ ,కండిషన్ ఎర్  , సబ్బులు సెంట్లు  ఉండనే  వుంటాయి . ఇన్ని వాడుతూ 
ఇంట్లో  అమ్మకి కాని , నాన్న కి  కాని  బాగా లేదని  వాళ్ళు అలాగే బండి  లాక్కొ స్తున్నారని ,ఆలోచన కూడా 
రాదు . ఎందుకంటే కొత్తగా  వచ్చిన వుద్యోగం కదా ! . వీకెండ్ లో   లేదా  మంత్  ఎండ్  లో ,రిసార్ట్స్  కి వెళ్లి 
రిలాక్స్  అవ్వడలు . కంపెనీ  తీసుకెళ్తుంది  మరి , కాదనడాని కి లేదు .  తల్లేమో  చీకట్లో  రాకండి  నాన్నా  అని 
జాగ్రత్త చెప్తుంది  వస్తే ఏమి అవుతుందో , ఆమెకి తెలుసు మరి ,'' మన  రాష్ట్రం లో తాగడాని కే  కాని ,తిరిగి 
ఇంటికి  రావడానికి , పర్మిషన్  లేదయ్యే ...''  ఐనా  తెలియనట్టే  సాగనంపుతుంది . అది  ఆమె దురదృష్టం . 
 కొన్నాళ్ళు చూసి  తండ్రి  ఇంట్లో ఎమన్నా  జీతం ఇచ్చేది  వుందా అని  అడుగుతాడు . ఈ జీతం  సరిపోదని 
మళ్లీ  పి  జి  చేస్తామంటారు .  లేదా సర్టిఫికేట్  కోర్సులు ,  ఆ  పెద్దాయన  భుజాలకు  మళ్లీ  బరువుమొదలు .
ఇంతా చేసి  వాళ్ళకు జాబు  వస్తే సరే  లేక పొతే బిజినెస్  అంటారు . మళ్లీ లక్షలతో పని . అదిబాగా నడిచే 
సరికి  ఎన్నేళ్ళు  పడుతుందో ........... తల్లి పిల్లల  బిజినెస్ లో  తల్లి తండ్రులే ఎక్కువ నష్ట పోతున్నారని 
పిస్తోంది . వాళ్ళకేగా బొచ్చె లో రాయ ? ఈ లోపు  పెళ్లి ఐతే  అసలే మొండి చెయ్యి  ,పేరెంట్స్ కి గొయ్యి .
కాస్త పెద్ద వాళ్ళ గురించి  కూడా పట్టించు  కుంటే ఎంత బాగుంటుంది ,ఎంతో  శ్రమకోర్చి ,నెత్తురు  పంచి 
ఇచ్చి ,అందం ,ఆరోగ్యం  ధారపోసి , పెంచడానికే  సత్తువంతా  ఖర్చు చేసి న తల్లిని , వీళ్ళ ఆనందాల 
కోసం శారీరక  శ్రమతో అలసి పోయి ,వీళ్ళ సరదాలు తీర్చడం కోసం ,పని చేసే  చోట ,పది మాటలు  పడి 
పైకి చిరునవ్వు పులుముకుని ,పడిన కష్టం పైకి తెలియ కుండా ,ఏ దడిగినా  సరే అనే ఆనాటి  నాన్న 
ముఖం ఒక్క  సారి  గుర్తు చేసు కుంటే ,కుటుంబం  కోసం ఏ దైనా  చెయ్యగలం  అన్పిస్తుంది  . ఇదంతా 
కేవలం '' మధ్య తరగతి  మిధ్యా  భారతం '' ధనికులకు  ఈ ఇబ్బంది లేదు  ఎందు కంటే డబ్బు' కల 'వారు .   బీదలకు ఈ బాధ లేదు . వాళ్ళు ఎప్పుడూ  రెక్కలను నమ్ముకు బ్రతుకు తారు . ఎటూ  చెందని  ,
మధ్య  తరగతి  వాళ్లకి మాత్రం  ఎన్ని నియమాలో , 

అందరూ ఇలాగె వున్నారని  కాదు  కాని  ,చాల మంది  ఇలాగె  వున్నారు . పెద్ద వాళ్ళ అదృష్టం  బట్టి ,
 మీలో  పేరెంట్స్  ని చూసు కుంటున్న వాళ్ళు చెయ్యి ఎత్తండి ప్లీజ్...   నేను ఎత్తడం  లేదు  ఎందుకంటే 
లేడీస్  కోటా లో  తప్పించు కున్నాను  .                          


********************************************