Total Pageviews

Monday, June 30, 2014

ఇద్దరిది ఒకె పేరు ............

 సండే  పేరుకే పనులు  మాత్రం బోలెడు . ఆల్వాల్ రైతు బజార్  వెళ్లి కూరలు ,పళ్ళు తెచ్చి అవన్నీ  ఫ్రిజ్ లో సర్ది , నాన్వెజ్  వండి,  తిని ,అబ్బబ్బో ఎన్నిపనులు , అవన్నీ పూర్తయ్యి మద్యాన్నం  పేపర్ తీసాం . చంద్ర న్యూస్   చదువు  తున్నారు . నేనేమో సాయంత్రం  వెళ్ళడానికి ఈవెంట్స్  ఏమి  ఉన్నాయా  అని  చూస్తున్నాను . ఇంతలో  నా సెల్  రింగ్ అయింది . నంబర్ చుస్తే  కొత్తది   ఈ టైం లో  ఎవరూ చెయ్యరు . లేవగానే ఫోన్  పలకరింపులు  ఐ పో తాయి
 ఒక  వేళ  పర్సనల్ లోన్  కావచ్చు ,బ్యాంకు లు  సండే  కూడా పంచేస్తున్నాయా  అనుకుంటూ  ఆన్ చేశాను .
 'నమస్తే  నా పేరు  నిరుపమ  మీరు  తనుజ కదా ' అంది . అవును  అన్నాను . మీతో కొంచెం  మాట్లాడ వచ్చా ?  అంది . ష్యూర్  నేను  వరాలు ఇచ్చే దేవతలా  బిల్డప్ప్ ఇచ్చెను . మీది   బి  టెక్   అయిందా  అని  అడిగింది . నిజం  చెప్పొద్దూ , నకేదన్న  నచ్చు తుంది  కానీ చదువు  మాటంటే  కాలుద్ధి . ఎన్ని ప్రయత్నాలు  చేసిన  పేరు పక్కన  డిస్క్ , తప్ప డిగ్రీ చేర్చు  కోలేక పోయాను . ఇంక  బి  టెక్  ఒకటా  నా  మొకానికి ? 'ఎందుకు ' అన్నాను , కాదండి   మీ  నాన్నగారు  మీ బయో డేటా  ఇచ్చారు , మాతమ్ముడి  కోసం  వాడేమో ఫలానా సొల్యు షన్స్ లో పంచేస్తున్నాడు  మీకు  జాబ్ లేక పోఇన   ఫర్లేదు  జాబు పెట్టించు  కునే  పరపతి  వాడికి ఉంది ' అంది . అయోమయం  లో ఉన్న  నేను  మా నాన్న బయో డేటా  ఇవ్వడ మేంటి ? ఆయనే కదా వద్దు  మొర్రో అంటున్నా  వినకుండా  ముద్దుల మేనల్లుడి కి ఇచ్చి[  'బాల క్రిష్ణ కాదు ] కట్టబెట్టాడు . మనసు మార్చు  కున్నడా  నాన్న  నువ్వు  నాన్నవి  కాదు దేవుడివి  కూతురికి  ఒక పెళ్లి  చెయ్యడమే  గగన మైన  ఈ రోజుల్లో  నాకు మరో  సంబంధం  చూస్తున్నావా  నిజంగా దేవుడివి  నాన్న దేవుడివి  అనుకుని  ఆనంద భాష్పాలు  తుడుచుకుని  ఒక్క నిముషం  అనిచెప్పి , తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్  లా 'యే  దండనక  దండనక  అని  స్టెప్పేసు  కుని  'చెప్పండి  నాన్న  మేకు  ఫోన్  చేసారా  మీరు  మాట్లాడారా ' అనడిగేను   ఆత్రుతగా . 'అబ్బే మీ తాత గారు  మాట్లాడారు , బయో డేటా ఇచ్చి వెళ్లారు  మీతో  ఒకసారి  మాట్లాడ మంటే ఫోన్ చేస్తున్నాను ' అన్ది.  తాత  గారా ? ఇద్దరు  తాతల్ని పైకి  పంపే సాను  కదా  'మీకు అసలు ఎవరు కావాలి ' అన్నాను  'మీరు తనుజ  కదా  మీది ఫలానా కులమేకద  మీతోనే మాట్లాడాలని చేశాను . నంబరు కూడా  ఇదే  మీ అమ్మగారు  కూడా  మిమ్మల్ని ఒప్పించ మన్నారు . 'అమ్మా నువ్వు కుడానా , పెళ్ళికి ముందు ఎప్పుడు సినిమాకి పంప లేదని పంపినా నలుగురు సెక్యూరిటీ కూడా పంపావని పరదాలు [కర్టైన్ ] సర్దేసి నన్ను లోకం తెలియకుండా పెంచావని ఎన్నిఅనుకున్నాను ,అలాంటిది  ఇలా ,ఎలా , మారిపోయా వమ్మా ? అనుకుని 'మీరొక పని చెయ్యండి తాతగారి ఫోన్  నమ్బరిస్తారా  అనడిగా  'ఓ  విత్తనాల సత్తి  బాబు గారు కదా మీతాతగారి  పేరు ?... ' కాదండీ అయన  నాకు బాబాయ్ అవుతారు , నమ్బరివ్వండి  అనితీస్కున్నాను . మీతో సాయంత్రం మాట్లాడ తాను  అని చెప్పాను . చంద్ర వేపు చూస్తూ  టి  వి  లో సుమ  వేస్కుంటుంది  కదా అలంటి లంగా ,ఓణి  లు ఒక మూడు కావాలి ' అన్నాను . ఎందుకు  కోపంగా అడిగారు . ఒకటి  పెళ్ళికి ,ఒకటి రీసె ....... 'ఆమె  బి టెక్  కావలన్నట్లుంది ? ఈయన టైమింగ్  ఉంటుందే  నేను గాలి పెట్టిన బలున్ లా  ఉన్నప్పుడు  ఒక గుండు సూది పుచ్చు కుని  ఆ చుట్టు ప్రక్కలే  తిరుగు తుంటారు సమయం చూసి గుచేస్తారు . తుస్స్సు ........ మంటూ గాలి పొతే  సంతోషం  తనకి . పెద్ద వాళ్ళు  కదా పడు కుని  ఉంటారను  కుని  సాయంత్రం  బాబాయ్ కి  ఫోన్ చేశాను విషయం విని  నవ్వుకొని  వివరాలు ఇచ్చింది నేనే మీ చెల్లెలు వినయ [అయన కూతురు ,తన  కూతురు కి నీ  పేరే పెట్టు కుంది . బయో డేటా  తనది ఇచ్చి కాంటాక్ట్ నంబరు  నీది ఇచ్చాము  రేపో ఎప్పుడో  నీతో మాట్లాడ దమను కుంటున్నాము  ఇంతలోనే వాళ్ళు నీకు ఫోన్ చేసే సారు అన్నారు  అదీ  విషయం  అలా జరిగింది . పెల్లికుతురి  పేరు ,నాపేరు  ఒకటే కావడంతో ఇలా  ఐంది , ఏమాట కా  మాట చెప్పు కోవాలి చంద్ర చాల  మంచోడు కదా . 

Wednesday, June 25, 2014

DRESS


 

  జూబిలీ  బస్ స్టాప్   దగ్గర  సిగ్నల్  పడింది , మా  కార్  ముందు  ఒక బైక్  వచ్చి ఆగింది . బైక్ పైన  ఒక అమ్మాయి  అబ్బాయి  ఉన్నారు  , అబ్బాయి  డ్రైవ్  చేస్తున్నాడు   అమ్మాయి  ఇద్దరికి  సరిపడే  చోటు  వదిలేసి ,అబ్బాయి  చేతుల  కిందు గా చెయ్యి లేసి  భుజాలు  బిగించి  పట్టుకుంది . తానెవరో తెయకుండా  ముఖానికి  గుడ్డ కట్టుకుంది  వెనుకభాగామంతా  వది లేసింది , రెండు నెంబర్ లు  తక్కువున్న జీన్స్ వేసుకుంది . రెండు ఇంచీలు  పొట్టిగున్న  టాప్  వేసింది  ,వేసుకున్నబట్టలు  ఎక్కడ కవర్  చెయ్యాలో  అక్కడ కవర్  చెయ్యట్లేదు . సిగ్నల్ వచ్చే వరకు ,జనం  టీ ,వి  చూసినట్లు ,చూస్తూ పండగ  చేస్కున్నారు . జీవితం లో  ఆమె కూడా చూస్కుని ఉండని  భాగం ఎగ్జిబిషన్ కి ,పెట్టింది . సిగ్గుతో నా తల వాలి పోయింది . ఈమధ్య పెళ్ళైన వాళ్ళు పిల్లల తల్లులు అందరూ  లెగ్గింన్స్  వేస్తున్నారు . వేస్కుంటే వేస్కున్నారు  కనీసం  మోకాళ్ళ వరకైనా టాప్ ఉంటె బాగుంటుంది . సైడ్ లో అంత డీప్ కట్ కాకుండా ,కొంచెం క్రింది కి  ఉంటె బాగుంటుంది . లేగ్గింన్స్  కాలేజ్ పిల్లలకు బాగుంటుంది . లేదా సన్నగా ఉన్నాకూడా ఓకే . కాని  గజరాజు కి  అటు ,ఇటు  గా ఉన్నా కూడా వేసుకుంటున్నారు . మీరు మొహాలకు గుడ్డ  కట్టు కుంటారు . మేము కళ్ళకు  కట్టుకో లేము గా . ఆఫీస్ కి చీర కట్టు కేల్లలేరు ,నిజమే కానీ బస్సు ఎక్కాలన్నా బండి నడపాలన్న కష్టమే ,కానీ చుడిదార్ ,పటియాల ,అంటూ చాల మోడల్స్ ఉన్నాయ్ . ఈ బట్టలు , కత్తి రించి నా జుట్లు ''ఎలపరం 'వచ్చేస్తోంది . సండే  ఏదైనా షాపింగ్ మాల్ కి  వెళ్ళండి ,బుల్లి గౌను ల్లో ,పెద్ద పాపలు ,చిన్న ,చిన్న నిక్కర్లు ,త్రీ ఫోర్త్ లు , వయసు తో సంబంధం లేకుండా వేసుకొస్తారు . సినిమా లో వేసుకున్నారంటే ,వాళ్ళకి షాట్ రెడీ అయ్యే వరకు ,కప్పి ఉంచు తారు . బయటికి వస్తే బౌన్సెర్స్  వుంటారు . మరి మనకి ?..  కొంచెం  వాడితే తెలుస్తుంది . తెర  వేరు ,జీవితం ,వేరు  మనం బయటకెళ్ళి  క్షేమం గా  తిరిగి రావాలంటే  మన బట్టలు ,ప్రవర్తన కూడా  ముఖ్యం . ఎంత ఫాషన్ అయిన  చెయ్యొచ్చు . కానీ సరీరభాగాలు  [స్కిన్ షో ] ప్రదర్శించడం  ఎంతవరకు  సమంజసం ?.  

 కొంచెం  వాడండి  పెద్ద ప్రయోజనం పొందండి  'గుడ్  లక్ '..........  

                                        ********************************

Thursday, June 19, 2014

పెళ్లి సంబంధం 2

అరుణ్  మెయిల్  ఐ  డి  కి ఫొటోస్  రాగానే  మూడు ఫొటోస్  లో ఒకటి సెలెక్ట్  చేసాడు . పేరు  మాన్విత ,ఇద్దరు అన్నలు  ,తనేమో  బి టెక్  చదివింది .  నాన్న ట్రావెల్స్  నడుపుతారట . ఇంతలో  ఎవరో అరుణ్ కి  చెప్పారట , డబ్బు  తీసు  కున్నాక  మంచి వి  చూపించరని . ఏమి చెయ్యాలి  అని  ఆలోచించాము , చివరికి  వద్దనుకున్నాం .   కానీ  మేరేజ్ బ్యూరో  వాళ్ళు ఫోన్  చేస్తూనే  ఉన్నారు . నేను ఏదో  చెప్పి తప్పించు  కుంటూ  వస్తున్నా . ఒక రోజు  అరుణ్ కే  ఫోన్ చేసి   అమ్మాయి  తల్లి రేపు  వస్తుందని  మాట్లాడమని  చెప్పారట . తను వెంటనే నాకు చేసాడు . నేను చంద్రకి  విషయం  చెప్పాను , 'ఏమి కాదు మాట్లాడు ' అన్నారు . అనుకున్నట్లే ఫోన్  వచ్చింది . 'పెళ్లి కూతురి  తల్లి వచ్చారు  మాట్లాడండి  అని ఫోన్  ఇచ్చారు . పరిచయాలు చేసుకున్నాం . పెద్దా విడ  గొంతు వింటే  చాల  మర్యాదస్తు రాలి లా  వున్నారు . మీరు  పెళ్లి చూపులకి  ఎప్పుడు  వచ్చేది  చెపితే  మా తమ్ముడు  వాళ్ళని  పిల్చు కుంటా మంది . మీ నంబరు ఇవ్వండి  అన్న  వెంటనే  మేరేజ్ బ్యూరో  ఆమె  తీసుకుని  మీరు డబ్బు కట్టకే నెంబర్  ఇస్తామంది . పెళ్ళికూతురు  వాళ్ళు డబ్బు కట్టేసారండి అనిచెప్పింది . సరే అంతా బావుంది కదా  అని డబ్బు కట్టేం .రెండు  నంబర్ లు  ఇచ్చారు . ఒకటి  వాళ్ళ నన్నది , ఇంటిది . వాళ్ళ నాన్నగారికి చేసాము . అయన బిజి  ట  ఇంటికి  మాట్లాడమన్నారు . ఆ నెంబర్ కి చేస్తే  ఒకపోష్  లేడీ ; యా  హూ  ఈస్  దిస్ ' అంది . నేను  మొ త్తమ్  చెప్పి వాళ్ళ అమ్మకిమ్మన్నాను . ఇంటికేల్లక చేపిస్తానని  అంది . నేను తెగ  మురిసి పోయా అసలే మనం బి ఏ  'డిస్క్ ' ఏమో  ఇంగ్లిష్  కోడలు  పిల్లలు కూడా ఇంగ్లిష్  లోనే ఏడుస్తూ ,నవ్వుతూ ,'అన్నీ ' ఇంగ్లిష్ లోనే  చేస్తుంటే  ఎంత  బాగుంటుంది ,అనుకున్న . వారం  తిరిగింది  ఎ  ఫోనూ రాలేదు . మగ పెళ్లి వాళ్ళ మయ్యె ... ఆరోజు  అంత  కంగారు పడింది  ఇప్పటికి చెయ్యలేదు . ఆఖరికి  నేనే చేసినా  ఎవరెవరో  తీసేవారు . పొంతన  లేని  సమాధానాలు , విసిగి  పోయి  ఇలా  కాదని , .... క్షణ  మేరేజ్  బ్యూరో  కి  చేశాను  మా  'కేసు ' చూసే  ఆమె  సెలవు  లో ఉందట . వచ్చేక  మాట్లాడమన్నారు . నేను  చేస్తూనే  ఉన్నాను ,పదిహేను రోజులు  గడిచాయి . అప్పటికి ఆమె  వచ్చింది . నేనెవరో  ఆమెకి  మొత్తం  గుర్తు చెయ్యాల్సి వచ్చింది . 'అయ్యో మీరా ఆ  అమ్మాయి కి  పెళ్లి కుదిరింది  కదా  మీరు  వేరే ఫొటోస్  చూడండి  పంపిస్తాను . అంది . ఇంకేమంటాను ,పొరగా పొరగా  మూడు  ఫొటోస్  పంపింది . ముమైత్  కి మార్పులు  చేసి నట్లు ఒకామె , వేదం లో ' కర్పూరం ' లా  ఒకామె ,మూడోది  మెల్లకన్ను . నేను ఫోన్  చేసి  చెడ మడ తిట్టేను , ఆమె ఏమి పట్టించు కోలేదు . ఇది మాములే అన్నట్లు ఉంది .  నా రక్తం  మరిగింది ,కళ్ళు ఎరుపెక్కి  పిడికిళ్ళు బిగిసు కున్నాయి . నా ఈగో హర్ట్ ఐంది . వెంటనే ఫోన్ తీసి  గుండె లదిరే  సౌండ్ తో బ్రేకింగ్ న్యూస్  వేసీ  ఛానల్ కి  ఫోన్  చేశాను . మాకు జరిగిన అన్యాయం  చెప్పాను . ఎలా  అయినా  ... క్షణ   ని  మూ ఇంచా లన్నాను  మాకు  జరిగిన  అన్యాయం ఎవరికీ  జరగ  కుడదన్నాను .  'తప్ప కుండా  మేడం అన్నాడు .
నేను -ఎప్పుడు  వెళ్తారు .
ఛానల్  వాళ్ళు -మీరెప్పుడంటే  అప్పుడే .
నేను -అవునా.. తక్షణమే  వెళ్ళండి .
ఛా  వా - మీరెప్పుడు  డబ్బిస్తే  అప్పుడే .
నేను - డబ్బే మిటి ..
ఛా  వా - ఒక పెళ్లి కొడుకుని  సెట్ చేసి  తీస్కేల్లాలి ,చిన్న కెమెరా ఉండాలి ,సంబాషణ రికార్డ్ చెయ్యాలి
   రెండు , మూడు ,సార్లు  అక్కడికి , ఇక్కడికి ,తిరగాలి  .. అంతా కలిసి పదిహేను , ఇరవయ్ వేలు  అవుతాయి .
నేను -ఆ ?
ఛా  వా -   ఆ ;;.....


ఇప్పుడు  అరుణ్ పెళ్ళి  జరిగింది ,బందువుల  అమ్మాయి  తో నే  . వాళ్ళు హ్యాపీ గా వున్నారు .

Wednesday, June 18, 2014

పెళ్లి సంభందం

 ఉదయం తొమ్మిది  గంటలికి  పెళ్లి . ఈ పెళ్ళిలో  ఎలా  అన్నా ఒక  మంచి అమ్మాయి  మా  అరుణ్  కి దొరకాలి ,అని  అనుకున్నాను . అరుణ్  మా  అక్క  కొడుకు . హైదరాబాద్ లో  విలయమ్స్'లో  జాబ్  చేస్తున్నాడు . నేను ,చంద్ర, అరుణ్   కలిసి  మండపం లో  గాలింపు  మొదలు  పెట్టాము . చాలామంది  అమ్మయిలు  వచ్చారు . 'కలర్స్' తో  కళకళ లాడిపోతోంది  మండపం . కానీ అదేంటో దేశం లో  తిండికి  కఱువు  వచ్చి నట్లు ఉంటే  సన్నగా వానపాము  లావున్నారు . లేకుంటే తినడమే  జీవిత ద్యేయం  అన్నట్లు  ఇటు పక్క ఎమ్ 'అర్ 'ఎఫ్ టైర్   అటు పక్క బ్రిడ్జిస్టోన్ , వున్నవాళ్ళు  కన్పిస్తున్నారు , లంగా  ఓణి , చూసి  అమ్మాయిలను  కోవాలి  తప్ప లేకపోతె .......... ఇంతలో ,అరుణ్  ఒక వైపు  చూపించాడు , ఓహో ..  నారాజా  మావాడి  పంట  పండింది . నిమ్మపండు  రంగు చీర లో  నిమ్మపండు  లా  మెరిసి  పోతూ  చాల  అందంగా ఉంది . అరుణ్ కేమో కానీ  నాకుమాత్రం పూల వర్షం  ,మెరుపులు  లాంటివన్నీ  అని  పించి నాయి . చంద్రని  వెతికి  పట్టుకున  అమ్మాయి ని  చూపించాం . తనకి  కూడా నచ్చింది . నీపంట పండింది  రా  అబ్బాయ్ 'అన్నారు . మావాడు ,' థాంక్స్ ' బాబాయ్'. అన్నాడు . పెళ్లి ఐంది , భోజనాలు  చేస్తూ ,కిలో  బరువున్న పళ్ళాలు పట్టుకు  తిరుగుతూ  అమ్మాయి కోసం  వేదికాము  ఒక చోట మూడు  నాలుగేళ్ళు ,బాబు  ఏడాది ,పాపకి  అన్నం పెడుతూ ఆమె ,నీళ్ళ గ్లాస్ పట్టుకుని  ఆమె  భర్త  కన్పించేరు . 'జిగ్'మని  తలలు తిప్పి ఒకరి  మొహం ఒకరు చూసుకున్నాం .. కరెక్  టైం కి వచ్చేసారుచంద్ర   'ఏమి టైం మిన్ గ్ వై 'అనుకున్న . రావడమే  అటు చూసి 'ఏరా  వాళ్ల  ఆయన ఇక్కడే  ఉన్నట్లున్నాడు  అడిగి  చూడ కూడద ', అన్నారు . అరుణ్  'అబ్బ  పిన్ని గుండెల్లో కలుక్కు మంది ' అన్నాడు . నాక్కూడా  అనుకుంటూ 'నువ్వేమి ఫీలవ్వకు నీకు  మంచి  పిల్లని  చూసే బాద్యత నాది అన్నాను . నాకప్పుడు తెలీదు పెళ్ళంటే మాటలు కాదు  నాకున్న అనుభవం ,అవగాహనా సరిపోవని .   అన్ని రకాల పేపర్లు  తెచ్చాము . మాట్రిమొని లకి ఫోన్ చేసాం .కొన్ని సెలక్ట్ [మా సామజిక  వర్గం ] సెలక్ట్  చేసాం . మూడు ఫోన్లు చేసాం అవేమంత  గొప్పవి కాదు కానీ ఒక ఫోన్  గురించి  మాత్రం  చెప్పాలి . kg  బంగారం ఇస్తారట అమ్మాయి కి ,నా కల్లుమేరిసాయి  ఇంకేం వాళ్ళకి చేశా ,ఆఫీసు లో రిసెప్షనిస్ట్ లా  చాల కాజువల్  గా మాట్లాడింది . పెల్లికుతురి  అక్కట  .   వివరాలడిగింది  చెప్పాను .

 ఆమె _ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ?

నేను -ఇక్కడే  హైదరాబాద్  లోనే 

ఆమె - ఎకంపనీ ?

  నేను -  అదేనండి   విలయమ్స్  నెలకి 80 వేలు వస్తుంది  అబ్బాయి  చాల మంచి వాడు  తల్లిని ,చెల్లిని  బాగాచూస్... 
ఆ మె -తల్లికి గంజి ఎయ్యనోడు  పిన్నమ్మకి  కోకేట్టాడఅంట  మా  అమ్మయిని ఎలా చూసు కుంటాడో మాకదే  ముఖ్యం . ఇంతకీ సాఫ్ట్ వేర్   ఇంజినీరేనా ? అంది .  నేను - కాదండి  చార్టెడ్ అక్కౌంట్ టెంట్  అన్నా ఆమె -మాకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్  కావాలి , అని ఫోన్  పెట్టేసింది . నేను  పట్టువదలని  విక్రమార్కిని లా మాట్రిమోని లన్ని  వెతకబట్టేను . ఒక మేరజే బ్యురోకి చేశాను . ఇన్నివేలైతే మీకు  నచ్చే వరకు చూపిస్తాం  తక్కువైతే  ,మూడే చూపిస్తాం . అన్నారు . 'నాకుముందు అమ్మాయి ల  ఫోటో లు  కావాలి డబ్బు కట్టాక మీరు  అల్లాటప్ప వి చూపిస్తే ' అన్నాను  ఆమె సరే ఫోన్ నంబర్ మాత్రం  డబ్బు కట్టాక ఇస్తాను  అంది . సరే అన్నా అరుణ్ మెయిల్ ఐ  డి  తీస్కుని మూడు ఫోటో లు పంపింది . 
  • ఇంకా  వుంది ....   


Monday, June 16, 2014

సినిమా

సినిమాలు  పెద్దగా ఇంట్రస్ట్ ,లేదు  ఎప్పటి  నించి అంటే కమలహాసన్ , టాలీవుడ్ వదిలేసి నప్పటినుంచి మ్యూజిక్  వినాలని ,కూడా  లేదు ఇదేప్పటి నించి అంటే ఇళయరాజా  తప్పుకున్నప్పటినించి . బెట్నయక్ ,వక్రి ,బూతు శ్రీ  పెహాద్  వాయించినదే ,వాయించే  తపన్ వచ్చినప్పటి  నించి . మావయ్యగారి నించి  మనవలవరకు  అందరూ  అక్కినేని  ఫాన్స్ .   'మనం'వచ్చిన  మూడో రోజే  టికెట్స్ తీచ్చేసారు . ఇంటి నుంచి  కొంపల్లి సినీ ప్లానెట్ కి పది  నిముషాలు పడుతుంది . పార్కింగ్ నించి  నన్ను చేయి పుచ్చు కుని లక్కెల్తున్నరు . సినిమాలో శ్రేయ ,నాగ్ ని  లాక్కెళ్ళి నట్లు . ఎంట్రన్స్ లో  భారీగా ఉన్నామె 'సార్ చెక్ చేయాలి ' అంది  వదలమన్నట్లు  చూస్తూ . నన్ను  లోపలి కి  తీస్కెళ్ళి  లైట్ గా  మసాజ్ అదే చెకింగ్ చేస్తూ  అబ్బురంగా చూస్తూ  చీర ఎంత మేడం? అంది . నేను  మురిసిపోతూ  'మూడు'అన్నాను వచ్చేస్తూ , ఆమె 'మూడంటే ' అడిగింది . ముచ్చట పడిఅడిగే  రేంజ్ కి ఉన్నదంటే  వేలేగా  ఆనుకొని 'వేలు' అన్నాను . అక్కడే ఉన్న చంద్ర అడిగేరు 'ఏమంటుంది ', చీర రేటు అడుగుతుంది . మా   మాసంభాషణ  విన్న వాళ్ళు 'జిగ్' అని తలలు  తిప్పి చూసారు . మెట్లు మీదుగా వెళ్ళాము ,ఎంత చెప్పినా లిఫ్ట్ లో  తేరు . అమ్మో ,అయ్యో అని కాళ్ళు నొక్కు కున్నాను . కుర్చుంటావా అన్నారు . ఎక్కడా , చోటే లేనిదే .,జనం చాల  బిజీ గా  ఉన్నారు . బస్తాలు ,బస్తాలు ,పాప్కార్న్  తినేస్తున్నారు ,బక్కెట్  బకెట్ల ,స్వీట్ కార్న్ నమిలేస్తున్నారు .ఒక  కరవాలానికి [కత్తి ]కి  ఆలూ చిప్స్ గుచ్చి ఇస్తున్నాడు . పక్కవాడికి తగిలితే ఇటు నుండి  అటు వచ్చేటు పదునుగా  ఉన్నదా ,ఆయుధం ,దాన్ని చూసి భయంగా  దూరం జరిగాను . చిన్న పిల్లలే  కాదు  పెద్దవాళ్ళు కూడా ఐస్ క్రీం  చప్పరించేస్తున్నారు .. కూల్ డ్రింక్స్  ఐతే హద్దే లేదు . జనం  లోపలికి వెళ్ళడం చూసి ,మేము కూడా వెళ్లి కుచున్నం . సినిమా మొదలైంది  మొదలు కళ్ళు ,ముక్కు ,చెవులు ,టేపేసి స్క్రీన్ కి అన్టించేసారు . ఎప్ప్పుడో కానీ  రాముగా చంద్ర  చాల ఎంజాయ్ చేస్తున్నారు . ఇంటర్వెల్ అయింది . మళ్లీ మొదలు ,వెళ్తున్నారు ,వస్తున్నారు . రెండు గంటలు ఓర్చు కోలేరా ,అనుకున్న,[వాష్ రూం కెళ్ళే వాళ్ళకి  కూడా వర్తి స్తున్ది]. చంద్ర రెండు చేతుల్లో ఫోన్లు పట్టుకుని మెసేజ్ ,మిస్ కాల్స్  చూసుకుంటున్నారు . ఒక కూల్ డ్రింక్ కొనితేలేదు . సినిమా అయ్ పోయింది . అందరం  వెళ్తుంటే కొంత మంది  కూర్చునే  ఉన్నారు .  ఇంకో షో  చూస్తారు  కబోలనుకున్న ,కాదని జనం నన్ను తోసుకుని బైట  వదిలేక  తెలిసింది . చంద్ర ని కూడా  అలాగే తో[తీ]సుకొ చ్చారు . నేను  ఒకటికి  రెండు సార్లు  చూసుకున్నాను . ఎందు కంటే  ఒకసారి యిలాగే బులుగు[బ్లూ]  రంగు షర్ట్  చూసుకుని  పార్కింగ్ దాక వెళ్ళిపోయా . ఈసారి మాత్రం  కర్ట్ గా ఉన్నా . హాల్ బైట పిట్జా కార్నెర్ ఉంది . హాల్ లోపల టిఫిన్ సెంటర్ ఉన్ది.
తనే  కొంటారని ,నేను ,నేనే చెప్తానని  తను  హైవే మీదికి  వచ్చేసామ్ . శ్రేయ ఘోషల్  పాట అనుకుంట ,ఘోషిస్తున్నారు . నాకేమో తగలడి  పోతోంది ,అదేనండి ఆకలి . సినిమా చాల బావుంది  కదా .. 'నేను 'ఊ '.  స్క్రిప్ట్  బాగారసుకున్నారు .,అన్నారు . నేను' ఊ '. నీకు  నచ్చ్హలేదా .. ''మనం  అని కాకుండా మేము  అని పెడితే  బాగుండేది , వాళ్ళ బ్యానర్ , వాళ్ళ నాన్నగారు ,వాళ్ళ కొడుకు ,కోడలు ,మనవలు ,వాళ్ళ ఇల్లు ,కార్లు ,కుక్కలూ . చంద్ర నవేపదోలా  చూసారు . హైవే 44 హోటల్  కూడా దాటేసాము . ఏమికొనలేదు . ఇల్లు వచ్చేసింది . అదేనండి
 మేము ఇంటి కొచ్చే సాము . ఫ్రెష్ అయినాక 'ఏమివండు తావు 'అన్నారు . అక్కడే  ఏదన్నా కోంటే సరిపొయెదికద , అక్కసంతా  వేల్లగాక్కేను . 'అరరే మరిగుర్తు చెయొద్దా ,' హైవే 44కి  వెళ్లి బిర్యానీ తేనా ,'ఇప్పుడా  వద్దులే ,''ఎంత సేపు ,మూడు కిలో మీటర్లే గ . వాడు అడు గు బొడుగు గీకి  పొట్లం  కట్టిస్తాడు . అన్నాను . మరెలా  అడిగారు . తనకి  నూడుల్స్ ఇష్టం ఉండదు ,నాకునా పతపగ [డ్రింక్ కొనలేడుగా ] నూడుల్స్  చేస్తా అన్నాను  'మరినీకో  అన్నారు . తనకు తెల్సు నాకునచ్చాదని ,నేను పెరుగన్నం తినేస్తా  అన్నాను  'సరే 'అన్నారు . కట్ చేస్తే ,తను నూడుల్స్ , నేను  పెరుగన్నం ,తింటున్నాం .తననే చూస్తూ తింటున్న నేను  నవ్వడం మొదలెట్టా ,ఏమైంది  అడిగారు . మీరు నూడుల్స్  తింటుంటే ,దారం ఉండకి చిక్కులు  నోటితో తీస్తున్నట్లు న్ది ... మళ్లీ విరగబడి  నవ్వడం మొదలుపెట్టాను
 ఎదప్పుడే  ఆగదు .......... 

Thursday, June 12, 2014

మారేడుమిల్లి




సమ్మర్  లో  కాకినాడ  వెళ్ళాము . నాలుగు రోజులకే  మామధ్య  మారేడుమిల్లి  వెళ్ళాలనే  చర్చ  వచ్చింది . చాన్నాళ్ళు  అక్కడవున్నందు  వల్ల ,అక్కడిప్రదేసాలు ,చాలా అందమైనవి కావడంవల్ల అలా అన్పించడం న్యాయం కాని  ఈసారి  వెళ్ళ డానికి కారణం 'బొంగు చిక్కెన్ ' మేము  అక్కడ ఉన్నప్పుడు  ఈవంటకం   లేదు . ఇప్పుడు దానిగురించి తెలిశాక ,కొత్త  వంటతిన్నట్టు  ఉంటుంది ,కొత్తచోటు  పిల్లలకి ,చూపించి నట్లు  ఉంటుందని  తప్పక వెళ్ళాలని  అనుకున్నాము . మరుసటిరోజు ఏడు గంటలకల్లా కార్లో  బయల్దేరాం . నాన్నగారు ,అన్నయ్య , వదిన ,నేను  వాళ్ళ పిల్లలు ,మాపిల్లలు . కాకినాడ  నుంచి జగ్గంపేట  , రాజపూడి  మీదుగా సాగింది . రాజపూడి ,దాటగానే ,సన్నగాచినుకులు  మొదలయ్యాయి  వాతావరణం  చాల బాగుంది . అసలే వేసవి ,ప్రొద్దున్నే చల్లనిగాలి  చినుకులు  కారు ఒకచోట  ఆపి ,వెంటతెచ్చు కున్న టిఫిన్లు ,కాఫీలు  పూర్తి  చేస్తుంటే  అక్కడికి ఒకతను  సైకిల్ కి  కల్లు ముంతలు  కట్టుకుని  వచ్హాడు . నేను మా  అన్నయ్య  కు చూపించాను , నీకోసం  కాబోలు అన్నాను  సరదాగా తనువెంటనే  అవును బావకి కొనిద్దామని  రమ్మన్నాను , అన్నాడు . నేను చుప్ ఇంక . మా పాప మామయ్య  నీ ఫ్యాక్టరీ ఎక్కడ  అని  అడిగింది . దాంతో  చుట్టూ  ఉన్న  అన్ని స్తలాలు ,చూపిస్తూ  ,హద్దులు చూపిస్తూ  అన్ని  మనవే  అంటూ చివరిగా చిన్నగా ఉన్న  తన 'చిన్న ' ఫ్యాక్టరీ చూపించాడు . [అందులో దుంపలు పొడి చేస్తారట ]. మేము గోకవరం  మీదుగా  రంపచోడవరం  వెళ్ళే టపడికి  వర్షం ఎక్కువ యింది . కాంక్రీట్ జంగిల్  నుంచి  వచ్చా మేమో ,అడవిలో వెన్నెలే కాదు ,వర్షం కూడా అందమే  అనిపించింది . మొత్తానికి తొమ్మిదిన్నరకి  మారేడుమిల్లి  చేరాము . మొదట  అన్నయ్య  ఒక  గిరిజనుడిని  పట్టుకుని ,బొంగు చిక్కెన్ చేయడానికి  మాట్లాడేడు . మేము  ట్రావెలర్స్ బంగ్లా  కి  వెళ్లి  కూచున్నాం . నాన్నగారు ,అక్కడే  ఫారెస్ట్  డిపార్ట్మెంట్  లో  పని  చేసారు  కనుక  అప్పటి  విశేషాలు చెబుతున్నారు. ఆ  బంగ్లా  గోరింటాకు  సినిమా లో కొమ్మ కొమ్మకో ........ సన్నాయి  అనే పాటలో  వుంటుంది . మధ్యానం వరకు  అక్కడే తిరిగి  చూసాము . మేము ఇంటినుంచి ,ఫ్రైడ్ రైస్ తెచ్చు కున్నాము . అన్నయ్య 'బొంగు చిక్కెన్ 'తెచ్చాడు . ఒక  ఆకులో మసాలా  నూని కలిపి  పట్టించి  వెదురు మద్యలో ఆకుని పోట్లామ్  కట్టి పెట్టేసి రెండు  పక్కల క్లోజ్ చేసి మంటలో కాల్చి ఇచ్చాడు . ఒకటి మూరపోడవున ,ఉన్నాయ్ . చాల తెలివి గా  వండిన వంటకం . నాన్వెజ్ ప్రియులంతా తిన వలసిన  వంటకం . ఎక్కడో కేరళ  కి వెళ్తాము  కాని  పక్కనే  ఉన్న మన వనరులు  గురించి  తెలుసు కోమని అనిపించింది .వాటర్ ఫాల్స్ చూడమని  చెప్పి నాన్నగారు  పడుకున్నారు .   మేము పిల్లలిని  తీసుకుని వెళ్ళాము . వర్షం కారణం గా చాల బురద గా  ఉంది . అక్కడ జలపాతం చేసే  శబ్దం బయట కే  విన్పిస్తోంది వరుసలో  పెంచిన చెట్లు  చెట్లకింద బెంచ్ లు  పచ్చని  లాను ,మద్యలో  కాలిబాట ,సంతోషం గా లోపలి  అడుగు  పెట్టాము . అక్కడున్న బెంచ్  మీద ఇద్దరు యువకులు కూర్చుని  మందు  తాగుతున్నారు . వాళ్ళు మమ్మల్ని  చూసి ''............. లావున్నారు ' అని కామెంట్  చేసారు . అన్నయ్య  కోపంగా  వాళ్ళ వైపు  వెళ్ళాడు ,వెళ్లి 'ఎలాకన్పించారు ' అని అడిగాడు . వాళ్ళు  కూడా  ఏమి  తక్కువతినలేదు  గొడవకి  వచ్చారు . అన్నయ్య ''ఎక్కడి నుంచో  వచ్చి  ఇక్కడి  వాళ్ళను  కామెంట్ చేస్తావా ' అని మీదకేల్లాడు . వాళ్ళేమో  ఇద్దరు ,తాగి వున్నారు . మేముసర్ది చెప్పి , బలవంతం  గా  అన్నయ్యని  తీసుకుని  లోపలికి  వెళ్ళాము . అక్కడ  చాల  బావుంది  కానీ ఎవరు  లేరు , బండలమీద  కూచో  వాలని  కాళ్ళు కడుక్కో వాలని  అన్పించింది . కాని  ఎందుకో ,అక్కడిక సేఫ్  కాదని  వేనుతిరిగాము . వెళ్ళాలంటే అక్కడొక  చేట్టుమాను మీదుగా  నడచి  రావాలి , ఒక్కరు  మాత్రమే వెళ్ళగలం  కాని  వాళ్ళు దాని  మీదనే  నుంచుని ఏదో  మాట్లాడు  కుంటున్నారు . వాతావరణం ,చూస్తె  వాళ్ళు  మమ్మల్ని అటకాఇన్ చడానికి  రెడీగా  ఉన్నట్లుంది . నాకు  మాపెద్దన్నయ్య ,గుర్తు  వచ్చాడు .  తానైతే ఇందాకే ఉతికేసేవాడు . ఎలారా  దేవుడా  అనుకున్నాను . అనవసరంగా  వచ్చాం  అనుకుంటున్నాం .  అన్నయ్య అడుగు ముందుకేసి 'బాస్ లేడీస్ వెళ్ళాలి చోటివ్వండి ' అన్నాడు వాళ్ళు వంకరగా  నవ్వుతూ  అడుగుముందు కేసారు  . నేను  వదిన వెనక్కి  చూసాం  అన్నీ రాళ్ళు రప్పలు  వెనక్కి  వెల్లడ మంటే,,,  విలన్ పరిగేట్టిస్తుంటే ,హీరోయిన్ మేడఎందు కేక్కుతున్ది అని  నవ్వుకునే  వాళ్ళం . ఇప్పుడదే చెయ్యాలని  సిద్దమయ్యాం   . కాని   ,ఇంతలో ముప్పై మంది వరకు  స్టూడెంట్స్  గోలగా  అరుచు కుంటూ ,దిగి వచ్చారు ,అందరూ   మగపిల్లలే  ,పైన జలపాతం  దగ్గర  ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనుకుంటా , వాళ్ళ రాకతో అ'' ఐ ' టి ' లు  ఇద్దరూ వెనక్కి  నడచి  మాకు  దారి ఇచ్చారు . బ్రతుకు జీవుడా  అని బయట  ఫడ్డాం . ఆ తొందరలో  వాళ్ళకి  అదేస్టూడెంట్స్  కి   థాంక్స్   చెప్పలేదు . వాళ్ళకే  తెలియకుండా  మాకు  చాల  సహాయం  చేసారు .  ఆ  విధంగా  మాపిక్నిక్  కొంచెం ,ఇష్టం ,కొంచెం  కష్టం  లా జరిగింది .

                                                         *************************

Monday, June 9, 2014

పెనువిషాదం






చిట్టి  తల్లులూ  చిన్ని నాన్నలు ఇది  ఇండియా.  మీరు  నేర్చు కోవలసినది ఇంటర్నెట్  , ఫేస్ బుక్ ,ఆర్కుట్ ,ట్విట్టర్ సెల్ ఫోన్ ఆపోరేటింగ్  ఇవి కాదు
1  . షిర్డీ వెళ్ళాలనుకొండి ఒల్వొబస్  లోయలో పడిపోతే తాళ్ళతో  ఎలా  పైకి  రావాలి
మంటల్లో చిక్కుకొంటే  బయటకు ఎలా దూకాలి
2. చెన్నై ఎక్ష్ప్రెస్స్  తగలడిపోతుంటే  బాత్రూం అద్దాలు  బద్దలుకొట్టి  బయటకు ఎలా రావాలి
3. ఏ  సాయంత్రం  వేళ  దిలుషుకనగర్  గోకుల్  చాట్  లోనో  బాంబు పెలితే  ఎలా తప్పించుకోవాలి
ఇవే  కాక, చదువుకొసమో  , ఉద్యోగంకొసమో  క్రూయీజ్  ఎక్కినా , కులుమనాలి వెళ్లినా  మీరు
పుట్టుకతోనే  గజఈతగల్లై  ఉండాలి. ఎ అంతర్జాతీయ  విమానం ఎక్కినా  ఎలా అంతర్ర్దానం  కాకుండా
ఉండాలో  కన్నవాళ్ళ  కడుపు  రగిలించకుండా  ఉండాలి అన్ట్టే  ఎంచెయ్యాలో అది తెలుసుకోవాలి.

ఒక చిన్న నిర్లక్క్యానికి  మూల్యం  24 నిండు ప్ర్రాణాలు  బలి అంట్టే  ఈ బాధ  మరువలేనిది  .



Thursday, June 5, 2014

మైనారావు

నా చిన్నతనంలో  ఎవరో  ఒక మైనా  తెచ్చి ఇచ్చారు   కొంత మంది గోరింక అంటారు  ,నల్లగా ఉండి  ముక్కుపాదాలు  పసుపు  రంగులొ ఉండేవి  మనం ఏమిపలికితే  అదేఅనేది . పంజరంలో మూడు భాగాలుగా  ఉండేది  . మొదటిది ,మద్యలో  కర్రా ,  పైన చిన్న   కొయ్యలా వుండేది ,మైనావాలినప్పుడు  ఊగుతూ ఉండేది . చిన్న  ఆవకాయ ముద్ద తనాహారం . జామకాయలు పళ్ళు స్నాక్స్ అన్నమాట . ఒకకప్పులో పసుపునీళ్లు  పెడితే  స్నానంచేసి ,రెక్కలార్చుకునేది . పంజరం క్లీనింగ్ కోసంనీళ్ళ పైప్ పెట్టేవాళ్ళం . అప్పట్లో కరివేపాకు ఇంటింటికి  గంపలో  తెచ్చే వారు . కవలసినవాళ్ళు గుప్ప్పెడు బియ్యంకాని ,చిల్లరకాని  ఇచ్చి కొనేవాళ్ళు . మావీధిలొకి  వచ్చే  ఆమేపీరు అప్పయమ్మ . కరేపాకూ అనిఆమె  అరవగానే , మైనా కూడా 'కరేపాకూ 'అని  అరిచేది . ఆవెంటనే  మాపిలుపు  కూడతనేపిలిచేది ,'అప్పయమ్మా 'అని సైకల్ మీద  అమ్మడానికి వచ్చే ,తోటకూరా , గొంగూరా  అన్నీ పిలుస్తుండేది . 'నీపెరెంటీ ' అంటే ,మైనారావు  అనేది ,తర్వాతర్వాత నీపేరెంటి  అంటే  తిరిగి 'నీపేరెంటి 'అనేదనుకోండి  ,ఎవరెలా  నవ్వితే  తనూఆలా నవ్వేది . ఎవరో నోరుముయ్యి  అనినేర్పించారు ,ఇక మొదలు  అందర్నీ ఆదేఅనేది .    మాన్పించడం  చాల  కష్టమైంది . ఎందుకంటే మైనా  మాటలు  వినడానికి  పెద్ద పెద్ద  వాళ్ళుకూడా వచ్చేవారు .అప్పట్లో  కాకినాడలో అది టాక్ ఆఫ్ ద టౌన్ మరి . ఆదివారం వస్తే  మైనాకి  'వస' ఆరగ  తీసి  నోట్లో పోసెవారు .  అందుకేనేమో  ఏదంటే  అదనేది . మాపిల్లలందరికి మైనా  ఆంటే  చాలా  ఇష్టం . 8సం  మాఇంట్లో మెంబరు గా  ఉంది . ఒకభోగి రోజు  ప్రొద్దునే చనిపాయింది . చాన్నాళ్ళు  నాకు మైనా  పంజరంలో ఎగురు తున్నట్లుఉండేది   ఆపంజరానికి  కట్టిన మువ్వలసడి ఇప్పటికిగుర్తే . నాకిప్పుడు పెట్స్  అంటే ఇష్టంలేదు మైనా  అడవిలోనే ఉంటే  ఇంకో  మైనా తో   సంతోషం గా  ఉండేదేమో  ఆనుకుంటూ ఉంటాను .      

Tuesday, June 3, 2014

సంగీతం

 డాన్సు కథ అల ముగిసింది మరోసారి  సంగీతం నేర్చుకుంటనన్ను  .ఎక్కువ బయిటికి పంపే వారు కాదు కనుక టీచర్ ని ఇంటికి పిలిచారు . ఆవిడ  కూడా తమాషా గ ఉండేవారు . గడ్డి లాంటి  జుట్టు ఎలాగో దగ్గరికి లాగి జడ వేసేవారు . జబ్బకి చేతి సంచి తగిలించుకుని , జాకెట్ జుబ్బ నో తెలియకుండా మధ్యరకంగా ఉండేది . ఆమె బ్లౌస్ నులు  చీర కట్టుకుని వచ్చేది . 4 రోజులు నేర్పగానే "ఫా ఫా" గొంతు బాగుంది ,శ్రుతి లోకి రావాలంటే పొద్దునే నేర్పాలి అంది . సరే అని రమ్మనారు . ఆవిడ "పాప" అనడానికి "ఫాఫా"    అనేవారు .పల్లు బాగా ఎత్తుగా వుండడం వల్ల  ముందు పళ్ళ మధ్య ,ఖాళీ  వల్ల శబ్దం అల వచ్చేదో కానీ సరిగమలు కూడా అంతే ... "స రి గ మా ఫా " అనేది .నెను ఎలాగన్నా సంగీతం నేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాను . అందుకే ఏమి అనకుండా ఆమె దగ్గరే నేర్చుకుంటునాను 5:30 నుంచి అర్రుకు అటు ఇటు గ సాగేది క్లాస్సు ,తరువాతే రెడీ అయి స్కూల్ వెళ్ళే దాని . అఇతే ఒక శుభోదయన్నమా సంగీతం సాధనం  జోరుగా సాగుతుంది మేడమీద ,ఇంతలో మెట్లమీద అలికిడి అయింది . ఎవ్వర అని చుస్తే మా నాన్న గారు .నాకు తెలిసి అయన అంత పొద్దునే ఎప్పుడు లేవలేదు .నన్ను చూసి కూడా నవ్వలేదు .ఏమిటా అని చూస్తున్నా . ఆయన తిన్నగా కోపంగా మా  దగ్గరికి వచ్చారు . నడుం మీద చెయ్ వేసుకుని టీచర్ ని కోపంగా చూస్తూ "ఎవ్వరు నువ్వు " అని అడిగారు  . ఆమె భయపడుతూ'"ఫా ఫా " కి సంగీతం నేర్పడానికి వచ్చాను ' అని అంది . 'ఇప్పుడు ఈ చలిలో న ' అని అడిగారు . "ఇప్పుడు అయితేనే గొంతు శ్రుతి లో పడుతుందని ఏదో చెప్పా బోయి "లే  ముందు వెళ్ళు " అని మెట్ల వైపు చెయ్ చూపించారు . సంచి తీస్కుని సినిమాల్లో చూపిస్తారు అలా మాయం అయిపాయింది .నన్ను తెసుకుని కిందకి వచ్చే సారు .ఇందులో నాకు తెలిసిన నీతి  ఎంటంటే  "చలిలో ,మంచులో సంగీతం నేర్చుకోవడం దోషం అని అర్ధమైయింది .
తరువాత మైయినారావు ...........................